ప్రపంచ మార్కెట్లో విడుదలకు సిద్ధమైన Rolls Royce ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్; వివరాలు

ప్రపంచం ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహన రంగం వైపు పరుగులు తీస్తుంది. దీనికి ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది వాహన వినియోగారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో భాగంగానే ప్రముఖ లగ్జరీ వాహన తయారీ సంస్థ అయిన Rolls Royce కూడా తన కొత్త ఎలక్ట్రిక్ Rolls Royce కారుని రేపు ప్రపంచ మార్కెట్లో ఆవిష్కరించనుంది. ఈ కొత్త Rolls Royce ఎలక్ట్రిక్ కారు గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ప్రపంచ మార్కెట్లో విడుదలకు సిద్ధమైన Rolls Royce ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్; వివరాలు

Rolls Royce కంపెనీ ఎట్టకేలకు తన మొదటి ఎలక్ట్రిక్ లగ్జరీ కారును ప్రపంచానికి అందించబోతోంది. కంపెనీ ఇప్పటికే చాలా సంవత్సరాలుగా ఈ ఎలక్ట్రిక్ కారుపై పనిచేస్తోంది. అయితే ఇప్పుడు మార్కెట్లో ఆవిష్కరించడానికి సిద్ధమయ్యింది. ఈ కారు కేవలం అల్ట్రా-రిచ్ కస్టమర్ల కోసం మాత్రమే వినియోగించబడుతుంది.

ప్రపంచ మార్కెట్లో విడుదలకు సిద్ధమైన Rolls Royce ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్; వివరాలు

Rolls Royce కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారు గురించి అందించిన సమాచారం ప్రకారం, ఈ లగ్జరీ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కి.మీ.ల పరిధిని అందిస్తుందని తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ కారు ప్రపంచ మార్కెట్లో ఒక అరుదైన మరియు అద్భుతమైన వాహనం కానుంది.

ప్రపంచ మార్కెట్లో విడుదలకు సిద్ధమైన Rolls Royce ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్; వివరాలు

రోల్స్ రాయిస్ CEO అయిన Torsten Muller-Otvos (టోర్స్టెన్ ముల్లర్-ఓట్వోస్) సోమవారం సాయంత్రం ఆలస్యంగా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ లింక్డ్‌ఇన్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేసినప్పుడు గ్లోబల్ ఆవిష్కరణను ధృవీకరించారు. అంతే కాకుండా మేము ప్రపంచ మార్కెట్లో మొదటి ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెడుతున్నామని తెలిపారు.

ప్రపంచ మార్కెట్లో విడుదలకు సిద్ధమైన Rolls Royce ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్; వివరాలు

Rolls Royce (రోల్స్ రాయిస్) ఎలక్ట్రిక్ కార్ల ప్రపంచంలోకి ఇప్పుడే అడుగుపెడుతోంది. కానీ వచ్చే 20 ఏళ్లలో కంపెనీ పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ కార్లను అందిస్తుంది. 2011 లో రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఆధారంగా మొదటి ఎలక్ట్రిక్ కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. 2016 లో, రోల్స్ రాయిస్ విజన్ నెక్స్ట్ 100 అనే కాన్సెప్ట్ కారును ప్రదర్శించింది. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ మరియు అటానమస్ ఫీచర్స్ కలిగి ఉంటుంది.

ప్రపంచ మార్కెట్లో విడుదలకు సిద్ధమైన Rolls Royce ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్; వివరాలు

రోల్స్ రాయిస్ కంపెనీ యొక్క ఇంజనీర్లు, డిజైనర్లు మరియు స్పెషలిస్టుల అద్భుతమైన నైపుణ్యాలతో ఎంతో అంకిత భావంతో ఈ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నట్లు కూడా కంపెనీ సీఈఓ ముల్లర్-ఓట్వోస్ తెలిపారు. అయితే కంపెనీ యొక్క రాబోయే ఎలక్ట్రిక్ కారు గురించి అధికారిక వివరాలను వెల్లడించలేదు.

ప్రపంచ మార్కెట్లో విడుదలకు సిద్ధమైన Rolls Royce ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్; వివరాలు

ఇదివరకు ఈ కారు గురించి వెలువడిన కొంత సమాచారం ప్రకారం ఇందులో కొన్ని స్టాండర్డ్ అధునాతన ఫీచర్స్ ఉంటాయని చెప్పవచ్చు. రోల్స్ రాయిస్ నుంచి రానున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు పేరు 'రోల్స్ రాయిస్ సైలెంట్ షాడో'. దీనికోసం కంపెనీ ఇటీవల ఇంగ్లాండ్‌లోని సైలెంట్ షాడో అనే ఎలక్ట్రిక్ కారు కోసం పేటెంట్ దరఖాస్తును దాఖలు చేసింది. రోల్స్ రాయిస్ కంపెనీ ఇప్పటికే తన అనేక కార్లలో షాడో పేరును ఉపయోగించింది. రోల్స్ రాయిస్ సిల్వర్ షాడో ఇందులో ప్రధాన కారు.

ప్రపంచ మార్కెట్లో విడుదలకు సిద్ధమైన Rolls Royce ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్; వివరాలు

ఈ కారును సైలెంట్ షాడో పేరుతో తయారు చేస్తున్నారు. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ఈ మొదటి రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ కారు 100 కిలోవాట్ల బ్యాటరీని ఉపయోగిస్తుంది. ఇది ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేసిన తరువాత దాదాపు 500 కి.మీ వరకు ప్రయాణించగలదు. ఈ ఎలక్ట్రిక్ కారుతో రోల్స్ రాయిస్ కంపెనీ తన ప్రధాన ప్రత్యర్థి బెంట్లీ ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్‌లతో పోటీ పడటానికి తగిన సన్నాహాలను సిద్ధం చేస్తోంది.

ప్రపంచ మార్కెట్లో విడుదలకు సిద్ధమైన Rolls Royce ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్; వివరాలు

Rolls Royce కంపెనీ ప్రపంచ మార్కెట్లో అత్యంత ప్రసిద్ధి పొందిన విలాసవంతమైన లగ్జరీ వాహన తయారీ సంస్థ. ఈ కంపెనీ యొక్క కార్ల ధరలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల సామాన్య వాహన కొనుగోలుదారులు దీనిని సొంతం చేసుకోవడం అసాధ్యం. కంపెనీ ఈ మధ్య కాలంలో 'బోట్ టెయిల్' అనే 200 కోట్ల రూపాయల కారుని కూడా తయారు చేసింది.

రోల్స్ రాయిస్ బోట్ టెయిల్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో వి12 6.75-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌ ఉంటుంది. ఈ ఇంజిన్ రోల్స్ రాయిస్ బ్రాండ్ అయిన కల్లినన్, ఫాంటమ్ మరియు బ్లాక్ బ్రిడ్జ్ వంటి వాటిలో కూడా ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 563 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

Most Read Articles

English summary
Rolls royce set to debut first electric ultra luxury car tomorrow details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X