తొలిసారిగా కెమెరాకు చిక్కిన స్కొడా ర్యాపిడో రీప్లేస్‌మెంట్ సెడాన్: ఫొటోలు

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కొడా ఆటో, భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ ర్యాపిడో సెడాన్‌లో కొత్త తరం మోడల్‌ను విడుదల చేయబోమని కంపెనీ హెడ్ జాక్ హోలిస్ గతంలో వెల్లడించిన సంగతి తెలిసినదే. అంతేకాకుండా, ర్యాపిడో స్థానంలో మరింత శక్తివంతమైన ఓ కొత్త మోడల్ తీసుకువస్తామని ఆయన చెప్పారు.

తొలిసారిగా కెమెరాకు చిక్కిన స్కొడా ర్యాపిడో రీప్లేస్‌మెంట్ సెడాన్: ఫొటోలు

ఇప్పుడు తాజాగా, స్కొడా ఆటో భారత రోడ్లపై ఓ కొత్త సెడాన్ కారును పరీక్షిస్తుండటం కెమెరాకు చిక్కింది. ఆటో కార్ ఇండియా లీక్ చేసిన ఫొటోలలో స్కొడా తమ ర్యాపిడో రీప్లేస్‌మెంట్ కోసం ఓ కొత్త సెడాన్‌ను పరీక్షిస్తుండటాన్ని గమనించవచ్చు.

తొలిసారిగా కెమెరాకు చిక్కిన స్కొడా ర్యాపిడో రీప్లేస్‌మెంట్ సెడాన్: ఫొటోలు

స్కొడా నుండి కొత్తగా రానున్న ఈ కారు, ఇప్పటి వరకూ కంపెనీకి ఎంట్రీ లెవల్ మోడల్‌గా ఉన్న ర్యాపిడో సెడాన్‌ను భర్తీ చేయనుంది. ఇది 2021 చివరి నాటికి లాంచ్ అవుతుంది అంచనా. ఇటీవల లీకైన కొత్త స్కొడా సెడాన్ ఫొటోలలో ఈ కారు యొక్క డిజైన్ వివరాలు వెల్లడయ్యాయి.

MOST READ:రియర్ హీరో మయూర్ షెల్కేకి జావా బైక్ కాకుండా మరో కార్ గిఫ్ట్.. అదేంటో చూసారా..!

తొలిసారిగా కెమెరాకు చిక్కిన స్కొడా ర్యాపిడో రీప్లేస్‌మెంట్ సెడాన్: ఫొటోలు

ఫోక్స్‌వ్యాగన్ మరియు స్కొడా ఆటో సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఎమ్‌క్యూబి ఏ0 ఇన్ ప్లాట్‌ఫామ్‌పైనే ఈ కొత్త సెడాన్‌ను కూడా తయారు చేయనున్నారు. ఈ కొత్త సెడాన్ కారు, ఈ ప్లాట్‌ఫామ్‌పై తయారు కానున్న రెండవ స్కొడా మోడల్‌గా మారుతుంది. ఇదే ప్లాట్‌ఫామ్‌పై కంపెనీ తమ మొదటి మోడల్ కుషాక్ ఎస్‌యూవీని కూడా తయారు చేస్తున్న విషయం తెలిసినదే.

తొలిసారిగా కెమెరాకు చిక్కిన స్కొడా ర్యాపిడో రీప్లేస్‌మెంట్ సెడాన్: ఫొటోలు

కొత్త స్కొడా సెడాన్ డిజైన్ విషయానికి వస్తే, ఇందులో ముందు వైపు స్కొడా సిగ్నేచర్ గ్రిల్ కనిపిస్తుంది. ఈ గ్రిల్‌కి ఇరువైపులా సన్నటి ట్రిపుల్ బారెల్ యూనిట్ హెడ్‌లైట్ సెటప్ ఉంటుంది. ఇందులోనే ఇంటిగ్రేట్ చేయబడిన డే టైమ్ రన్నింగ్ లైట్లు మరియు టర్న్ ఇండికేటర్లు ఉంటాయి.

MOST READ:కరోనా వేళ అందరికోసం 'ఆక్సిజన్ మ్యాన్‌గా' మారిన వ్యక్తి.. ఎక్కడంటే?

