హోండా సిటీ, మారుతి సియాజ్ మరియు హ్యుందాయ్ వెర్నాలతో స్కోడా స్లావియా పోటీ పడగలదా..?

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కోడా ఆటో (Skoda Auto) తాజాగా భారత మార్కెట్లో తమ సరికొత్త మిడ్-సైజ్ సెడాన్ 'స్కోడా స్లావియా' (Skoda Slavia) ను ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. మరికొద్ది రోజుల్లోనే స్కోడా స్లావియా సెడాన్ బుకింగ్స్ మరియు అమ్మకాలు కూడా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ సరికొత్త మిడ్-సైజ్ సెడాన్ ఈ విభాగంలో ఇప్పటికే ఆధిపత్యం చలాయిస్తున్న మారుతి సుజుకి సియాజ్, హోండా సిటీ మరియు హ్యుందాయ్ వెర్నా వంటి మోడళ్లతో ఏ విధంగా పోటీ పడుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

హోండా సిటీ, మారుతి సియాజ్ మరియు హ్యుందాయ్ వెర్నాలతో స్కోడా స్లావియా పోటీ పడగలదా..?

స్కోడా స్లావియా సెడాన్‌ను ఈ చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ తమ లేటెస్ట్ MQB A0-IN ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేసి, నిర్మించబడింది. ఈ ప్లాట్‌ఫామ్ నుండి వచ్చిన రెండవ స్కోడా మోడల్ ఇది. కంపెనీ ఇప్పటికే ఈ ప్లాట్‌ఫామ్‌పై తమ మొదటి మోడల్ మరియు మిడ్-సైజ్ ఎస్‌యూవీ స్కోడా కుషాక్‌ని కూడా విడుదల చేసింది. కొత్త MQB A0-IN ప్లాట్‌ఫామ్‌పై తయారైన స్కోడా స్లావియా 4541 మిమీ పొడవు, 1752 మిమీ వెడల్పు మరియు 1487 మిమీ ఎత్తును కలిగి ఉండి, ఈ విభాగంలో అత్యంత విశాలమైన సెడాన్‌లలో ఒకటిగా నిలుస్తుంది.

హోండా సిటీ, మారుతి సియాజ్ మరియు హ్యుందాయ్ వెర్నాలతో స్కోడా స్లావియా పోటీ పడగలదా..?

ఈ కొలతల వద్ద స్కోడా స్లావియా ఈ విభాగంలో కెల్లా రెండవ పొడవైన మరియు విశాలమైన సెడాన్ నిలుస్తుంది. అంతేకాకుండా, స్కోడా స్లావియా బెస్ట్-ఇన్-క్లాస్ 2651 మిమీ వీల్‌బేస్ మరియు 521 లీటర్ల బూట్ స్పేస్‌తో లభిస్తుంది. స్కోడా స్లావియా సెడాన్‌ను కంపెనీ రెండు ఇంజన్ ఆప్షన్లతో విడుదల చేసింది. వీటిలో మొదటిది 113 బిహెచ్‌పి పవర్‌ను మరియు 178 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.0 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ మరియు రెండవది 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.5 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్.

హోండా సిటీ, మారుతి సియాజ్ మరియు హ్యుందాయ్ వెర్నాలతో స్కోడా స్లావియా పోటీ పడగలదా..?

స్కోడా స్లావియా స్టాండర్డ్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. అయితే, ఇందులో మరింత శక్తివంతమైన 1.5 లీటర్ టిఎస్ఐ ఇంజన్ మాత్రం 7 స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను పొందుతుంది మరియు 1.0 లీటర్ వెర్షన్ 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది. స్కోడా స్లావియా మిడ్-సైజ్ సెడాన్ ఈ విభాగంలో పూర్తిగా సరికొత్త మోడల్ కావడం వలన ఇది మార్కెట్లో నుండి ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. మరి ఇది ఈ విభాగంలోని ఇతర మోడళ్లతో ఏవిధంగా పోటీ పడుతుందో తెలుసుకుందాం రండి.

హోండా సిటీ, మారుతి సియాజ్ మరియు హ్యుందాయ్ వెర్నాలతో స్కోడా స్లావియా పోటీ పడగలదా..?

హోండా సిటీ - ఐదవ తరం (Honda City - 5th Generation)

కారులో స్థలాన్ని చక్కగా ఎలా ఉపయోగించుకోవాలో హోండా బాగా తెలుసు, కొత్త హోండా సిటీ సెడాన్ కారే ఇందుకు సరైన ఉదాహరణ. ఈ సెడాన్ బాహ్య కొలతలు సూచించిన దానికంటే, ఇంటీరియర్‌లో ఎక్కువ స్థలం మనకు లభిస్తుంది. హోండా సిటీ సెడాన్ 2,600 మిమీ వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది మరియు దీనితో పోల్చుకుంటే, స్కోడా స్లావియా వీల్‌బైస్ 51 మిమీ పెద్దదిగా ఉంటుంది. అలాగే, హోండా సిటీ సెడాన్ కొలతలను గమనిస్తే, దీని పొడవు 4549 మిమీ, వెడల్పు 1748 మిమీ మరియు ఎత్తు 1489 మిమీగా ఉంటుంది.

హోండా సిటీ, మారుతి సియాజ్ మరియు హ్యుందాయ్ వెర్నాలతో స్కోడా స్లావియా పోటీ పడగలదా..?

