Just In
- 8 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 19 hrs ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 21 hrs ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 22 hrs ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- News
బీజేపీలోకి మెగాస్టార్ మిథున్ చక్రవర్తి -ప్రధాని మోదీ తొలి సభలోనే సంచలనం -బెంగాల్ సీఎం అభ్యర్థి?
- Movies
బీజేపీలో చేరిన డిస్కో డ్యాన్సర్.. ప్రధాని మోదీతో మిథున్ చక్రవర్తి కలిసి..
- Sports
ఐపీఎల్ 2021 షెడ్యూల్ వచ్చేసింది.. వేదికల్లో హైదరాబాద్‌కు దక్కని చోటు !
- Finance
ట్విట్టర్ సీఈవో 15 ఏళ్ల క్రితం తొలి ట్వీట్‌కు రూ.కోట్లు
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇలాంటి విచిత్రమైన ఎలక్ట్రిక్ కారును ఎప్పుడైనా చూశారా?
తరిగిపోతున్న శిలాజ ఇంధనాలు, అమాంతం పెరిగిపోతున్న వాహన కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు అనేక ఆటోమొబైల్ కంపెనీలు ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలను తయారు చేస్తున్న సంగతి మనకు తెలిసినదే.

ప్రస్తుతం ఈ సంస్థలన్నీ ప్రధానంగా ఎలక్ట్రిక్ కార్ల అభివృద్ధి మరియు తయారీపై దృష్టి సారించాయి. తాజాగా, స్విట్జర్లాండ్‌కు చెందిన 'మైక్రో' అనే కంపెనీ ఓ ప్రత్యేకమైన కారును తయారు చేసింది. జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ 1950ల కాలంలో విక్రయించిన ఇసెట్టా కారు నుండి స్పూర్తి పొంది ఈ ఎలక్ట్రిక్ కారును డిజైన్ చేశారు.

మైక్రో సంస్థ రూపొందించిన ఈ కారుకు "మైక్రోలినో 2.0" అనే పేరుతో పిలువనున్నారు. ఈ ఎలక్ట్రిక్ కారులో ఇద్దరికి మాత్రమే చోటు ఉంటుంది. ఈ కారులో ముందు వైపు మరియు వెనుక వైపు రెండు డోర్లు మాత్రమే ఉంటాయి. ముందు వైపు డోర్ కత్తెరలా పైవైపుకు తెరచుకుంటుంది. ఇకపోతే, వెనుక డోరు సాంప్రదాయ హైడ్రాలిక్ లిఫ్ట్ అప్ డోర్‌లా ఉంటుంది.
MOST READ:2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4 వి బైక్ రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..

ఈ కారులో గేర్‌బాక్స్ సెటప్ ఉండదు కాబట్టి, ఇందులో బెంచ్ సీట్‌ను అమర్చారు. ఈ సీట్‌పైనే డ్రైవర్ మరియు కో-ప్యాసింజర్ కూర్చోవలసి ఉంటుంది. ప్రోటోటైప్ ఫొటోలను గమనిస్తే, ఈ ఎలక్ట్రిక్ కారులో ఇద్దరు ప్రయాణీకులు చాలా ఇరుకుగా కూర్చున్నట్లు కనిపిస్తుంది.

చిన్నపాటి లగేజ్‌ను తీసుకువెళ్లేందుకు ఈ కారులో వెనుక వైపు బూట్ స్పేస్ కూడా ఉంటుంది. మైక్రో సంస్థ ప్రస్తుతం ఈ మైక్రోలినో 2.0 కారును స్విస్ రోడ్లపై పరీక్షిస్తోంది. వచ్చే సెప్టెంబర్ 2021 నాటికి ఈ ఎలక్ట్రిక్ కారును కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.
MOST READ:మంత్రి కాన్వాయ్ ఓవర్‌టేక్ చేయడంతో చిక్కులో పడ్డ పర్యాటకులు

రోజువారీ పట్టణ ప్రయాణాలను దృష్టిలో ఉంచుకొని మైక్రో సంస్థ ఈ కారును ఓ అర్బన్ ఈవీగా డిజైన్ చేసింది. ఈ కారు పరిమాణమే దీనికి ప్రధాన అడ్వాంటేజ్‌గా మారనుంది. రద్దీగా ఉండే ఇరుకైన నగర వీధుల్లో సైతం ఇలాంటి బుజ్జి కార్లతో ఎంచక్కా దూసుకుపోయే అవకాశం ఉంటుంది.

