భారత మార్కెట్ కోసం స్కొడా భారీ ప్లాన్స్; దేశవ్యాప్తంగా 225 డీలర్‌షిప్‌లు!

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కోడా ఆటో, భారతదేశంలో తమ స్థిరత్వాన్ని నిలుపుకునేందుకు భారీ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. స్కోడా ఒకప్పుడు చాలా ప్రీమియం బ్రాండ్‌గా ఉండటం మరియు అతి తక్కువ సర్వీస్ నెట్‌వర్క్‌ను కలిగి ఉండటం కారణంగా భారత మార్కెట్లో ఆశించిన విజయాలను సాధించలేకపోయింది.

భారత మార్కెట్ కోసం స్కొడా భారీ ప్లాన్స్; దేశవ్యాప్తంగా 225 డీలర్‌షిప్‌లు!

అయితే, స్కోడా ఆటో ఇప్పుడిప్పుడే భారత మార్కెట్‌ను మరియు కొనుగోలుదారుల ట్రెండ్‌ను అర్థం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ధరకు ప్రధాన్యతనిచ్చే భారత్ వంటి మార్కెట్లలో సరసమైన ధరకే ఉత్తమమైన ఉత్పత్తులను అందించడం ఎంతో అవసరం. సరిగ్గా ఇదే పాయింట్‌ను ఆధారంగా చేసుకొని స్కోడా తమ సరికొత్త కుషాక్ ఎస్‌యూవీని దేశీయ విపణిలో విడుదల చేసింది.

భారత మార్కెట్ కోసం స్కొడా భారీ ప్లాన్స్; దేశవ్యాప్తంగా 225 డీలర్‌షిప్‌లు!

ఫస్ట్ టైమ్ ఎస్‌యూవీ కొనుగోలుదారులకు మరియు తమ ప్రస్తుత కారును అప్‌గ్రేడ్ చేసుకోవాలని చూసే వారికి స్కొడా కుషాక్ చాలా చక్కటి ఆప్షన్‌గా ఉంటుంది. స్కోడా ఆటో ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీని కేవలం రూ.10.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో మార్కెట్లో విడుదల చేసింది.

భారత మార్కెట్ కోసం స్కొడా భారీ ప్లాన్స్; దేశవ్యాప్తంగా 225 డీలర్‌షిప్‌లు!

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, స్కోడా కుషాక్ ఎస్‌యూవీని మార్కెట్లో ప్రారంభించడం ద్వారా తమ డీలర్ నెట్‌వర్క్ సుమారు 15 శాతం పెరిగిందని కంపెనీ తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు 2021 నాటికి దేశవ్యాప్తంగా 100 కి పైగా నగరాల్లో తన ఉనికిని విస్తరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

భారత మార్కెట్ కోసం స్కొడా భారీ ప్లాన్స్; దేశవ్యాప్తంగా 225 డీలర్‌షిప్‌లు!

ఆగస్టు 2021 నాటికి కొత్తగా 100 నగరాల్లో తమ టచ్‌పాయింట్లను ఏర్పాటు చేయడంతో కంపెనీ యొక్క సేల్స్ మరియు సర్వీస్ సెంటర్ల సంఖ్య 170 కి చేరుకోనుంది. అంతేకాకుండా, 2022 చివరి నాటికి భారతదేశం అంతటా 225 కి పైగా టచ్ పాయింట్లను కలిగి ఉండాలని స్కోడా యోచిస్తోంది.

భారత మార్కెట్ కోసం స్కొడా భారీ ప్లాన్స్; దేశవ్యాప్తంగా 225 డీలర్‌షిప్‌లు!

తాజా సమాచారం ప్రకారం, వచ్చే నెల చివరి నాటికి, స్కోడా ఆటో తమ కొత్త డీలర్‌షిప్‌లను సాంగ్లి, భిల్వారా, ఫరీదాబాద్, పంచకుల, నవసరి, వాపి మరియు హార్డోయిలతో సహా అనేక ఇతర నగరాల్లో ప్రారంభించబోతోంది. ప్రస్తుతం ఈ సంస్థకి టైర్ II మరియు III నగరాల్లో 90 కి పైగా డీలర్‌షిప్ కేంద్రాలు ఉన్నాయి.

భారత మార్కెట్ కోసం స్కొడా భారీ ప్లాన్స్; దేశవ్యాప్తంగా 225 డీలర్‌షిప్‌లు!

ఈ నగరాల్లో పాటియాలా, సిర్సా, ఘజియాబాద్, అల్వార్, అలీగడ్, సిలిగురి, భావ్‌నగర్, సతారా, అహ్మద్‌నగర్, బెల్గాం, షిమోగా, కన్నూర్, అల్లెప్పీ, దిండిగల్, కరూర్, నెల్లూరు మరియు భీమవరం మొదలైనవి ఉన్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ జాబితాలోకి మరిన్ని కొత్త నగరాలు వచ్చి చేరనున్నాయి.

భారత మార్కెట్ కోసం స్కొడా భారీ ప్లాన్స్; దేశవ్యాప్తంగా 225 డీలర్‌షిప్‌లు!

ఇక స్కోడా కుషాక్ విషయానికి వస్తే, ఇది ఈ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి మోడళ్లకు ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ఈ ఎస్‌యూవీని యాక్టివ్, అంబిషన్ మరియు స్టైల్ అనే మూడు వేరియంట్లలో విక్రయిస్తున్నారు. ప్రస్తుతం, ఈ ఎస్‌యూవీని ఒకే ఒక 1.0-లీటర్ టిఎస్‌ఐ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే అందిస్తున్నారు.

భారత మార్కెట్ కోసం స్కొడా భారీ ప్లాన్స్; దేశవ్యాప్తంగా 225 డీలర్‌షిప్‌లు!

మార్కెట్ సమాచారం ప్రకారం, స్కోడా ఇండియా త్వరలోనే కుషాక్ ఎస్‌యూవీని మరో కొత్త ఇంజన్ ఆప్షన్‌తో విడుదల చేయనున్నట్లు సమాచారం. కొత్త 1.5-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఆప్షన్‌ను ఈ నెలలో మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. కాగా, ఇందులోని 1.0-లీటర్ టిఎస్‌ఐ ఇంజన్ 115 బిహెచ్‌పి శక్తిని, 175 ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

భారత మార్కెట్ కోసం స్కొడా భారీ ప్లాన్స్; దేశవ్యాప్తంగా 225 డీలర్‌షిప్‌లు!

కొత్తగా రాబోయే 1.5-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 150 బిహెచ్‌పి శక్తిని మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులోని 1.0 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ టోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో వస్తుంది. కాగా, 1.5 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో రావచ్చని తెలుస్తోంది.

Most Read Articles

Read more on: #స్కొడా #skoda
English summary
Skoda Auto Dealership Expansion Plans In India, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X