ఎస్‌యూవీ విభాగంలో రారాజు 'స్కోడా కుషాక్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & ఇతర వివరాలు

భారతీయ కస్టమర్లు ఎక్కువగా ఎస్‌యూవీలను ఇష్టపడతారు. ఈ కారణంగానే దేశీయ మార్కెట్లో వాహన తయారీదారులు కూడా ఎక్కువగా ఎస్‌యూవీలను విడుదల చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగా వచ్చినవే ఈ కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, రెనాల్ట్ డస్టర్, ఎంజి హెక్టర్, టాటా హారియర్ ఎస్‌యూవీలు.

భారతీయ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన కంపెనీలలో యూరోపియన్ బ్రాండ్ అయిన 'స్కోడా' ఒకటి. చెక్ రిపబ్లికన్ ఆటో దిగ్గజం అయినా స్కోడా గతంలోనే కాకుండా, ఇటీవల కాలంలో కూడా భారతీయ కొనుగోలుదారులను ఆకర్షించడానికి అనేక కొత్త ఉత్పత్తులను విడుదల చేసింది.

ఎస్‌యూవీ విభాగంలో రారాజు 'స్కోడా కుషాక్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & ఇతర వివరాలు

స్కోడా కంపెనీ ఇటీవల కొత్త స్కోడా కుషాక్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ఈ స్కోడా కుషాక్ నిజంగా ప్రస్తుత తరానికి సరిపోయే అన్ని ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇటీవల మేము ఈ కొత్త కుషాక్ ఎస్‌యూవీని డ్రైవ్ చేసాము. ప్రస్తుత తరానికి ఈ కొత్త కుషాక్ ఏ విధంగా సరిపోతుంది, ఇందులో ఉన్న ఫీచర్స్ ఏంటి, దీని పర్ఫామెన్స్ ఎలా ఉంటుంది, అనే దానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.. రండి.

ఎస్‌యూవీ విభాగంలో రారాజు 'స్కోడా కుషాక్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & ఇతర వివరాలు

డిజైన్ మరియు స్టైల్:

స్కోడా కుషాక్ డిజైన్ పరంగా చాలా అద్భుతంగా ఉంది. అంతే కాకూండా స్టైలింగ్ పరంగా కూడా మిడ్ సైజ్ ప్యాకేజీలో ఉండవలసిన అన్ని లక్షణాలను కలిగి ఉంటుంది. ఇందులో ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లతో సొగసైన హెడ్‌ల్యాంప్స్‌తో కూడిన బటర్ ఫ్లై గ్రిల్ ఉంది. ఫాగ్ లాంప్స్ హెడ్‌ల్యాంప్ కింద, బంపర్‌లో ఉంచబడ్డాయి.

ఎస్‌యూవీ విభాగంలో రారాజు 'స్కోడా కుషాక్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & ఇతర వివరాలు

కుషాక్ యొక్క ముందు బంపర్, ప్లాస్టిక్ క్లాడింగ్ మరియు ఫాక్స్ బాష్ ప్లేట్‌తో పాటు కొన్ని హానీ కూంబ్ ఎలిమెంట్స్ పొందుతుంది. అయితే అదే విధంగా పక్కకు వెళుతున్నప్పుడు, క్లాస్సి 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ చూపరుల దృష్టిని ఎంతగానో ఆకర్షిస్తుంది. దీనితో పాటు డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ లోపలి వైపు నిగనిగలాడే గన్-మెటల్ గ్రే కలర్ తో బ్రష్ చేసిన ఫినిషింగ్ ని పొందుతాయి.

ఎస్‌యూవీ విభాగంలో రారాజు 'స్కోడా కుషాక్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & ఇతర వివరాలు

కుషాక్ యొక్క డోర్ హ్యాండిల్స్ కూడా ఈ డ్యూయల్ టోన్ ఫినిషింగ్ పొందుతాయి. ఇవి మరింత ఆకర్షణీయంగా ఉంటాయి. ఫ్రంట్ క్వార్టర్ ప్యానెల్లు పియానో ​​బ్లాక్‌లో క్లాస్సి స్కోడా బ్యాడ్జింగ్‌ను పూర్తి చేస్తాయి మరియు డ్యూయల్-టోన్ ORVM లలో ఇండికేటర్స్ ఉన్నాయి. వెనుక వైపు స్కోడా కుషాక్ చాలా చిన్న ఓవర్‌హాంగ్‌ను పొందుతుంది. ఇవన్నీ కుషాక్ ని మరింత దూకుడుగా కనిపించేలా చేస్తాయి.

