Just In
- 12 hrs ago
మతిపోగొడుతున్న హ్యుందాయ్ మార్చ్ నెల డిస్కౌంట్స్.. దేనిపై ఎంతో చూసారా..!
- 15 hrs ago
భారత్‌లో విడుదలైన 3 కొత్త NIJ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. చీప్ కాస్ట్ & మోర్ ఫీచర్స్
- 15 hrs ago
గుడ్ న్యూస్! ఇకపై ఈ సేవల కోసం ఆర్టీఓ చుట్టూ తిరగక్కర్లేదు, అన్నీ ఆన్లైన్లోనే..
- 16 hrs ago
కేవలం 65,920 రూపాయలకే కొత్త బజాజ్ ప్లాటినా 110 ఎబిఎస్ బైక్ ; వివరాలు
Don't Miss
- News
రఘురామ మళ్లీ కౌంటర్.. సీఎం జగన్ కూడా భాగస్వాములే.. హాట్ కామెంట్స్..
- Movies
చరిత్ర సృష్టించిన సుడిగాలి సుధీర్: వాళ్లందరిపై ఆధిపత్యం చూపిస్తూ.. ఊహించని రికార్డు సొంతం
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది...!
- Finance
ధరలు ఎలా ఉన్నాయంటే? 44వేలకు దిగొచ్చిన బంగారం, వెండి రూ.66 వేల దిగువన
- Sports
ఆ విషయంలో రోహిత్ శర్మను చూసి విరాట్ కోహ్లీ నేర్చుకోవాలి: మనోజ్ తివారీ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
స్కొడా కుషాక్ ప్రీ-ప్రొడక్షన్ ఫొటోలు వెల్లడి; 2021 మార్చ్‌లో విడుదల
చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కోడా ఆటో, భారత మార్కెట్ కోసం 'కుషాక్' పేరుతో ఓ మిడ్-సైజ్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసినదే. గతేడాది ఆరంభంలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో స్కొడా ప్రదర్శించిన విజన్ ఇన్ కాన్సెప్ట్ ఆధారంగా ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీని తయారు చేస్తున్నారు.

కాగా, ఇప్పుడు ఆ మోడల్‌కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ వెర్షన్ చిత్రాలను కంపెనీ వెల్లడి చేసింది. స్కొడా ఆటో పేర్కొన్న సమచారం ప్రకారం, ఈ కొత్త ఎస్‌యూవీని రానున్న వేసవిలో (మార్చ్-ఏప్రిల్ 2021) విడుదల చేయనున్నారు.

స్కొడా తాజాగా విడుదల చేసిన చిత్రాలను చూస్తుంటే, ఈ మోడల్ టెస్టింగ్ ప్రక్రియ పూర్తయి, ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా, స్కొడా కుషాక్‌కి మరియు కంపెనీ గతంలో కంపెనీ ప్రదర్శించిన విజన్ ఇన్ కాన్సెప్ట్ వాహనానికి అనేక పోలికలు ఉన్నాయి.
MOST READ:బైక్‌నే బస్సుపైకి తలపై మోసిన రియల్ బాహుబలి [వీడియో]

స్కొడా ఇటీవలే భారత మార్కెట్లో నాలుగు కొత్త పేర్లను ట్రేడ్‌మార్క్ చేసింది, వాటిలో ఈ కుషాక్ పేరు కూడా ఒకటి. భారతదేశం కోసం స్కొడా ఆటో సిద్ధం చేసుకున్న 'ఇండియా 2.0 ప్రాజెక్ట్' ప్లాన్‌లో భాగంగా వస్తున్న తొలి మోడల్ ఇది.

