కియా సెల్టోస్; ఇప్పుడు మరింత కొత్త లుక్‌లో.. వీడియో చూడండి

భారత మార్కెట్లో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థ కియా మోటార్స్. కియా మోటార్స్ 2019 లో కియా సెల్టోస్ ఎస్‌యూవీని దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ ఈ ఎస్‌యూవీని విడుదల చేసినప్పటినుంచి అత్యధిక ప్రజాదరణ పొందింది.

కియా సెల్టోస్; ఇప్పుడు మరింత కొత్త లుక్‌లో.. వీడియో చూడండి

దేశీయ మార్కెట్లో కియా మోటార్స్ యొక్క సెల్టోస్ ఎస్‌యూవీ అమ్మకాలలో హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీకి ప్రత్యర్థిగా నిలుస్తుంది. కియా మోటార్స్ సోనెట్ ఎస్‌యూవీని దేశీయ మార్కెట్లో, లగ్జరీ ఎమ్‌పివి సెగ్మెంటే కార్నివాల్ మరియు కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో విక్రయిస్తుంది.

కియా సెల్టోస్; ఇప్పుడు మరింత కొత్త లుక్‌లో.. వీడియో చూడండి

కియా మోటార్స్ దేశీయ మార్కెట్లో అతి తక్కువ వ్యవధిలోనే తనదైన ముద్రను వేసుకుంది. అయినప్పటికీ కంపెనీ దీనిని కొన్ని అదనపు ఫీచర్లతో అప్‌డేట్ చేయడానికి ఎదురు చూస్తోంది. సెల్టోస్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన మిడ్ సైజ్ ఎస్‌యూవీలలో రెండవది. ఎక్కువమంది వాహనదారుల మొదటి ఎంపిక ఈ కియా సెల్టోస్అ. ఇది చాలావరకు అధునాత లక్షణాలను కలిగి ఉండటం వల్ల ఎక్కువమంది కొనుగోలుదారుల ద్రుష్టి దీనిపై పడింది.

కియా సెల్టోస్; ఇప్పుడు మరింత కొత్త లుక్‌లో.. వీడియో చూడండి

మనం ఇంతకు ముందు కథనాల్లో చాలా వరకు కస్టమైజ్ చేసిన సెల్టోస్ ఎస్‌యూవీలను గురించి తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే కియా సెల్టోస్ చూడటానికే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దీనిని మీరు కూడా ఇక్కడ గమనించవచ్చు. దీనికి సంబంధించి వీడియో కూడా అందుబాటులో ఉంది.

కియా సెల్టోస్; ఇప్పుడు మరింత కొత్త లుక్‌లో.. వీడియో చూడండి

ఈ కారుకి సంబంధించిన వీడియో ఇప్పుడు ఎఫ్ఎఫ్ ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయబడింది. మీరు ఈ కారుని చూడగానే ఇది ఒక హర్రర్ సినిమాకు సిద్ధంగా ఉన్న కారులా కనిపిస్తుంది. వైట్ సెల్టోస్ ఎస్‌యూవీని బ్లడ్ స్పాటర్ డిజైన్‌తో తయారు చేశారు.

కియా సెల్టోస్; ఇప్పుడు మరింత కొత్త లుక్‌లో.. వీడియో చూడండి

సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్లలోని కార్లు ఈ విధంగా కస్టమైజ్ చేయబడతాయి. కానీ భారతదేశంలో ఈ ఎస్‌యూవీని ఈవిధంగా అనుకూలీకరించడం ఇదే మొదటిసారి. ఈ బ్లడ్ స్పాటర్ డిజైన్‌ను బంపర్, రూఫ్, డోర్ మరియు బోనెట్‌పై చూడవచ్చు. అయితే ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

కియా సెల్టోస్; ఇప్పుడు మరింత కొత్త లుక్‌లో.. వీడియో చూడండి

ఈ విధంగా కస్టమైజ్ చేయడానికి కియా సెల్టోస్ ఎస్‌యూవీ యొక్క టాప్ ఎండ్ మోడల్ ఎంచుకున్నారు. ఈ ఎస్‌యూవీలో గ్లోసీ బ్లాక్ టైగర్ నోస్ గ్రిల్, ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్, ఎల్‌ఈడీ హెడ్ లాంప్, ఎల్‌ఈడీ ఫాగ్ లాంప్, ఎల్‌ఈడీ టైల్ లాంప్ ఉన్నాయి.

కియా సెల్టోస్ ఎస్‌యూవీ 1.5 ఇంజన్ ఆప్షన్లతో 1.5 లీటర్ ఎన్‌ఏ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో డీజిల్ మరియు 1.4 లీటర్ టర్బో పెట్రోల్‌తో విక్రయిస్తున్నారు. ఇది మంచి పనితీరుని అందిస్తుంది. అంతే కాకుండా ఇందులో మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

కియా సెల్టోస్; ఇప్పుడు మరింత కొత్త లుక్‌లో.. వీడియో చూడండి

కియా సెల్టోస్ ఎస్‌యూవీ ధర భారతదేశంలో రూ. 9.95 లక్షల వరకు ఉంటుంది. కియా సెల్టోస్ దేశీయ మార్కెట్లో ఎంజి హెక్టర్, హ్యుందాయ్ క్రెటా, నిస్సాన్ కిక్స్ మరియు స్కోడా కుషాక్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం సెల్టోస్ ఎస్‌యూవీ యొక్క 7-సీట్ల వెర్షన్ ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. విడుదలైన తరువాత, ఈ వెర్షన్ హ్యుందాయ్ అల్కాజార్, ఎంజి హెక్టర్ ప్లస్ మరియు టాటా సఫారి ఎస్‌యూవీలకు ప్రత్యర్థిగా ఉండనుంది.

Image Courtesy: FF Films

Most Read Articles

English summary
Seltos Suv Customized With Blood Spatter Design. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X