కుషాక్ 1.5 లీ TSI డెలివరీలు ప్రారంభించనున్న స్కోడా: పూర్తి వివరాలు

ప్రముఖ వాహన తయారీ సంస్థ స్కోడా తన కుషాక్ ఎస్‌యూవీని జూన్ 28 న దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. తరువాత అతి తక్కువ కాలంలోనే ఈ ఎస్‌యూవీ యొక్క డెలివరీలు కూడా ప్రారంభించబడ్డాయి. అయితే మొదట్లో స్కోడా కుషాక్ యొక్క 1.0 లీటర్ టిఎస్ఐ యూనిట్ డెలివరీలు ప్రారంభించింది. ఇప్పుడు కుషాక్ యొక్క 1.5 లీ టిఎస్ఐ మోడల్ డెలివరీలను ప్రారంభించినట్లు స్కోడా ఆటో ఇండియా ప్రకటించింది.

కుషాక్ 1.5 లీ TSI డెలివరీలు ప్రారంభించనున్న స్కోడా: పూర్తి వివరాలు

ప్రస్తుతం స్కోడా కుషాక్ కంపెనీ యొక్క అన్ని అధికారిక డీలర్‌షిప్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంది. స్కోడా కుషాక్ ఎస్‌యూవీ ధర భారతీయ మార్కెట్లో రూ. 10.50 లక్షల నుండి రూ. 17.60 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) మధ్య అందుబాటులో ఉంది.

కుషాక్ 1.5 లీ TSI డెలివరీలు ప్రారంభించనున్న స్కోడా: పూర్తి వివరాలు

స్కోడా కంపెనీ తన కుషాక్ ఎస్‌యూవీని ప్రారంభించినప్పటినుంచి కూడా అద్భుతమైన స్పందనను చూరగొంది. ఈ ఎస్‌యూవీ భారత మార్కెట్లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటికే 6000 యూనిట్లకుపైగా బుకింగ్స్ దాటింది. అయితే, కస్టమర్‌లు ఏ ట్రిమ్ లేదా ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌ని ఎక్కువగా ఇష్టపడుతున్నారో కంపెనీ చెప్పలేదు.

కుషాక్ 1.5 లీ TSI డెలివరీలు ప్రారంభించనున్న స్కోడా: పూర్తి వివరాలు

స్కోడా కుషాక్ ఎస్‌యూవీని బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు రూ. 25,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించడం ద్వారా బుక్ చేసుకోవచ్చు. కస్టమర్లు కంపెనీ డీలర్‌షిప్‌లలో లేదా కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు.

కుషాక్ 1.5 లీ TSI డెలివరీలు ప్రారంభించనున్న స్కోడా: పూర్తి వివరాలు

స్కోడా తన కుషాక్ ఎస్‌యూవీని మూడు వేరియంట్లలో తీసుకువచ్చింది. అవి యాక్టివ్, అంబిషన్ మరియు స్టైల్ వేరియంట్లు. కుషాక్ రెండు టర్బో-పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో అందించబడుతుంది. ఇందులో ఒకటి 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ కాగా, మరొకటి 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌.

స్కోడా కుషాక్ కలర్ ఆప్సన్స్:

 • టోర్నోడా రెడ్ మెటాలిక్
 • కాండీ వైట్
 • కార్బన్ స్టీల్ మెటాలిక్
 • హనీ ఆరెంజ్ మెటాలిక్
 • కుషాక్ 1.5 లీ TSI డెలివరీలు ప్రారంభించనున్న స్కోడా: పూర్తి వివరాలు

  రెండు ఇంజన్లు మాన్యువల్, ఆటోమేటిక్ మరియు DSG గేర్‌బాక్స్‌లతో అందుబాటులో ఉన్నాయి. ఇందులోని 1.0-లీటర్ 3-సిలిండర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ 110 బిహెచ్‌పి పవర్ మరియు 175 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో, 1.5-లీటర్ టిఎస్ఐ టర్బో పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

  కుషాక్ 1.5 లీ TSI డెలివరీలు ప్రారంభించనున్న స్కోడా: పూర్తి వివరాలు

  స్కోడా కుషాక్ MQB-A0-IN ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఎస్‌యూవీ దాదాపు 95 శాతం భాగాలలో స్థానికీకరణ ఉపయోగించబడుతుంది. అయితే, భవిష్యత్తులో భారతదేశంలో కుషాక్ 100% భాగాలను తయారు చేయాలని యోచిస్తోంది.

  కుషాక్ 1.5 లీ TSI డెలివరీలు ప్రారంభించనున్న స్కోడా: పూర్తి వివరాలు

  స్కోడా కుషాక్ డిజైన్ విషయానికి వస్తే, ఈ కారు ముందు భాగంలో స్కోడా యొక్క ఐకానిక్ ఫ్రంట్ గ్రిల్ ఇవ్వబడింది. ఈ కారులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్‌లు మరియు ఎల్ఈడీ టెయిల్ లైట్లు ఉన్నాయి. కారు ముందు భాగంలో పెద్ద ఎయిర్ డ్యామ్ మరియు దిగువ భాగంలో నిటారుగా ఉన్న బోనెట్ లభిస్తుంది.

  కుషాక్ 1.5 లీ TSI డెలివరీలు ప్రారంభించనున్న స్కోడా: పూర్తి వివరాలు

  కుషాక్ ఎస్‌యూవీ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC, హిల్-హోల్డ్ కంట్రోల్, రెయిన్ అండ్ లైట్ సెన్సార్, క్రూయిజ్ కంట్రోల్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

  కుషాక్ 1.5 లీ TSI డెలివరీలు ప్రారంభించనున్న స్కోడా: పూర్తి వివరాలు

  స్కోడా ఆటో ఇండియా డైరెక్టర్ జాక్ హోలిస్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం భారతదేశంలో 30,000 కార్లను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని, దీనికి కుషాక్ ఎస్‌యూవీ చాలా సహకరిస్తుంది. ఇది మాత్రమే కాదు, 2022 నాటికి భారతదేశంలో 60,000 కార్లను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

  కుషాక్ 1.5 లీ TSI డెలివరీలు ప్రారంభించనున్న స్కోడా: పూర్తి వివరాలు

  స్కోడా కంపెనీ 2021 జూలై అమ్మకాలలో 234 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు నివేదికల ప్రకారం తెలిసింది. 2021 జూలై నెలలో, స్కోడా దేశీయ మార్కెట్లో 3,080 యూనిట్లు విక్రయించగా, జూలై 2020 లో కేవలం 922 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. నిజానికి కుశాక్ ఎస్‌యూవీ భారతీయ మార్కెట్లో విడుదల చేయడం వల్ల కంపెనీ యొక్క అమ్మకాల సంఖ్య బాగా పెరిగింది. మేము స్కోడా కుషాక్ ఎస్‌యూవీని ఫస్ట్ డ్రైవ్ చేసాము.. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

  స్కోడా కుషాక్ భారత మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా మరియు కియా సెల్టోస్, ఫోక్స్ వ్యాగన్ టైగన్ వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

Read more on: #స్కోడా #skoda
English summary
Skoda kushaq 1 5 litre tsi delivery begins details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X