భారత్‌లో 'కుషాక్' ఎస్‌యూవీని ఆవిష్కరించిన స్కోడా: వివరాలు

ప్రముఖ వాహన తయారీ సంస్థ స్కోడా తన కొత్త కుషాక్ ఎస్‌యూవీని భారతదేశంలో ఆవిష్కరించింది. ఈ సరికొత్త స్కోడా కుషాక్ 'ఇండియా 2.0 ప్రాజెక్ట్'లో భాగమైన బ్రాండ్ యొక్క మొదటి ఉత్పత్తి. ఎస్‌యూవీ తొలిసారిగా ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ యొక్క ఎమ్‌క్యూబి ఎ 0 ఐఎన్ ప్లాట్‌ఫామ్‌ను భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది. స్కోడా కుషాక్ యొక్క కాన్సెప్ట్ మోడల్ 2020 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రవేశపెట్టబడిం.

భారత్‌లో 'కుషాక్' ఎస్‌యూవీని ఆవిష్కరించిన స్కోడా: వివరాలు

స్కోడా 'కుషాక్' పేరు, సంస్కృతం నుండి ఉద్భవించింది. సంస్కృతంలో కుషాక్ అంటే రాజు లేదా పాలకుడు. ఇది భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. అంతే కాకుండా ఇది 95 శాతం స్థానికీకరించబడింది.

భారత్‌లో 'కుషాక్' ఎస్‌యూవీని ఆవిష్కరించిన స్కోడా: వివరాలు

స్కోడా కుషాక్ రూపకల్పన విషయానికి వస్తే, కంపెనీ యొక్క సిగ్నేచర్ గ్రిల్, స్ప్లిట్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, యాంగ్యులర్ బంపర్, లార్జ్ ఇంటెక్ మరియు స్కిడ్ ప్లేట్ ఇవ్వబడ్డాయి. స్ప్లిట్ ఎల్ఈడి హెడ్లైట్, రెండు వైపులా ఫాగ్ లైట్స్ ఇవ్వబడ్డాయి. దీనిలో 17 ఇంచెస్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

MOST READ:చూస్తే ఒక్కసారైనా రైడ్ చేయాలనిపించే మాడిఫైడ్ రాయల్ ఎన్‌ఫీల్డ్

భారత్‌లో 'కుషాక్' ఎస్‌యూవీని ఆవిష్కరించిన స్కోడా: వివరాలు

ఇది ఫంక్షనల్ రూఫ్ రైల్స్, బూమరాంగ్ ఆకారంలో ఎల్‌ఈడీ టైల్ లైట్స్, రూఫ్ స్పాయిలర్, ర్యాక్డ్ విండ్‌స్క్రీన్, ఆకర్షణీయంగా ఉండే బంపర్, ఫాక్స్ సిల్వర్ బాష్ ప్లేట్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్. క్యాబిన్‌ లోపలి భాగంలో ఆరంజ్ ఎలిమెంట్స్ మరియు డాష్‌బోర్డ్‌లో 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి.

భారత్‌లో 'కుషాక్' ఎస్‌యూవీని ఆవిష్కరించిన స్కోడా: వివరాలు

ఇందులో రెండు మొబైల్స్ ఉంచుకోవడానికి పాకెట్స్ ఉన్నాయి, అంతే కాకుండా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ టోన్ ఇంటీరియర్ థీమ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్, 7 స్పీకర్ ఆడియో సిస్టమ్, వైర్‌లెస్ స్మార్ట్‌లింక్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, టైప్ సి-పోర్ట్‌ వంటివి ఉన్నాయి.

MOST READ:బెస్ట్ ప్రాక్టికల్ ఎస్‌యూవీ 'బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 ఎక్స్‌డ్రైవ్ 30డి' రివ్యూ.. పూర్తి వివరాలు

భారత్‌లో 'కుషాక్' ఎస్‌యూవీని ఆవిష్కరించిన స్కోడా: వివరాలు

స్కోడా కుషాక్ సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగులు, ఇఎస్‌సి, హిల్-హోల్డ్ కంట్రోల్, రెయిన్ అండ్ లైట్ సెన్సార్లు, క్రూయిజ్ కంట్రోల్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉన్నాయి. ఇది 385 లీటర్ల బూట్ స్పేస్ కలిగి ఉంది, దీనిని 1405 లీటర్లకు వరకు పెంచుకునే అవకాశం ఉంది.

భారత్‌లో 'కుషాక్' ఎస్‌యూవీని ఆవిష్కరించిన స్కోడా: వివరాలు

స్కోడా కుషాక్ రెండు టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు కలిగి ఉంటుంది. ఇందులో మొదటిది 1.0 లీటర్ మూడు సిలిండర్ల టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్, ఇది 110 బిహెచ్‌పి శక్తిని మరియు 175 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగి ఉంది.

MOST READ:ట్రాఫిక్ సిగ్నల్ పోల్‌కి సెలబ్రేషన్ చేసిన బెంగళూరు పోలీసులు.. ఎందుకో తెలుసా?

భారత్‌లో 'కుషాక్' ఎస్‌యూవీని ఆవిష్కరించిన స్కోడా: వివరాలు

ఇక రెండవ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 1.5-లీటర్ టిఎస్ఐ టర్బో పెట్రోల్ ఇంజన్, ఇది 150 బిహెచ్‌పి శక్తిని మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డిఎస్‌జి గేర్‌బాక్స్ కలిగి ఉంది. ఆటోమేటిక్‌లో 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ మరియు 7-స్పీడ్ డిఎస్‌జి ఉన్నాయి.

భారత్‌లో 'కుషాక్' ఎస్‌యూవీని ఆవిష్కరించిన స్కోడా: వివరాలు

కొత్త స్కోడా కుషాక్ కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,256 మిమీ మరియు ఎత్తు 1,589 మిమీ, వీల్‌బేస్ 2,651 మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 188 మిమీ వరకు ఉంటుంది. ఇది 5 కలర్ ఆప్సన్లలో అందించబడుతుంది. అవి కాండీ వైట్, బ్రిలియంట్ సిల్వర్, కార్బన్ స్టీల్, హనీ ఆరెంజ్ మరియు టర్నోడా రెడ్ కలర్స్.

MOST READ:పోలీస్ ఫోర్స్ కోసం కొత్త 2021 ఫోర్డ్ పికప్ ట్రక్కులు; పూర్తి వివరాలు

భారత్‌లో 'కుషాక్' ఎస్‌యూవీని ఆవిష్కరించిన స్కోడా: వివరాలు

ఇది భారత మార్కెట్లో మిడ్ సైజ్ ఎస్‌యూవీ విభాగంలో ప్రవేశపెట్టనుంది. ఇది దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఎంజి హెక్టర్ వంటి మోడళ్లకు ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ కొత్త కుషాక్ ఎస్‌యూవీ ధర 10 నుంచి 16 లక్షల రూపాయల వరకు ఉంటుందని భావిస్తున్నాము. భారత మార్కెట్లో విడుదలైన తర్వాత ఏవిధమైన ఆదరణ ఉంటుందో వేచి చూడాలి.

Most Read Articles

English summary
Skoda Kushaq Unveiled Globally. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X