ఎస్‌యూవీ విభాగంలో రారాజు 'స్కోడా కుషాక్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & ఇతర వివరాలు

స్కోడా కుషాక్ యొక్క రియర్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇది పూర్తిగా లేటెస్ట్ డిజైన్ కలిగి ఉంటుంది. ఇది స్ప్లిట్ టెయిల్ లాంప్స్‌తో పూర్తి అవుతుంది. దీనికి ఇరువైపులా ఉన్న రిఫ్లెక్టర్లు టెయిల్ గేట్ యొక్క వెడల్పుతో నడిచే క్రోమ్ స్ట్రిప్ ద్వారా అనుసంధానించబడి ఉంటాయి. చంకీ రియర్ బంపర్ ఫాక్స్ బాష్ ప్లేట్‌తో పూర్తయింది.

ఎస్‌యూవీ విభాగంలో రారాజు 'స్కోడా కుషాక్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & ఇతర వివరాలు

భారతదేశంలో ఫోక్స్ వ్యాగన్ మరియు స్కోడా అనుసరించిన ఇండియా 2.0 వ్యూహం నుండి జన్మించిన మొదటి ఉత్పత్తి ఈ స్కోడా కుషాక్. దీని డిజైన్ కస్టమర్లకు తప్పకుండా నచ్చుతుంది. స్కోడా నుంచి రాబోయే మోడల్స్ కూడా ఇలాంటి డిజైన్ కలిగి ఉండాలని మేము ఆశిస్తున్నాము.

ఎస్‌యూవీ విభాగంలో రారాజు 'స్కోడా కుషాక్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & ఇతర వివరాలు

కాక్‌పిట్ & ఇంటీరియర్స్:

స్కోడా కుషాక్ యొక్క ఇంటీరియర్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు డోర్ ఓపెన్ చేయగానే అద్భుతమైన క్యాబిన్ మీకు స్వాగతం పలుకుతుంది. కుషాక్ యొక్క ప్రత్యర్థులు అందించే ఫాన్సీ కాంట్రాస్టింగ్ కలర్స్ ఇందులో లేదు. కానీ డ్యూయల్-టోన్ ఇంటీరియర్స్ అంటే బ్లాక్ అండ్ గ్రే కలర్ అన్ని వైపులా చూడవచ్చు.

ఎస్‌యూవీ విభాగంలో రారాజు 'స్కోడా కుషాక్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & ఇతర వివరాలు

కుషాక్ లోని అన్ని సీట్లు బ్లాక్ అండ్ గ్రే కలర్ లో ఉన్నాయి. డాష్‌బోర్డ్ ప్రధానంగా గ్రే కలర్ ప్లాస్టిక్‌లను కొన్ని ప్యానెల్‌లపై బ్రష్ చేసిన అల్యూమినియం ఫినిషింగ్ లో ఉపయోగించబడింది. ఇది ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను చుట్టుముట్టే హనీకూంబ్ లాంటి మెటీరియల్ ని పొందుతుంది. సెంటర్ కన్సోల్ ట్రిమ్ పియానో ​​బ్లాక్‌లో పూర్తయింది.

ఎస్‌యూవీ విభాగంలో రారాజు 'స్కోడా కుషాక్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & ఇతర వివరాలు

డాష్‌బోర్డ్‌లో సెంటర్ స్టేజ్ తీసుకుంది. ఇందులో 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇది ఇన్ బుల్ట్ నావిగేషన్ వంటి ఫీచర్స్ తో లోడ్ చేయబడింది. స్కోడా ప్లే యాప్, ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేయగలదు మరియు వైర్‌లెస్ స్మార్ట్‌లింక్ కనెక్టివిటీని కూడా పొందుతుంది.