తొలిసారిగా కెమెరాకు చిక్కిన స్కొడా ర్యాపిడో రీప్లేస్‌మెంట్ సెడాన్: ఫొటోలు

సాధారణ వేరియంట్లలో ఎల్‌ఈడీ రిఫ్లెక్టర్ హెడ్‌ల్యాంప్ సెటప్ ఉంటుందని తెలుస్తోంది. అయితే, ఇందులోని ప్రీమియం వేరియంట్లలో కంపెనీ ప్రొజెక్టర్ స్టైల్ హెడ్‌ల్యాంప్ సెటప్‌ను అందించవచ్చని తెలుస్తోంది. హెడ్‌లైట్ దిగువ భాగంలో ఎల్ఈడి డిఆర్ఎల్ ఉండొచ్చు మరియు ఫ్రంట్ బంపర్‌లో ఫాగ్ ల్యాంప్స్ కనిపిస్తున్నాయి.

తొలిసారిగా కెమెరాకు చిక్కిన స్కొడా ర్యాపిడో రీప్లేస్‌మెంట్ సెడాన్: ఫొటోలు

స్కొడా నుండి కొత్తగా వస్తున్న ఈ సెడాన్ పరిమాణంలో ర్యాపిడ్ సెడాన్ కన్నా పెద్దదిగా ఉంటుంది. ఇందులో కారు వెనుక భాగాన్ని పొడగించినట్లుగా అనిపిస్తుంది. ఈ మార్పు కారణంగా కారు వెనుక వరుసలో ఎక్కువ స్థలం మరియు ఎక్కువ బూట్ స్పేస్ లభిస్తుంది. ఈ కారు పైకప్పుపై షార్క్ ఫిన్ యాంటెన్నా‌ను ఈ ఫొటోలలో చూడవచ్చు.

MOST READ:కారు దొంగలించిన తర్వాత ఓనర్‌కే SMS చేసిన దొంగ.. చివరికి ఏమైందంటే?

తొలిసారిగా కెమెరాకు చిక్కిన స్కొడా ర్యాపిడో రీప్లేస్‌మెంట్ సెడాన్: ఫొటోలు

అలాగే, ఈ టెస్టింగ్ వాహనంలో కొత్త మ్యాట్ బ్లాక్ అల్లాయ్ వీల్ డిజైన్‌ను మనం గమనించవచ్చు. ఈ వీల్స్ చాలా సింపుల్ డిజైన్‌ను కలిగి ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే, కంపెనీ దీని ప్రొడక్షన్ మోడల్‌లో కొత్త డిజైన్‌తో కూడిన అల్లాయ్ వీల్స్‌ను ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఇక కారు వెనుక భాగంలో స్క్వేర్ ఆకారంలో ఉన్న టెయిల్ లాంప్ సెటప్ ఉంది.

తొలిసారిగా కెమెరాకు చిక్కిన స్కొడా ర్యాపిడో రీప్లేస్‌మెంట్ సెడాన్: ఫొటోలు

ఈ కొత్త సెడాన్ పూర్తి ఎల్‌ఈడీ లైటింగ్, పూర్తి డిజిటల్ వర్చువల్ కాక్‌పిట్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యాంబియంట్ లైటింగ్ మరియు స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ మరియు లేటెస్ట్ కార్ కనెక్ట్ టెక్నాలజీలతో కూడిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుందని అంచనా.

MOST READ:విడుదలకు ముందే లీకైన స్కొడా కుషాక్ ఫొటోలు; జూన్ 2021లో లాంచ్!

తొలిసారిగా కెమెరాకు చిక్కిన స్కొడా ర్యాపిడో రీప్లేస్‌మెంట్ సెడాన్: ఫొటోలు

ఇంజన్ విషయానికి వస్తే, స్కొడా కుషాక్‌లో ఉపయోగించిన ఇంజన్ ఆప్షన్లతో ఈ కొత్త సెడాన్‌లోనూ కొనసాగించే అవకాశం ఉంది. ఇందులోని 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 115 బిహెచ్‌పి పవర్‌ను మరియు 175 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులోకి రానుంది.

తొలిసారిగా కెమెరాకు చిక్కిన స్కొడా ర్యాపిడో రీప్లేస్‌మెంట్ సెడాన్: ఫొటోలు

అదే సమయంలో, ఇందులో 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 న్యూటన్ మీటర్ టార్క్‌ని ఉత్పత్తి చేసే 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌ను కూడా ఇందులో ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్ మరియు 7 స్పీడ్ డిఎస్‌జి గేర్‌బాక్స్ ఆప్షన్లతో రావచ్చు. ఇందులో డీజిల్ ఇంజన్ ఆప్షన్ ఉండకపోవచ్చని సమాచారం.

Source: Autocar India

Most Read Articles

Read more on: #స్కొడా #skoda
English summary
Skoda Rapido Sedan Replacement Spied Testing For The First Time In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X