విడుదలకు ముందే లీకైన స్కొడా కుషాక్ ఫొటోలు; జూన్ 2021లో లాంచ్!

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కొడా ఆటో గడచిన మార్చి 18, 2021వ తేదీన భారత మార్కెట్లో ఆవిష్కరించిన తమ సరికొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ "స్కొడా కుషాక్"ను మరికొద్ది రోజుల్లోనే భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ కారుకి సంబంధించిన లేటెస్ట్ స్పై చిత్రాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి.

విడుదలకు ముందే లీకైన స్కొడా కుషాక్ ఫొటోలు; జూన్ 2021లో లాంచ్!

స్కొడా ఎలాంటి క్యామోఫ్లేజ్ ఉపయోగించకుండా, మహారాష్ట్ర టెస్టింగ్ నెంబర్ ప్లేట్‌తో తమ కొత్త కుషాక్ ఎస్‌యూవీని భారత రోడ్లపై పరీక్షిస్తుండటాన్ని మనం ఈ స్పై చిత్రాలలో చూడొచ్చు. స్కొడా కుషాక్ ఎస్‌యూవీ కోసం బుకింగ్‌లను జూన్ 2021లో ప్రారంభించనుండగా, డెలివరీలను జులై 2021లో ప్రారంభించనున్నారు.

విడుదలకు ముందే లీకైన స్కొడా కుషాక్ ఫొటోలు; జూన్ 2021లో లాంచ్!

స్కొడా ఆటో ఈ సరికొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీని భారతదేశంలోనే స్థానికంగా ఉత్పత్తి చేయనుంది. ఇక్కడ తయారు కానున్న కుషాక్ ఎస్‌యూవీ, మనదేశంలోనే కాకుండా వివిధ అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విక్రయించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.

విడుదలకు ముందే లీకైన స్కొడా కుషాక్ ఫొటోలు; జూన్ 2021లో లాంచ్!

ఈ సరికొత్త స్కొడా కుషాక్ ఎస్‌యూవీని దాని ప్రీమియం ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్‌తో పాటు అద్భుతమైన లేటెస్ట్ ఫీచర్లతో కార్ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఇది విభాగంలో హ్యుందాయ్ క్రెటా మరియు కియా సెల్టోస్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

విడుదలకు ముందే లీకైన స్కొడా కుషాక్ ఫొటోలు; జూన్ 2021లో లాంచ్!

స్కొడా కుషాక్ పేరు విషయానికి వస్తే, దీనిని 'కుషక్' అనే సంస్కృత పదం నుండి గ్రహించారు. సంస్కృతంలో కుషక్ అంటే రాజు లేదా చక్రవర్తి అని అర్ధం. కొత్త స్కొడా కుషాక్ దాని పేరుకు తగినట్లుగానే రాజరికపు డిజైన్ మరియు వైఖరిని కలిగి ఉంటుందని, ఇది చెక్ వాహన తయారీదారుల గొప్ప చరిత్రను కూడా ప్రతిబింబింపజేసేలా ఉంటుందని కంపెనీ పేర్కొంది.

గతేడాది జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో స్కొడా ప్రదర్శించిన విజన్ ఇన్ కాన్సెప్ట్ ఆధారంగా ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీని తయారు చేస్తున్నారు. భారతదేశం కోసం స్కొడా ఆటో సిద్ధం చేసుకున్న 'ఇండియా 2.0 ప్రాజెక్ట్' ప్లాన్ నుండి వస్తున్న తొలి మోడల్ ఇది. అంతేకాకుండా, 'ఎమ్‌క్యూబి ఏ0 ఇన్' ప్లాట్‌ఫామ్‌పై తయారవుతున్న మొట్టమొదటి మోడల్ కూడా ఇదే.

విడుదలకు ముందే లీకైన స్కొడా కుషాక్ ఫొటోలు; జూన్ 2021లో లాంచ్!