ఎస్‌యూవీ విభాగంలో రారాజు 'స్కోడా కుషాక్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & ఇతర వివరాలు

ఇందులోని స్క్రీన్ అద్భుతమైన స్పందనను కలిగి ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు మరియు దాని యొక్క అనేక విధులను స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు. స్కోడా ఆరు సౌండ్ స్పీకర్లు మరియు సబ్ వూఫర్లను కలిగి ఉంటుంది. వీటి ద్వారా మంచి ధ్వని వస్తుంది.

ఎస్‌యూవీ విభాగంలో రారాజు 'స్కోడా కుషాక్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & ఇతర వివరాలు

ఇన్స్ట్రుమెంటేషన్ అనలాగ్ డిజిటల్ క్లస్టర్ చేత నిర్వహించబడుతుంది. రేంజ్, అవుట్ సైడ్ టెంపరేచర్, ట్రిప్ మీటర్లు, ఓడోమీటర్ మొదలైన వాటితో సహా వాహనానికి సంబంధించిన మొత్తం సమాచారం టిఎఫ్‌టి స్క్రీన్ లో ప్రదర్శించబడుతుంది. ఇందులో టాకోమీటర్ మరియు ఎడమ వైపున ఇంజిన్ టెంపరేచర్ గేజ్ మరియు కుడి వైపున స్పీడోమీటర్ మరియు ఫ్యూయెల్ గేజ్ ఉంటుంది.

ఎస్‌యూవీ విభాగంలో రారాజు 'స్కోడా కుషాక్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & ఇతర వివరాలు

ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ క్రింద సెంటర్ ఎసి వెంట్స్ ఉన్నాయి. వీటి కింది భాగంలో క్లైమేట్ కంట్రోల్స్ కి సంబంధించిన కంట్రోల్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రీమియం అనుభూతిని ఇస్తాయి. స్కోడా కుషాక్‌ను వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ స్పెసిలిటీ డాక్‌తో అమర్చారు. వెనుక సీటుకు వెళుతున్నప్పుడు, కంఫర్ట్ కోటీన్ మరింత మెరుగుపడుతుంది. వెనుక భాగంలో మొబైల్ ఫోన్ ఛార్జింగ్ కోసం రియర్ ఎసి వెంట్స్ మరియు దాని క్రింద రెండు యుఎస్బి పోర్టులను అందిస్తుంది. ఇది కప్‌హోల్డర్లతో పాటు ఫోల్డ్-డౌన్ ఆర్మ్‌రెస్ట్‌ను కూడా పొందుతుంది.

ఎస్‌యూవీ విభాగంలో రారాజు 'స్కోడా కుషాక్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & ఇతర వివరాలు

కంఫర్ట్, ప్రాక్టికాలిటీ మరియు బూట్ స్పేస్:

స్కోడా కుషాక్ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. కుషాక్ ఎస్‌యూవీలోని ముందు సీట్లు చాలా స్పోర్టిగా ఉంటాయి. అంతే కాదు ఇది మంచి థాయ్ సపోర్ట్, లంబర్ సపోర్ట్ మరియు ల్యాటరల్ సపోర్ట్ ని అందిస్తాయి. ముందు సీట్లు వెంటిలేట్ ద్వారా చల్లబడతాయి. ఇది వెంటిలేషన్ కోసం రెండు సెట్టింగులను పొందుతుంది.

ఎస్‌యూవీ విభాగంలో రారాజు 'స్కోడా కుషాక్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & ఇతర వివరాలు

వెనుక సీట్లు కూడా స్పోర్టిగా ఉంటాయి మరియు ప్రయాణీకులకు సౌకర్యంగా ఉంటాయి, ఇక్కడ సరైన హెడ్ రూమ్, క్నీ రూమ్ మరియు లెగ్ రూమ్ కలిగి ఉంది. స్కోడా కుషాక్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో వస్తుంది. కావున ఇది అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. ఇందులో 385 లీటర్ బూట్ స్పేస్ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రయాణికులకు అన్నివిధాలా హలా అనుకూలంగా ఉండేవిధంగా ఉంటుంది.