హోండా సిటీ సెడాన్ ఈ సెగ్మెంట్‌లో కెల్లా పొడవైన మరియు ఎత్తైన సెడాన్. హోండా సిటీ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులోని 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ 119.35 బిహెచ్‌పి పవర్‌ను మరియు 145 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇందులోని 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ 97.89 బిహెచ్‌పి యపవర్‌ను మరియు 200 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. పెట్రోల్ ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుండగా, డీజిల్ ఇంజన్ కేవలం 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభిస్తుంది.

హోండా సిటీ, మారుతి సియాజ్ మరియు హ్యుందాయ్ వెర్నాలతో స్కోడా స్లావియా పోటీ పడగలదా..?

మారుతి సుజుకి సియాజ్ (Maruti Suzuki Ciaz)

మారుతి సుజుకి సియాజ్ సెడాన్ కారులో వెనుక వరుసలోని ప్రయాణీకుల కోసం అత్యుత్తమ క్యాబిన్ స్పేస్ లభిస్తుంది. ఈ కారు కూడా ఇంచు మించు స్కోడా స్లావియా మాదిరిగా వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. సియాజ్ 2650 మిమీ వీల్‌బేస్‌తో, ఇది దాని సెగ్మెంట్‌లో రెండవ పొడవైన వీల్‌బేస్‌ను కలిగిన కారుగా ఉంది. అంతే కాకుండా, మారుతి సియాజ్ మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీని కలిగి ఉండి, ఉత్తమ మైలేజ్‌ను ఆఫర్ చేస్తుంది. మారుతి సుజుకి సియాజ్ కేవలం ఒకే ఒక పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే లభిస్తుంది.

హోండా సిటీ, మారుతి సియాజ్ మరియు హ్యుందాయ్ వెర్నాలతో స్కోడా స్లావియా పోటీ పడగలదా..?

ఈ కారులో 1.5 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ గరిష్టంగా 103.25 బిహెచ్‌పి పవర్‌ను మరియు 138 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మరియు 4 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ తో లభిస్తుంది. కొలతల పరంగా చూస్తే, మారుతి సుజుకి సియాజ్ ఈ విభాగంలో 4490 మిమీ పొడవు, 1730 మిమీ వెడల్పు మరియు 1485 మిమీ ఎత్తును కలిగి ఉంటుంది. ఈ కొలతల వద్ద ఇది స్కోడా స్లావియా కంటే కొంచెం చిన్నదిగా ఉంటుంది.అయితే, సియాజ్ 510 లీటర్ల బూట్ స్పేస్‌తో ఈ విభాగంలో రెండవ అతిపెద్ద కారుగా ఉంటుంది.

హోండా సిటీ, మారుతి సియాజ్ మరియు హ్యుందాయ్ వెర్నాలతో స్కోడా స్లావియా పోటీ పడగలదా..?

హ్యుందాయ్ వెర్నా (Hyundai Verna)

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ అందిస్తున్న మిడ్-సైజ్ సెడాన్ వెర్నా, ఈ విభాగంలో కెల్లా అత్యుత్తమ ఫీచర్లు మరియు టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో యువకుల మొదటి ఎంపికగా ఉంటోంది. కంపెనీ ఈ కారును మొత్తం మూడు ఇంజన్ ఆప్షన్లతో అందిస్తోంది. వీటిలో మొదటిది 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, ఇది 113.18 బిహెచ్‌పి పవర్‌ను మరియు 143.8 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఈ ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

హోండా సిటీ, మారుతి సియాజ్ మరియు హ్యుందాయ్ వెర్నాలతో స్కోడా స్లావియా పోటీ పడగలదా..?

ఇకపోతే, రెండవ ఇంజన్ ఆప్షన్ అయిన 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 113.5 బిహెచ్‌పి పవర్‌ను మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ డీజిల్ ఇంజన్‌ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఆప్షన్లతో లభిస్తుంది. ఇక ఇందులోని చివరి ఇంజన్ ఆప్షన్ 1.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్, ఇది గరిష్టంగా 118 బిహెచ్‌పి పవర్‌ను మరియు 172 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఈ ఇంజన్ ప్రత్యేకమై 7 స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కొలతల పరంగా చూస్తే, హ్యుందాయ్ వెర్నా పొడవు 4440 మిమీ, వెడల్పు 1729 మిమీ, ఎత్తు 1475 మిమీ మరియు వీల్‌బేస్ 2600 మిమీగా ఉంటుంది. హ్యుందాయ్ వెర్నా యొక్క బూట్ స్పేస్ 480 లీటర్లు మాత్రమే ఉంటుంది.

హోండా సిటీ, మారుతి సియాజ్ మరియు హ్యుందాయ్ వెర్నాలతో స్కోడా స్లావియా పోటీ పడగలదా..?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ఇదివరకు చెప్పుకున్నట్లుగా స్కోడా స్లావియా సెడాన్ ఈ విభాగంలో కొత్తగా వచ్చిన మోడల్ కాబట్టి, అదే దానికి అత్యధిక ప్రయోజనాన్ని చేకూర్చనుంది. అంతేకాకుండా, స్లావియా సెడాన్ ఈ విభాగంలోని ఇతర మోడళ్లతో పోల్చుకుంటే మోడ్రన్ డిజైన్, ఫీచర్లు మరియు ఇంజన్ ఆప్షన్లను కలిగి ఉంది. కాబట్టి, ఇది ఖచ్చితంగా ఈ రేసులో ముందు ఉంటుందనేది మా అభిప్రాయం.

Most Read Articles

Read more on: #స్కోడా #skoda
English summary
Skoda slavia vs honda city vs maruti suzuki ciaz vs hyunda verna
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X