3000 దాటిన స్కోడా కుషాక్ బుకింగ్స్, ఒకే రోజు 50 యూనిట్ల డెలివరీ!

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కోడా ఇండియా, తమ సరికొత్త కుషాక్ ఎస్‌యూవీని జూన్ 28న మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసినదే. మార్కెట్లో స్కోడా కుషాక్ ప్రారంభ ధర రూ.10.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). అత్యంత సరసమైన ధరకే విడుదలైన ఈ ఎస్‌యూవీని కస్టమర్లు హాట్ కేకుల్లా కొనుగోలు చేస్తున్నారు.

3000 దాటిన స్కోడా కుషాక్ బుకింగ్స్, ఒకే రోజు 50 యూనిట్ల డెలివరీ!

స్కోడా కుషాక్ మార్కెట్లో విడుదలైనప్పటి నుండి, ఈ కారుకి వినియోగదారుల నుండి మంచి స్పందన లభిస్తోంది. ఈ ఎస్‌యూవీకి ఇప్పటి వరకూ 3,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చినట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ తమ అధికారిక వెబ్‌సైట్ మరియు డీలర్‌షిప్‌ల ద్వారా ఈ మోడల్ కోసం బుకింగ్‌లను స్వీకరిస్తోంది.

3000 దాటిన స్కోడా కుషాక్ బుకింగ్స్, ఒకే రోజు 50 యూనిట్ల డెలివరీ!

కుషాక్ ఎస్‌యూవీకి 3,000 యూనిట్లకు పైగా బుకింగ్స్ రావడంతో, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బెంగళూరుకు చెందిన పిపిఎస్ మోటార్స్ ఒకే రోజు మొత్తం 50 స్కోడా కుషాక్ ఎస్‌యూవీలను డెలివరీ చేసింది.

3000 దాటిన స్కోడా కుషాక్ బుకింగ్స్, ఒకే రోజు 50 యూనిట్ల డెలివరీ!

ఈ సందర్భంగా స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ జాక్ హోలిస్ మాట్లాడుతూ, బెంగుళూరులోని తమ వినియోగదారులకు కుషాక్ డెలివరీని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని, స్కోడా కుషాక్ ఎస్‌యూవీని ప్రత్యేకంగా భారతీయ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించామని అన్నారు.

3000 దాటిన స్కోడా కుషాక్ బుకింగ్స్, ఒకే రోజు 50 యూనిట్ల డెలివరీ!

ఈ మోడల్ మార్కెట్లో లాంచ్ అయినప్పటి నుండి కస్టమర్ల నుండి మంచి స్పందన లభిస్తోందని, స్కోడా కుషాక్ కోసం ఇప్పటికే భారతదేశం అంతటా 3,000కి పైగా బుకింగ్స్ వచ్చాయని ఆయన తెలిపారు. కస్టమర్లు షోరూమ్‌లకు విచ్చేసి తమ స్కోడా కుషాక్ అందించే ఫీచర్లు మరియు డ్రైవింగ్ అనుభూతిని ప్రత్యక్షంగా అనుభవించాలని ఆయన కోరారు.

3000 దాటిన స్కోడా కుషాక్ బుకింగ్స్, ఒకే రోజు 50 యూనిట్ల డెలివరీ!

కొత్త స్కోడా కుషాక్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా అధికారిక స్కోడా డీలర్‌షిప్‌ల ద్వారా రూ.25,000 టోకెన్ అమౌంట్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇది యాక్టివ్, యాంబిషన్ మరియు స్టైల్ అనే ట్రిమ్ లెవల్స్‌లో మొత్తం 7 వేరియంట్లలో అందుబాటులో ఉంది.

3000 దాటిన స్కోడా కుషాక్ బుకింగ్స్, ఒకే రోజు 50 యూనిట్ల డెలివరీ!

మార్కెట్లో స్కోడా కుషాక్ ఎస్‌యూవీ ధరలు రూ.10.49 లక్షల నుండి రూ.17.59 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్యలో ఉన్నాయి. ఇందులో రెండు పెట్రోల్ ఇంజన్ (1.0 లీటర్ టిఎస్, 1.5 లీటర్ టిఎస్ఐ) ఆప్షన్లతో లభిస్తుంది.

3000 దాటిన స్కోడా కుషాక్ బుకింగ్స్, ఒకే రోజు 50 యూనిట్ల డెలివరీ!

ఇందులోని 1.0-లీటర్, 3-సిలిండర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 110 బిహెచ్‌పి పవర్‌ను మరియు 175 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, 1.5-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 150 బిహెచ్‌పి పవర్‌ను మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

3000 దాటిన స్కోడా కుషాక్ బుకింగ్స్, ఒకే రోజు 50 యూనిట్ల డెలివరీ!

స్కోడా కుషాక్ డిజైన్‌ను గమనిస్తే, దీని ముందు భాగంలో ఐకానిక్ ఫ్రంట్ గ్రిల్, ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడి ఫాగ్ లాంప్స్, ఎల్‌ఈడి టెయిల్ లైట్స్, పెద్ద ఎయిర్ డ్యామ్ మరియు నిటారుగా ఉండే బోనెట్ వంటి ఫీచర్లు ఉంటాయి. వెనుక భాగంలో సన్నటి ఎల్ఈడి టెయిల్ లైట్స్, రూఫ్ స్పాయిల్, షార్క్ ఫిన్ యాంటెన్నా, రియర్ వైపర్, పెద్ద రియర్ బంపర్, అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్ మరియు సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉంటాయి.

3000 దాటిన స్కోడా కుషాక్ బుకింగ్స్, ఒకే రోజు 50 యూనిట్ల డెలివరీ!

ఈ కారులో లభించే ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగులు, ఈఎస్‌సి, హిల్-హోల్డ్ కంట్రోల్, రెయిన్ అండ్ లైట్ సెన్సార్, క్రూయిజ్ కంట్రోల్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి అనేక స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఇది టోర్నోడా రెడ్, మెటాలిక్ కాండీ వైట్, కార్బన్ స్టీల్ మెటాలిక్ మరియు హనీ ఆరెంజ్ మెటాలిక్ అనే నాలుగు రంగులలో లభిస్తుంది.

Most Read Articles

English summary
Skoda Kushaq SUV Bookings Crossed 3000 Units, Delivery Updates. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X