Dimensions Skoda Kushaq
Length 4,225mm
Width 1,760mm
Height 1,612mm
Wheelbase 2,651mm
Boot Space 385-litres
Ground Clearance 188mm
ఎస్‌యూవీ విభాగంలో రారాజు 'స్కోడా కుషాక్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & ఇతర వివరాలు

ఇంజిన్ పర్ఫామెన్స్ అండ్ డ్రైవింగ్ ఇంప్రెషన్స్:

భారత మార్కెట్లో స్కోడా కుషాక్ రెండు ఇంజన్ ఆప్సన్స్ తో లబిస్తుంది. ఈ రెండు పెట్రోల్ ఇంజన్లు, అంతే కాదు ఇవి రెండూ టర్బోచార్జ్డ్ కూడా. లోయర్ స్పెక్ మోడల్ 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. టాప్-ఆఫ్-లైన్ మోడల్ 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను పొందుతుంది.

ఎస్‌యూవీ విభాగంలో రారాజు 'స్కోడా కుషాక్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & ఇతర వివరాలు

ఇందులోని 1.5-లీటర్ ఇంజిన్‌తో కూడిన వేరియంట్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 147.5 బిహెచ్‌పి మరియు 3,500 ఆర్‌పిఎమ్ వద్ద 250 ఎన్‌ఎమ్‌ను టార్క్ అందిస్తుంది. ట్రాన్స్మిషన్ ఎంపికల కోసం కొనుగోలుదారులు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 7-స్పీడ్ డిఎస్‌జి వంటి వాటిని ఎంచుకోవచ్చు.

ఎస్‌యూవీ విభాగంలో రారాజు 'స్కోడా కుషాక్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & ఇతర వివరాలు

ఇక 1.0-లీటర్ ఇంజన్ విషయానికి వస్తే, ఇది 5,500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 114 బిహెచ్‌పి పవర్ మరియు 1,750 ఆర్‌పిఎమ్ వద్ద 175 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. మేము ఈ వేరియంట్ డ్రైవ్ చేసాము.

ఎస్‌యూవీ విభాగంలో రారాజు 'స్కోడా కుషాక్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & ఇతర వివరాలు

మేము మొదట్లో ఇది చిన్న ఇంజిన్ కావున దాని పనితీరును కొంత సందేహించాము. కాని కుషాక్ మా సందేహాన్ని తప్పు అని నిర్దారించింది. మొదట్లో పవర్ డెలివరీ సున్నితంగా ఉంటుంది, కాని బూస్ట్ సుమారు 2,200 ఆర్‌పిఎమ్ వద్ద ప్రారంభమవుతుంది. స్కోడా కుషాక్ సరదాగా-డ్రైవ్ చేసే ఎస్‌యూవీగా మారుతుంది. ఈ కారు 2,200 ఆర్‌పిఎమ్ మరియు 4,800 ఆర్‌పిఎమ్ మధ్య బలమైన మిడ్‌రేంజ్ కలిగి ఉంది.

ఎస్‌యూవీ విభాగంలో రారాజు 'స్కోడా కుషాక్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & ఇతర వివరాలు

ఇందులో ఉన్న 2 స్పోక్ స్టీరింగ్ వీల్ ఆక్టేవియా నుండి తీసుకోబడింది, ఇది చాలా ఫాన్సీగా కనిపిస్తుంది. ఇందులోని స్టీరింగ్ రెస్పాన్స్ కూడా అద్భుతంగా ఉంది. అంతే కాదు ఇది త్వరగా రెస్పాండ్ అవుతుంది. స్టీరింగ్ తక్కువ వేగంలో తేలికగా మరియు అధిక వేగంలో కొంచెం బరువుగా అనిపిస్తుంది.

ఎస్‌యూవీ విభాగంలో రారాజు 'స్కోడా కుషాక్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & ఇతర వివరాలు

ఇందులోని సస్పెన్షన్ చాలా మృదువైనదిగా ఉంటుంది. కానీ ఇది దాని విభాగంలో ఇతర కార్ల కంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అయితే మంచి నిర్వహణను అందిస్తుంది. ఈ ఎస్‌యూవీ వేగవంతమైన డ్రైవింగ్ సమయంలో కూడా మూలల వంటి ప్రదేశాల్లో కూడా టర్న్ తీసుకోవచ్చు.

