Just In
- 53 min ago
ఇదుగిదిగో.. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా; త్వరలో విడుదల, కొత్త వివరాలు వెల్లడి
- 1 hr ago
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- 3 hrs ago
ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!
- 1 day ago
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
Don't Miss
- Sports
ఇంగ్లండ్ అలా చేయకుంటే భారత్‌ను అవమానపరిచినట్టే.. జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ల ఫైర్!
- News
జగన్ తన గొయ్యి తానే తీసుకుంటున్నాడు, ఉద్యోగుల తీరు ఇలా దేశ చరిత్రలోనే లేదు : యనమల ఫైర్
- Finance
భారీ లాభాల నుండి, భారీ నష్టాల్లోకి: రిలయన్స్ మహా పతనం
- Lifestyle
జనన నియంత్రణ ఉన్నప్పటికీ గర్భం వచ్చే ప్రమాదం
- Movies
RRR నుంచి అదిరిపోయే అప్డేట్: గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్, చరణ్.. వాళ్లిచ్చే సర్ప్రైజ్ అదే!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
స్కొడా కొత్త ఎస్‌యూవీ పేరు 'కుషాక్', 2021 సమ్మర్‌లో విడుదల
చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కోడా ఆటో, భారత మార్కెట్ కోసం ఓ మిడ్-సైజ్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసినదే. గతంలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో స్కొడా ప్రదర్శించిన విజన్ ఇన్ కాన్సెప్ట్ ఆధారంగా ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీని తయారు చేస్తున్నారు. కాగా, ఇప్పుడు ఆ మోడల్‌కు కంపెనీ ఓ పేరును, విడుదల సమయాన్ని కూడా ఖరారు చేసింది.

స్కొడా ఆటో పేర్కొన్న సమచారం ప్రకారం, ఈ బ్రాండ్ నుండి రాబోయే కొత్త ఎస్‌యూవీకి 'కుషాక్' (KUSHAQ) అనే పేరును ఖరారు చేశారు. స్కొడా భారత మార్కెట్లో ట్రేడ్‌మార్క్ చేసిన నాలుగు కొత్త పేర్లలో ఇది కూడా ఒకటి. భారతదేశం కోసం స్కొడా ఆటో సిద్ధం చేసుకున్న 'ఇండియా 2.0 ప్రాజెక్ట్' ప్లాన్ నుండి వస్తున్న తొలి మోడల్ ఇది.

స్కొడా కుషాక్ ఎస్‌యూవీని ఈ ఏడాది వేసవిలో విడుదల చేయాలని కంపెనీ నిర్ణయించింది. రానున్న నెలల్లో ఇందుకు సంబంధించి ఓ నిర్ధిష్ట తేదీ, సమయాన్ని కూడా కంపెనీ వెల్లడించే అవకాశం ఉంది. మార్కెట్ అంచనా ప్రకారం, దేశీయ విపణిలో స్కొడా కుషాక్ ధర రూ.12 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం కావచ్చని అంచనా.
MOST READ:దీని ముందు టెస్లా కూడా దిగదుడుపేనండోయ్.. ఎందుకో చూడండి

ఇటీవలి కాలంలో భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో అత్యంత పాపులర్ అయిన మరియు పోటీతో కూడుకున్న మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో స్కొడా కుషాక్ ప్రవేశించనుంది. ఈ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఎమ్‌జి హెక్టర్ మరియు హెక్టర్ ప్లస్, టాటా హారియర్, జీప్ కంపాస్ మరియు ఈ విభాగంలో కొత్తగా వస్తున్న 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

ఈ ఎస్‌యూవీకి కుషాక్ అనే పేరు పెట్టడానికి గల కారణాన్ని కూడా స్కొడా వివరించింది. కుషాక్ అనే పేరు 'కుషక్' అనే సంస్కృత పదం నుండి గ్రహించారు. సంస్కృతంలో కుషక్ అంటే రాజు లేదా చక్రవర్తి అని అర్ధమని కంపెనీ తెలిపింది. స్కొడా కుషాక్ దాని పేరుకు తగినట్లుగానే డిజైన్ మరియు వైఖరిని కలిగి ఉంటుందని, ఇది చెక్ వాహన తయారీదారుల గొప్ప చరిత్రను కూడా ప్రతిబింబింపజేసేలా ఉంటుందని కంపెనీ పేర్కొంది.
MOST READ:అద్భుతంగా ఉన్న మలయాళీ స్టార్ మమ్ముట్టి లగ్జరీ కారవాన్.. చూసారా !

భారత మార్కెట్ కోసం స్కొడా మరియు ఫోక్స్‌వ్యాగన్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఇండియా 2.0' ప్రాజెక్ట్‌లో భాగం వస్తున్న తొలి మోడల్ స్కొడా కుషాక్. అంతేకాకుండా, ఇది 'ఎమ్‌క్యూబి ఏ0 ఇన్' ప్లాట్‌ఫామ్‌పై తయారవుతున్న మొట్టమొదటి మోడల్ కావటం విశేషం. భారతదేశం కోసం ఇదే ప్లాట్‌ఫామ్‌పై భవిష్యత్తులో మరిన్ని స్కొడా మోడళ్లు తయారు కానున్నాయి.

స్కొడా కుషాక్ ఎస్‌యూవీని రెండు ఇంజన్ ఆప్షన్లలో విడుదల చేయవచ్చని సమాచారం. ఇందులో మొదటిది 1.0-లీటర్ పెట్రోల్ మరియు రెండవది 1.5-లీటర్ టిఎస్ఐ టర్బో పెట్రోల్ ఇంజన్. అయితే, ఇందులో 1.0-లీటర్ రెగ్యులర్ పెట్రోల్ ఇంజన్‌ను ఎంట్రీ లెవల్ వేరియంట్లలో మాత్రమే ఆఫర్ చేయవచ్చని తెలుస్తోంది.
MOST READ:ఒకటి, రెండు కాదు ఏకంగా 80 పోర్స్చే కార్లను కలిగి ఉన్న 80 ఏళ్ళ వ్యక్తి ; పూర్తి వివరాలు

ప్రస్తుతం, భారత్‌లో విక్రయిస్తున్న స్కొడా ర్యాపిడ్ సెడాన్‌లో ఉపయోగించిన 1.0-లీటర్ త్రీ-సిలిండర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌నే కుషాక్‌లో కూడా ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 108 బిహెచ్‌పి పవర్‌ను మరియు 175 ఎమ్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో సిక్స్-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కూడా ఆఫర్ చేయవచ్చని అంచనా.

ఇకపోతే, టాప్-ఎండ్ వేరియంట్లలో ఉపయోగించబోయే 1.5-లీటర్ టిఎస్ఐ ఇవో ఫోర్-సిలిండర్ టర్బో ఇంజన్ గరిష్టంగా 150 బిహెచ్‌పి పవర్‌ను మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సెవన్-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

కొత్త స్కొడా కుషాక్ ఎస్‌యూవీకి సంబంధించి ప్రస్తుతానికి పూర్తి సమాచారం లేకపోయినప్పటికీ, ఇందులో అనేక ఫీచర్లు అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌కి అనుగుణంగా, ఇందులో ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్స్ మరియు టెయిల్ ల్యాంప్స్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే మరియు బ్రాండ్ యొక్క కనెక్టింగ్ టెక్నాలజీలను సపోర్ట్ చేసే పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మొదలైనవి ఉండొచ్చని అంచనా. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూనే ఉండండి.