స్కొడా కుషాక్ ఎస్‌యూవీ ఉత్పత్తిని కంపెనీ 95 శాతం స్థానికీకరణ (లోకలైజేషన్) చేయనుంది. స్థానికంగా భారతదేశానికి చెందిన వెండర్ల నుండి విడిభాగాలను సేకరించి కంపెనీ ఈ కారును తయారు చేయనుంది. ఫలితంగా, మార్కెట్లో ఈ కారు ధర కూడా అందుబాటులో ఉంటుందని అంచనా.

విడుదలకు ముందే లీకైన స్కొడా కుషాక్ ఫొటోలు; జూన్ 2021లో లాంచ్!

స్కొడా కుషాక్ ఎస్‌యూవీ యాక్టివ్, అంబిషన్, స్టైల్ అనే మూడు వేరియంట్లలో విడుదల చేయనున్నారు. ఇది 4,256 మిమీ పొడవును, 1,589 మిమీ ఎత్తును మరియు 2,651 మిమీ వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 188 మిమీగా ఉంటుంది. ఇది కాండీ వైట్, బ్రిలియంట్ సిల్వర్, కార్బన్ స్టీల్, హనీ ఆరెంజ్ మరియు టోర్నడో రెడ్ అనే ఐదు కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది.

విడుదలకు ముందే లీకైన స్కొడా కుషాక్ ఫొటోలు; జూన్ 2021లో లాంచ్!

స్కొడా కుషాక్ ఎస్‌యూవీ డిజైన్ హైలైట్స్ విషయానికి వస్తే, ఇందులో సిగ్నేచర్ స్కొడా గ్రిల్ మరియు ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్, సన్నటి హెడ్‌లైట్ క్లస్టర్‌లు, ఫ్రంట్ బంపర్‌లో స్టైలిష్ స్కిడ్ ప్లేట్ మరియు పెద్ద ఎయిర్ ఇన్‌టేక్ మొదలైనవి ఉన్నాయి. దీని బేస్ వేరియంట్లలో 16 ఇంచ్ వీల్స్ మరియు టాప్-ఎండ్ వేరియంట్లలో 17 ఇంచ్ డ్యూయెల్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

విడుదలకు ముందే లీకైన స్కొడా కుషాక్ ఫొటోలు; జూన్ 2021లో లాంచ్!

ఇంకా ఇందులో ఫంక్షనల్ రూఫ్ రైల్స్, బూమరాంగ్ ఆకారంలో ఎల్‌ఈడీ టైల్ లైట్స్, రూఫ్ స్పాయిలర్, ర్యాక్డ్ విండ్‌స్క్రీన్, ఆకర్షణీయంగా ఉండే బంపర్, ఫాక్స్ సిల్వర్ బాష్ ప్లేట్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్. క్యాబిన్‌ లోపలి భాగంలో ఆరంజ్ ఎలిమెంట్స్ మరియు డాష్‌బోర్డ్‌లో 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి.

విడుదలకు ముందే లీకైన స్కొడా కుషాక్ ఫొటోలు; జూన్ 2021లో లాంచ్!

స్కోడా కుషాక్ రెండు టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు కలిగి ఉంటుంది. ఇందులో మొదటిది 1.0 లీటర్ మూడు సిలిండర్ల టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్, ఇది 110 బిహెచ్‌పి శక్తిని మరియు 175 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగి ఉంది.

విడుదలకు ముందే లీకైన స్కొడా కుషాక్ ఫొటోలు; జూన్ 2021లో లాంచ్!

ఇకపోతే రెండవది 1.5-లీటర్ టిఎస్ఐ టర్బో పెట్రోల్ ఇంజన్, ఇది 150 బిహెచ్‌పి శక్తిని మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డిఎస్‌జి గేర్‌బాక్స్ కలిగి ఉంటుంది. ఆటోమేటిక్‌లో 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ మరియు 7-స్పీడ్ డిఎస్‌జి ఆప్షన్స్ ఉన్నాయి.

Most Read Articles

English summary
Skoda Kushaq Spied Undisguised Ahead Of Launch In June 2021, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X