ఎస్‌యూవీ విభాగంలో రారాజు 'స్కోడా కుషాక్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & ఇతర వివరాలు

ఇందులోని బ్రేకింగ్ సిస్టం చాలా షార్ప్ గా ఉంటుంది. కావున వాహనదారునికి కూడా మంచి అనుభూతిని అందిస్తాయి. ఇందులో ఉన్న బ్రేకులు కారు యొక్క వేగంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా కారుని అదుపులో ఉంచగలవు. స్కోడా కుషాక్ ముందు భాగంలో డిస్క్ బ్రేక్‌లు మరియు వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది. బ్రేకింగ్ శక్తివంతమైనది అయినప్పటికీ, వెనుక వైపున కూడా డిస్క్ బ్రేక్‌ల ఉంటే మరింత అద్భుతంగా ఉంటుంది.

ఎస్‌యూవీ విభాగంలో రారాజు 'స్కోడా కుషాక్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & ఇతర వివరాలు

స్కోడా కుషాక్ యొక్క మైలేజ్ విషయానికి వస్తే, నగర పరిస్థితుల్లో ఇది ఒక లీటరుకి 8.5 కి.మీ నుండి 11.6 కి.మీ మైలేజ్ అందించింది. అయితే మేము దీనిని హైవేలో టెస్ట్ చేయలేదు, కానీ ఇది హైవేలో 14 నుంచి 16కి.మీ పరిధిని అందిస్తుందని భావిస్తున్నాము. అయితే వాస్తవ గణాంకాలు రోడ్ టెస్ట్ రివ్యూ సమయంలో వెల్లడవుతాయి. అప్పటివరకు వేచి ఉండక తప్పదు.

ఎస్‌యూవీ విభాగంలో రారాజు 'స్కోడా కుషాక్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & ఇతర వివరాలు

సేఫ్టీ ఫీచర్స్:

స్కోడా కుషాక్ దాని విభాగంలో సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలువనుంది. అన్ని ఇతర ఆధునిక స్కోడా కార్ల మాదిరిగానే, కంపెనీ కుషాక్‌ను అగ్రశ్రేణి సేఫ్టీ ఫీచర్స్ తో లోడ్ చేసింది.

స్కోడా కుషాక్ సేఫ్టీ ఫీచర్స్:

 • ఏబీఎస్ విత్ ఈబిడి
 • ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్
 • 6 ఎయిర్‌బ్యాగులు
 • రియర్ పార్కింగ్ కెమెరా
 • మల్టీ-కొలిషన్ బ్రేక్
 • ఎస్‌యూవీ విభాగంలో రారాజు 'స్కోడా కుషాక్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & ఇతర వివరాలు

  స్కోడా కుషాక్ కీ ఫీచర్స్:

  • ఎలక్ట్రిక్ సన్‌రూఫ్
  • 6-స్పీకర్ స్కోడా సౌండ్ ఆడియో సిస్టమ్
  • ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో 10 ఇన్ టచ్‌స్క్రీన్
  • ఎస్‌యూవీ విభాగంలో రారాజు 'స్కోడా కుషాక్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & ఇతర వివరాలు

   వేరియంట్స్:

   స్కోడా కుషాక్ మూడు వేరియంట్లలో అమ్ముడవుతుంది.

   అవి:

   • యాక్టివ్
   • యాంబిషన్
   • స్టైల్
   • ఎస్‌యూవీ విభాగంలో రారాజు 'స్కోడా కుషాక్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & ఇతర వివరాలు

    స్కోడా కుషాక్ కలర్ ఆప్సన్స్:

    • టోర్నోడా రెడ్ మెటాలిక్
    • కాండీ వైట్
    • కార్బన్ స్టీల్ మెటాలిక్
    • హనీ ఆరెంజ్ మెటాలిక్
    • ఎస్‌యూవీ విభాగంలో రారాజు 'స్కోడా కుషాక్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & ఇతర వివరాలు

     మేము డ్రైవ్ చేసిన వేరియంట్ కాండీ వైట్ కలర్ టాప్-స్పెక్ స్టైల్ వేరియంట్. నిజంగా ఈ కలర్ వేరియంట్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది.

