Just In
- 31 min ago
మాస్క్, హెల్మెట్ లేకుండా రైడ్ చేసిన ప్రముఖ బాలీవుడ్ హీరోకి ట్రాఫిక్ ఛలాన్
- 41 min ago
మార్చి 2న హ్యుందాయ్ బేయోన్ క్రాసోవర్ ఆవిష్కరణ - వివరాలు
- 50 min ago
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఖాయం అంటున్న పెట్రోలియం మంత్రి.. ఎప్పటినుంచో తెలుసా !
- 1 hr ago
మార్చి 3వ తేదీ నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభం
Don't Miss
- News
ఎన్టీఆర్ కాదు నేనే వస్తా .. లేదంటే లోకేష్ ను పంపుతా : కుప్పంలో చంద్రబాబు వ్యాఖ్యలు
- Movies
ముసలి గెటప్‌లో నందమూరి బాలకృష్ణ: సాహసాలు చేయడానికి సిద్ధమైన నటసింహం
- Sports
స్పిన్ బౌలింగ్‌ను సరిగ్గా ఆడలేని ఇంగ్లండ్‌ను కాకుండా.. పిచ్‌ను విమర్శించడం ఏంటి: గ్రేమ్ స్వాన్
- Finance
తగ్గనున్న విమాన ఛార్జీలు- డీజీసీఏ కీలక అనుమతి- ఆ సేవలు ఇక విడివిడిగానే
- Lifestyle
మీకు చిట్లిన లేదా విరిగిన జుట్టు ఉందా? దీన్ని నివారించడానికి సాధారణ మార్గాలు ఇక్కడ ఉన్నాయి!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
క్రెటా, సెల్టోస్ కార్లకు సవాల్ విసిరేందుకు వస్తున్న స్కొడా కుషాక్; మార్చ్‌లో విడుదల
మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో క్రియా సెల్టోస్ మరియు హ్యుందాయ్ క్రెటా వంటి కార్ల జోరుకు చెక్ పెట్టేందుకు స్కొడా ఆటో ఈసారి గట్టిగానే ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాది మార్చ్ నెలలో స్కొడా తమ సరికొత్త కుషాక్ మిడ్-సైజ్ ఎస్‌యూవీని విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని స్కోడా ఇండియా అధ్యక్షుడు జాక్ హోలిస్ ధృవీకరించారు.

స్కోడా ఆటో మరియు ఫోక్స్‌వ్యాగన్ గ్రూపులు సంయుక్తంగా అభివృద్ధి చేసిన 'ఎమ్‌క్యూబి ఏ0 ఇన్' ప్లాట్‌ఫామ్‌పై ఈ కుషాక్ ఎస్‌యూవీని తయారు చేయనున్నారు. ఇదే ప్లాట్‌ఫామ్‌పై ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీని కూడా తయారు చేయనున్నారు. ఈ నేపథ్యంలో, ఈ రెండు మోడళ్లలో అనేక విడిభాగాలు, పరికరాలు ఒకేలా ఉండొచ్చని సమాచారం.

స్కొడా ఇటీవలే తమ కొత్త కుషాక్ ప్రీ-ప్రొడక్షన్ వెర్షన్ చిత్రాలను అధికారికంగా విడుదల చేసింది. అయితే, పూర్తి వివరాలు వెల్లడి కాకుండా ఉంచేందుకు కంపెనీ వీటిని పాక్షికంగా క్యామోఫ్లేజ్ చేసింది. కుషాక్ ధరను అందుంబాటులో ఉంచేందుకు కంపెనీ దీని ఉత్పత్తి విషయంలో స్థానికీకరణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనుంది.
MOST READ:ఇది చూసారా.. ఆడి కార్ గుర్రపు బండిగా మారింది, ఎందుకో తెలుసా

మార్కెట్ అంచనా ప్రకారం, దేశీయ విపణిలో స్కొడా కుషాక్ ధర రూ.12 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం కావచ్చని సమాచారం. కుషాక్ భారతదేశం కోసం స్కొడా ఆటో సిద్ధం చేసుకున్న 'ఇండియా 2.0 ప్రాజెక్ట్' ప్లాన్‌లో భాగంగా వస్తున్న తొలి మోడల్. గతేడాది ఆరంభంలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన విజన్ ఇన్ కాన్సెప్ట్ ఆధారంగా ఈ కుషాక్ ఎస్‌యూవీని తయారు చేయనున్నారు.

దేశీయ మార్కెట్లో స్కొడా కుషాక్ ఎస్‌యూవీని రెండు టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో విడుదల చేసే అవకాశం ఉంది. ఇందులో ఒకటి 1.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ మరియు మరొకటి 1.5-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్. అయితే, ఇందులో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఎంట్రీ లెవల్ వేరియంట్లలో మాత్రమే ఆఫర్ చేసే అవకాశం ఉంది.
MOST READ:మీకు తెలుసా.. అత్యంత ఖరీదైన తెలుగు హీరోల కార్లు, వాటి వివరాలు

ఈ 1.0-లీటర్ త్రీ-సిలిండర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 108 బిహెచ్‌పి పవర్‌ను మరియు 175 ఎమ్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో సిక్స్-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కూడా ఆఫర్ చేయవచ్చని అంచనా.

ఇకపోతే, టాప్-ఎండ్ వేరియంట్లలో ఉపయోగించబోయే 1.5-లీటర్ టిఎస్ఐ ఇవో ఫోర్-సిలిండర్ టర్బో ఇంజన్ గరిష్టంగా 150 బిహెచ్‌పి పవర్‌ను మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సెవన్-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.
MOST READ:హెలికాఫ్టర్లు చేసే ఈ పనులు విమానాలు ఎందుకు చేయలేవు.. మీకు తెలుసా ?

ఇటీవల లీక్ అయిన సమాచారం ప్రకారం, కొత్త 2021 స్కొడా కుషాక్ ఎస్‌యూవీ బేస్ వేరియంట్‌లోనే ఫుల్లీ లోడెడ్ ఫీచర్లు లభించే అవకాశం ఉంది. ఇందులో 7.0 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 4 స్పీకర్లతో కూడిన ఆడియో సిస్టమ్ మరియు టాప్-ఎండ్ వేరియంట్లో 10-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు బూట్ స్పేస్‌లో ఓ సబ్ వూఫర్ వంటి ఫీచర్లు లభ్యం కానున్నట్లు సమాచారం.

ఇంకా ఇందులో క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆటోమేటిక్ హెడ్‌లైట్ సిస్టమ్, ఆటోమేటిక్ వైపర్స్ మరియు 6 ఎయిర్‌బ్యాగ్‌లతో సహా పలు సాంకేతిక ఫీచర్లు ఉండనున్నాయి. కూల్డ్ గ్లౌవ్ బాక్స్, వెంటిలేటెడ్ సీట్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో పాటు బ్రాండ్ యొక్క స్వంత కనెక్టింగ్ టెక్నాలజీ కూడా లభించే అవకాశం ఉంది.
MOST READ:ప్రయాణికులు వణికిపోయేలా చేసే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విమానాశ్రయాలు, ఇవే

భారత్‌లో అత్యంత పాపులర్ అయిన మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో స్కొడా కుషాక్ విడుదల కానుంది. ఇది ఈ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఎమ్‌జి హెక్టర్ మరియు హెక్టర్ ప్లస్, టాటా హారియర్, జీప్ కంపాస్, మహీంద్రా ఎక్స్‌యూవీ500 మరియు ఫోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.