ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన స్కోడా కుషాక్; ధర & వివరాలు

భారతీయ వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున స్కోడా బ్రాండ్ యొక్క కొత్త 'కుషాక్' ఎట్టకేలకు దేశీయ మార్కెట్లో విడుదలైంది. కొత్త స్కోడా కుషాక్ ధర భారత మార్కెట్లో రూ. 10.49 లక్షలు. కుషాక్ కోసం బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. కుషాక్ కొనుగోలు హేయాలనుకునే కస్టమర్లు ఆన్‌లైన్‌లో లేదా భారతదేశం అంతటా డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. ఈ ఎస్‌యూవీ డెలివరీలు జూలై 12 నుండి ప్రారంభం కానున్నాయి.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన స్కోడా కుషాక్; ధర & వివరాలు

స్కోడా తన కుషాక్ ఎస్‌యూవీని మూడు వేరియంట్లలో తీసుకువచ్చింది. అవి యాక్టివ్, అంబిషన్ మరియు స్టైల్ వేరియంట్లు. కుషాక్ రెండు టర్బో-పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో అందించబడుతుంది.

Kushaq Active Ambition Style
1.0L TSI 6 MT ₹10,44,999 ₹12,79,999 ₹14,59,999
1.0L TSI 6AT NA ₹14,19,999 ₹15,79,999
1.5L TSI 6 MT NA NA ₹16,19,999
1.5L TSI 7 DSG NA NA ₹17,59,999
ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన స్కోడా కుషాక్; ధర & వివరాలు

స్కోడా కుషాక్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ ఎస్‌యూవీ ముందు భాగంలో ఐకానిక్ ఫ్రంట్ గ్రిల్ ఇవ్వబడింది. ఈ కారులో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడీ ఫాగ్ లాంప్స్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు ఉన్నాయి. కారు ముందు భాగంలో పెద్ద ఎయిర్ డ్యామ్ మరియు నిటారుగా ఉన్న బోనెట్ ఇవ్వబడ్డాయి.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన స్కోడా కుషాక్; ధర & వివరాలు

కారు యొక్క టైల్ భాగం విలోమ L ఆకారంలో LED టైల్ లైట్స్ మరియు పైభాగంలో స్టాప్ లైట్ పొందుతుంది. ఇవి కాకుండా, షార్క్ ఫిన్ యాంటెన్నా, రియర్ వైపర్ మరియు బిగ్ రియర్ బంపర్ ఇవ్వబడ్డాయి. ఈ ఎస్‌యూవీలో అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్ మరియు సన్‌రూఫ్ వంటివి కూడా స్టాండర్డ్ గా అందించబడ్డాయి.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన స్కోడా కుషాక్; ధర & వివరాలు

స్కోడా కుషాక్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్, ఆటో-డిమ్మింగ్ హెడ్‌ల్యాంప్స్, యాంబియంట్ క్యాబిన్ లైటింగ్, స్కోడా 6-స్పీకర్ ఆడియో సిస్టమ్‌తో కూడిన సబ్‌ వూఫర్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, ఎలక్ట్రో-ఆపరేటెడ్ మరియు ఆటో- ఫోల్డ్ ORVM లు ఉన్నాయి.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన స్కోడా కుషాక్; ధర & వివరాలు

ఇందులో మల్టిఫుల్ ఎయిర్‌బ్యాగులు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఐసోఫిక్స్ సీట్లు, ఆటోమేటిక్ హెడ్‌లైట్, రియర్ పార్కింగ్ కెమెరా మరియు మల్టీ-కొలిక్షన్ బ్రేక్‌లు, ఎబిడి విత్ ఇబిడి వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన స్కోడా కుషాక్; ధర & వివరాలు

స్కోడా కుషాక్ కలర్ ఆప్సన్స్:

 • టోర్నోడా రెడ్ మెటాలిక్
 • కాండీ వైట్
 • కార్బన్ స్టీల్ మెటాలిక్
 • హనీ ఆరెంజ్ మెటాలిక్
 • ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన స్కోడా కుషాక్; ధర & వివరాలు

  స్కోడా కుషాక్ రెండు టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో అందించబడుతుంది. మొదటి ఇంజిన్ 1.0-లీటర్ మూడు సిలిండర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్, ఇది 115 బిహెచ్‌పి శక్తిని మరియు 175 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్ అందుబాటులో ఉంటుంది.

  ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన స్కోడా కుషాక్; ధర & వివరాలు

  ఇక రెండవ ఇంజిన్ 1.5-లీటర్ టిఎస్ఐ టర్బో పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇది 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్‌తో 7 స్పీడ్ డిఎస్‌జి గేర్‌బాక్స్ ఆప్సన్ కలిగి ఉంది. ఈ ఇంజిన్ ఆప్షన్‌ గల వేరియంట్ ఆగస్టు 2021 లో కంపెనీ అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇటీవల మేము కుషాక్ యొక్క 1.0 లీ, 6 స్పీడ్ మాన్యువల్‌ వేరియంట్ డ్రైవ్ చేసాము. దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండ.

  ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన స్కోడా కుషాక్; ధర & వివరాలు

  స్కోడా కుషాక్ మొత్తానికి మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలోకి ప్రవేశించింది. ఈ ఎస్‌యూవీ అద్భుతమైన ఇంటీరియర్స్ మరియు సేఫ్టీ ఫీచర్స్ వంటి వాటితో పాటు మంచి డిజైన్ కలిగి ఉంటుంది. భారతీయ మార్కెట్లో విడుదలైన స్కోడా కుషాక్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, జీప్ కంపాస్, నిస్సాన్ కిక్స్, రెనాల్ట్ డస్టర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Skoda Kushaq Launched In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X