     ఎస్‌యూవీ విభాగంలో రారాజు 'స్కోడా కుషాక్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & ఇతర వివరాలు

     స్కోడా కుషాక్ ధరలు:

     స్కోడా కుషాక్ ధరలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. స్కోడా కుషాక్ ఎస్‌యూవీ 2021 జూన్ 28 న భారతదేశంలో విడుదలవుతుంది. ఆ సమయంలో దీని అసలైన ధరలు తెలుస్తాయి. అయితే దీని ధర ఎక్స్‌షోరూమ్ ప్రకారం రూ .10 లక్షల నుంచి 14 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంటుంది.

     ఎస్‌యూవీ విభాగంలో రారాజు 'స్కోడా కుషాక్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & ఇతర వివరాలు

     ప్రత్యర్థులు మరియు ఫ్యాక్ట్ చెక్:

     మేము ఇదివరకు పైన చెప్పినట్లుగానే, స్కోడా కుషాక్ భారత మార్కెట్లో అత్యంత పోటీతత్వ విభాగాలలో ఒకటిగా ప్రవేశిస్తుంది. స్కోడా కుషాక్ భారత మార్కెట్లో అడుగుపెట్టిన తరువాత హ్యుందాయ్ క్రెటా మరియు కియా సెల్టోస్, ఫోక్స్ వ్యాగన్ టైగన్ వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది.

     Specifications SKoda Kushaq Hyundai Creta Kia Seltos
     Engine 1.0-litre Turbo Petrol / 1.5-litre Turbo Petrol 1.5-litre Petrol / 1.5-litre Turbo-Diesel / 1.4-litre Turbo-Petrol 1.5-litre Petrol / 1.5-litre Turbo-Diesel / 1.4-litre Turbo Petrol
     Power 114bhp / 147.5bhp 113.4bhp / 113.4bhp / 140bhp 113.4bhp / 113.4bhp / 140bhp
     Torque 175Nm / 250Nm 144Nm / 250Nm / 242.2Nm 144Nm / 250Nm / 242.2Nm
     Transmission 6-Speed Manual / 6-Speed Automatic / 7-Speed DSG 6-Speed Manual / iVT / 6-Speed Automatic / 7-Speed DCT 6-Speed Manual / CVT / 6-Speed iMT / 6-Speed Automatic / 7-Speed DCT
     Prices To Be Announced Rs 9.99 lakh to Rs 17.70 lakh Rs 9.95 lakh to Rs 17.65 lakh
     ఎస్‌యూవీ విభాగంలో రారాజు 'స్కోడా కుషాక్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & ఇతర వివరాలు

     డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

     భారత మార్కెట్లో ఇప్పటివరకు స్కోడా కంపెనీ విక్రయించిన అతి తక్కువ ఖరీదైన ఎస్‌యూవీ ఈ కుషాక్ అవుతుంది. స్కోడా అనేది భారతీయ కొనుగోలుదారులకు నమ్మికైన బ్రాండ్. కొత్త కుషాక్‌ విడుదలతో ఈ నమ్మకాన్ని మరింత బలపరుస్తుందని ఆశిస్తున్నాము.

     ఎస్‌యూవీ విభాగంలో రారాజు 'స్కోడా కుషాక్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & ఇతర వివరాలు

     స్కోడా తన కుషాక్ ఎస్‌యూవీలో మంచి నిర్మాణ నాణ్యత మరియు మంచి ఫీచర్స్ కలిగి ఉంటుంది. అంతే కాకుండా వాహనదారుడు డ్రైవ్ చేయడానికి అనుకూలంగా ఉండే అన్ని సదుపాయాలు ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి. కావున ఈ విభాగంలో ప్రత్యర్థులకు సరైన ప్రత్యర్థిగా నిలుస్తుంది. స్కోడా కుషాక్ ఒక రీజనబుల్ ధరతో విడుదలైతే, ప్రస్తుతం దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 10 కార్ల జాబితాలో చోటు సంపాదించుకుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు.

     మార్కెట్లో విడుదలయ్యే కొత్త వాహనాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలనుకుంటే మా డ్రైవ్‌స్పార్క్ ఛానల్ అనుసరించండి.

Most Read Articles

English summary
Skoda Kushaq First Drive Review. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X