అంతేకాకుండా, ఇది 'ఎమ్‌క్యూబి ఏ0 ఇన్' ప్లాట్‌ఫామ్‌పై తయారవుతున్న మొట్టమొదటి మోడల్ కూడా కావటం విశేషం. స్కొడా ఆటో ఇదే ప్లాట్‌ఫామ్‌పై భవిష్యత్తులో మరిన్ని కార్లను భారత మార్కెట్ కోసం తయారు చేయనుంది. స్కొడా కుషాక్ ఎస్‌యూవీ వీల్ బేస్ 2,651 మిల్లీమీటర్లుగా ఉంటుంది.
MOST READ:ఎలక్ట్రిక్ కారుగా మారిన మారుతి డిజైర్ ; వివరాలు

స్కొడా కుషాక్ డిజైన్ విషయానికి వస్తే, ఇరువైపులా సన్నటి డిజైన్‌తో కూడిన ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్ మరయు ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. వాటికి దిగువ భాగంలో ఇరువైపులా హనీకోంబ్ ప్యాటర్న్‌తో కూడిన ఎయిర్ డ్యామ్స్ కనిపిస్తాయి. ఫ్రంట్ బానెట్ కూడా చాలా వరకు చదునుగా కనిపిస్తుంది.

సైడ్ డిజైన్‌ను గమనిస్తే, ఈ కారులో ఆల్-బ్లాక్ అల్లాయ్ వీల్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే, ప్రొడక్షన్ వెర్షన్ వెర్షన్‌లో ఎలాంటి వీల్స్‌ని ఆఫర్ చేస్తారో వేచి చూడాలి. వెనుక వైపు ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, రూఫ్ మౌంట్ స్టాప్ లైట్, షార్క్ ఫిన్ యాంటెన్నా, రియర్ వైపర్ అండ్ వాషర్, రూఫ్ రెయిల్స్ మరియు పెద్ద బంపర్ వంటి మార్పులు ఉన్నాయి.
MOST READ:కారు ఎక్కువ కాలం ఉపయోగించాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ తప్పక పాటించాలి

కొత్త స్కొడా కుషాక్ ఎస్‌యూవీలోని ఇంటీరియర్స్‌కి సంబంధించి ప్రస్తుతానికి పూర్తి సమాచారం లేకపోయినప్పటికీ, ఇందులో అనేక ఫీచర్లు అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌కి అనుగుణంగా, ఇందులో లేటెస్ట్ కనెక్టింగ్, కంఫర్ట్ మరియు సేఫ్టీ ఫీచర్లు ఉండొచ్చని అంచనా.

ఇంజన్ విషయానికి వస్తే, ఇది మూడు ఇంజన్ ఆప్షన్లలో లభించవచ్చని సమాచారం. ఇందులో మొదటిది 1.0-లీటర్ పెట్రోల్ మరియు రెండవది 1.5-లీటర్ టిఎస్ఐ టర్బో పెట్రోల్ ఇంజన్. అయితే, ఇందులో 1.0-లీటర్ రెగ్యులర్ పెట్రోల్ ఇంజన్‌ను ఎంట్రీ లెవల్ వేరియంట్లలో మాత్రమే ఆఫర్ చేయవచ్చని తెలుస్తోంది.
MOST READ:ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!

ఇకపోతే, రెండవది 1.0-లీటర్ త్రీ-సిలిండర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 108 బిహెచ్‌పి పవర్‌ను మరియు 175 ఎమ్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో సిక్స్-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కూడా ఆఫర్ చేయవచ్చని అంచనా.

ఇకపోతే, టాప్-ఎండ్ వేరియంట్లలో ఉపయోగించబోయే 1.5-లీటర్ టిఎస్ఐ ఇవో ఫోర్-సిలిండర్ టర్బో ఇంజన్ గరిష్టంగా 150 బిహెచ్‌పి పవర్‌ను మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సెవన్-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

మార్కెట్ అంచనా ప్రకారం, దేశీయ విపణిలో స్కొడా కుషాక్ ధర రూ.12 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం కావచ్చని అంచనా. స్కొడా కుషాక్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఎమ్‌జి హెక్టర్ మరియు హెక్టర్ ప్లస్, టాటా హారియర్, జీప్ కంపాస్, మహీంద్రా ఎక్స్‌యూవీ500 మరియు ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.