స్కోడా కుషాక్ 1.5 లీటర్ వేరియంట్ లాంచ్ డీటైల్స్

ప్రముఖ వాహన తయారీ సంస్థ స్కోడా ఆటో ఇండియా, తన కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ అయిన స్కోడా కుషాక్‌ను త్వరలో దేశీయ మార్కెట్లో విడుదలచేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఈ ఎస్‌యూవీ విడుదలకు ముందే ఎంతోమంది మనసు దోచింది. కంపెనీ ఈ స్కోడా కుషాక్‌ ఎస్‌యూవీని రెండు టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే వెల్లడించింది.

స్కోడా కుషాక్ 1.5 లీటర్ వేరియంట్ లాంచ్ డీటైల్స్

కానీ స్కోడా కంపెనీ ఎస్‌యూవీ గురించి అప్డేటెడ్ సమాచారాన్ని అందించింది. నివేదికల ప్రకారం, స్కోడా కుషాక్ యొక్క మరింత శక్తివంతమైన 1.5 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ వేరియంట్ 2021 ఆగస్టు 4 నుండి అందుబాటులోకి వస్తుంది. ఇది మరో 1.0-లీటర్ టిఎస్‌ఐ ఇంజిన్‌తో అందించబడుతుంది తెలుస్తోంది.

స్కోడా కుషాక్ 1.5 లీటర్ వేరియంట్ లాంచ్ డీటైల్స్

కుషాక్‌ ఎస్‌యూవీలో ఉన్న 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 148 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తిచేయగా, చిన్న 1.0-లీటర్ టిఎస్‌ఐ ఇంజన్ 113 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

స్కోడా కుషాక్ 1.5 లీటర్ వేరియంట్ లాంచ్ డీటైల్స్

కంపెనీ నివేదికల ప్రకారం స్కోడా కుషాక్ మూడు వేరియంట్లలో అందించనున్నట్లు తెలిసింది. అవి యాక్టివ్, అంబిషన్ మరియు స్టైల్ అనే వేరియంట్లు. 1.5 లీటర్ టిఎస్‌ఐ పెట్రోల్ ఇంజిన్‌ను కంపెనీ తన టాప్-స్పెక్ స్టైలింగ్ వేరియంట్‌లో మాత్రమే అందిస్తుంది.

స్కోడా కుషాక్ 1.5 లీటర్ వేరియంట్ లాంచ్ డీటైల్స్

స్కోడా ఇండియా జూన్ 28 న కుషాక్ ను భారత మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే వెల్లడైన సమాచారం ప్రకారం కంపెనీ ఈ ఎస్‌యూవీని విడుదక చేయు సమయంలో 1.0-లీటర్ టిఎస్ఐ ఇంజిన్ వేరియంట్ మాత్రమే అందించబడుతుంది. దీని డెలివరీలు 2021 జూలై 12 నుండి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.

స్కోడా కుషాక్ 1.5 లీటర్ వేరియంట్ లాంచ్ డీటైల్స్

స్కోడా కుషాక్ ఆకర్షణీయమైన మరియు అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో ఐకానిక్ లార్జ్ ఫ్రంట్ గ్రిల్ దాని ముందు భాగంలో ఇవ్వబడింది. దీనితోపాటు ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడీ ఫాగ్ లాంప్స్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్లతోపాటు, ముందు భాగంలో పెద్ద ఎయిర్ డ్యామ్ ఇవ్వబడ్డాయి.

స్కోడా కుషాక్ 1.5 లీటర్ వేరియంట్ లాంచ్ డీటైల్స్

ఈ కారు యొక్క వెనుక భాగంలో ఇన్వర్టెడ్ ఎల్ షేప్ ఎల్ఈడి టైల్ లైట్ మరియు పైభాగంలో స్టాప్ లైట్ పొందుతుంది. ఇవి కాకుండా, షార్క్ ఫిన్ యాంటెన్నా, రియర్ వైపర్ మరియు బిగ్ రియర్ బంపర్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఎస్‌యూవీలో అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్ మరియు సన్‌రూఫ్ స్టాండర్డ్ గా అందించబడుతుంది.

స్కోడా కుషాక్ 1.5 లీటర్ వేరియంట్ లాంచ్ డీటైల్స్

ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులో సెంటర్ కన్సోల్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, టిఎఫ్టి మల్టీ-ఇన్ఫో డిస్‌ప్లే, 2-స్పోక్ మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్‌లో ఫ్లోటింగ్-టైప్ 10-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ వంటి వాటిని పొందుతుంది.

స్కోడా కుషాక్ 1.5 లీటర్ వేరియంట్ లాంచ్ డీటైల్స్

అంతే కాకూండా ఇందులో పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్, ఆటో-డిమ్మింగ్ హెడ్‌ల్యాంప్స్, యాంబియంట్ క్యాబిన్ లైటింగ్, స్కోడా 6-స్పీకర్ ఆడియో సిస్టమ్‌తో కూడిన సబ్ వూఫర్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, ఎలక్ట్రో-ఆపరేటెడ్ మరియు ఆటో-ఫోల్డింగ్ ఓఆర్విఎం కూడా ఈ కొత్త ఎస్‌యూవీలో అందుబాటులో ఉంటుంది.

Source: Team BHP

Most Read Articles

English summary
Skoda Kushaq India Launch Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X