ఈ కారులోని సీట్ మరియు ఆకారం మాత్రమే కాదు, కారులోకి ప్రవేశించే మార్గం కూడా కొద్దిగా భిన్నంగా ఉంటుంది. మనం ఇప్పటివరకు చూసిన దాదాపు అన్ని కార్లలో సైడ్స్ నుండి కారులోని ప్రవేశిస్తాము. అయితే, ఈ కారులోకి ప్రవేశించడానికి నిష్క్రమించడానికి ఒకే డోర్ ఉంటుంది.
MOST READ:ఇదేం సిత్రం.. ట్రక్కులో కట్టేసి తీసుకెళ్తున్న జావా 42 బైక్‌కి ఓవర్‌స్పీడింగ్ ఛలాన్!?

ముందుగా ఈ కారులోకి డ్రైవర్ ప్రవేశించాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే కో-ప్యాసింజర్ అదే డోర్ గుండా కారు లోపలికి ప్రవేశిస్తారు. కారులోని ఇంటీరియర్ కూడా చాలా బేసిక్‌గా, ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఉంటుంది.

మైక్రోలినో 2.0 ప్రోటోటైప్‌లో స్టీరింగ్ వెనుక భాగంలో డిజిటల్ డిస్‌ప్లే సెటప్ ఉంటుంది. ఇది బ్యాటరీ రేంజ్, డ్రైవింగ్ స్పీడ్ వంటి ఇతర సమాచారాన్ని తెలియజేస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ కారులో హెడ్‌లైట్ క్లస్టర్‌నే సైడ్ మిర్రర్స్‌గా ఉపయోగించడం జరుగుతుంది.
MOST READ:నేపాల్ నుండి ఇండియాకి పెట్రోల్ స్మగ్లింగ్; అక్కడ రూ.22 తక్కువ అందుకే..

ప్రస్తుతానికి ఈ ప్రోటోటైప్‌లో ఏసి, మ్యూజిక్ సిస్టమ్ వంటి ఫీచర్ల లేనట్లుగా తెలుస్తోంది. అయితే, భవిష్యత్తులో ప్రొడక్షన్ వెర్షన్ మోడల్‌లో వీటిని ఆఫర్ చేయవచ్చని అంచనా. అలాగే, ఇందులోని సేఫ్టీ ఫీచర్ల గురించి కూడా ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. అయితే, దీనిని ధృడమైన ప్రెస్డ్ స్టీల్ అండ్ అల్యూమినియం మోనోకోక్ ఛాస్సిస్‌పై తయారు చేస్తున్నారు.

మైక్రోలినో 2.0 ఎలక్ట్రిక్ కారులో రెండు బ్యాటరీ ప్యాక్‌లను అమర్చనున్నట్లు సమాచారం. పూర్తి చార్జ్‌పై ఈ బ్యాటరీ 126 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేయవచ్చని సమాచారం. ఇందులోని ఎక్స్‌టెండెడ్ రేంజ్ వెర్షన్ పూర్తి చార్జ్‌పై 201 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేసే అవకాశం ఉంది.

ప్రస్తుతానికి ఈ కారు ధర మరియు ఇతర వివరాల గురించి ఎలాంటి సమాచారం లేదు. అలాగే, ఇది భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు కూడా లేనట్లుగా తెలుస్తోంది.