ఒక్కరోజులో 100 టాటా సఫారీ ఎస్‌యూవీల డెలివరీ, ఎక్కడంటే..?

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్, ఇటీవలే మార్కెట్లో ప్రవేశపెట్టిన తమ సరికొత్త 2021 టాటా సఫారీ కోసం కంపెనీ ఓ మెగా డెలివరీ డ్రైవ్‌ను నిర్వహించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కరోజే కంపెనీ 100 సఫారీ ఎస్‌యూవీలను డెలివరీ చేసింది.

ఒక్కరోజులో 100 టాటా సఫారీ ఎస్‌యూవీల డెలివరీ, ఎక్కడంటే..?

టాటా మోటార్స్ అందిస్తున్న హారియర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఈ సరికొత్త సఫారీ ఎస్‌యూవీని తయారు చేసింది. బుకింగ్స్ పరంగా కొత్త టాటా సఫారీ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఎస్‌యూవీ బుకింగ్స్‌లో ఎక్కువ భాగం ఓర్కాస్ వైట్ మరియు రాయల్ బ్లూ కలర్ ఆప్షన్స్‌లో ఎక్స్‌జెడ్ ప్లస్ వేరియంట్ ద్వారా వచ్చినట్లు కంపెనీ తెలిపింది.

ఒక్కరోజులో 100 టాటా సఫారీ ఎస్‌యూవీల డెలివరీ, ఎక్కడంటే..?

దేశవ్యాప్తంగా ఇప్పటికే కొత్త టాటా సఫారి డెలివరీలు కూడా ప్రారంభమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో కంపెనీ మెగా డెలివరీ ఈవెంట్లను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగనే, తాజాగా ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో 100 యూనిట్ల సఫారీలను ఒకే రోజులో పంపిణీ చేసింది. టాటా మోటార్స్ 2021 ఆర్థిక సంవత్సరంలో తమ మొత్తం వార్షిక అమ్మకాలలో 9 శాతం అమ్మకాలను ఢిల్లీ ఎన్‌సిఆర్‌లోనే నమోదు చేసింది.

MOST READ:మైసూర్‌లో రోడ్డెక్కిన అంబారీ డబుల్ డెక్కర్ బస్సులు.. పూర్తి వివరాలు

ఒక్కరోజులో 100 టాటా సఫారీ ఎస్‌యూవీల డెలివరీ, ఎక్కడంటే..?

టాటా మోటార్స్ గడచిన ఫిబ్రవరి 22న తమ సరికొత్త సఫారీని భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో దీని ధరలు రూ.14.69 లక్షల నుండి రూ.20.20 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. ఈ ఎస్‌యూవీని XE, XM, XT, XT +, XZ మరియు XZ + అనే ఆరు వేరియంట్లలో ప్రవేశపెట్టారు. ఇది 6-సీటర్ మరియు 7-సీటర్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది.

ఒక్కరోజులో 100 టాటా సఫారీ ఎస్‌యూవీల డెలివరీ, ఎక్కడంటే..?

సరికొత్త 2021 టాటా సఫారీ ఎస్‌యూవీని టాటా మోటార్స్ యొక్క సరికొత్త 'ఇంపాక్ట్ 2.0' డిజైన్ లాంగ్వేజ్‌ను ఆధారంగా తయారు చేశారు. ఇది ల్యాండ్ రోవర్ డి8 ప్లాట్‌ఫామ్ అయిన ఒమేగా ఆర్కిటెక్చర్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. దీనిని టాటా హారియర్ మోడల్ ఆధారంగా తయారు చేసిన నేపథ్యంలో, ముందు వైపు నుంచి చూస్తే ఫ్రంట్ గ్రిల్ మినహా ఈ రెండు మోడళ్లు ఒకేలా కిపిస్తాయి.

MOST READ:2021 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ రివ్యూ ; కొత్త ఫీచర్స్ & పూర్తి వివరాలు

ఒక్కరోజులో 100 టాటా సఫారీ ఎస్‌యూవీల డెలివరీ, ఎక్కడంటే..?

అయితే, కొత్త సఫారీ వెనుక భాగంలో మాత్రమే అనేక కీలకమైన మార్పులు కనిపిస్తాయి. ఇందులో రీడిజైన్ చేయబడిన ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్, మరింత నిటారుగా ఉండే టెయిల్‌గేట్ మరియు ఎల్‌ఈడీ స్టాప్ లాంప్‌తో కూడిన రియర్ రూఫ్ స్పాయిలర్, పొడవైన ఓవర్‌హాంగ్, స్టెప్డ్ రూఫ్, కొత్తగా డిజైన్‌తో కూడిన అల్లాయ్ వీల్స్ మరియు పెద్ద క్వార్టర్ ప్యానెల్ మొదలైనవి ఉన్నాయి.

ఒక్కరోజులో 100 టాటా సఫారీ ఎస్‌యూవీల డెలివరీ, ఎక్కడంటే..?

టాటా సఫారీ టాప్-ఎండ్ వేరియంట్ 6-సీటర్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఇందులో మధ్య వరుసలో కెప్టెన్ సీట్స్, పెద్ద పానరోమిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, 8.8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఐఆర్‌ఏ కనెక్ట్ టెక్నాలజీ, ఓయిస్టెర్ వైట్ ప్రీమియం అప్‌హోలెస్ట్రీ, యాష్‌వుడ్ గ్రే థీమ్ డాష్‌బోర్డ్ వంటి మరెన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

MOST READ:వాహ్.. కేవలం 18 గంటల్లో 25.54 కిమీ రోడ్డు పూర్తి.. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు

ఒక్కరోజులో 100 టాటా సఫారీ ఎస్‌యూవీల డెలివరీ, ఎక్కడంటే..?

కొత్త 202 టాటా సఫారీ ఒకే ఒక డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుంది. ఇందులోని 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 168 బిహెచ్‌పి పవర్‌ను మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది సిక్స్-స్పీడ్ మాన్యువల్ లేదా సిక్స్-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

ఒక్కరోజులో 100 టాటా సఫారీ ఎస్‌యూవీల డెలివరీ, ఎక్కడంటే..?

టాటా సఫారీలోని అన్ని వేరియంట్లు కూడా కేవలం 2-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తాయి. ఇందులో 4-వీల్ డ్రైవ్ వెర్షన్‌ను ఆప్షనల్‌గా కూడా ఆఫర్ చేయటం లేదు. టాటా సఫారీ రాయల్ బ్లూ, ఓర్కస్ వైట్ మరియు డేటోనా గ్రే అనే మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ కొత్త తరం 2021 మోడల్ టాటా సఫారీని ఇటీవలే మా డ్రైవ్‌స్పార్క్ బృందం టెస్ట్ డ్రైవ్ చేసింది. - ఈ కారుకి సంబంధించిన పూర్తి రివ్యూ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ:స్కూల్ బస్సులు యెల్లో కలర్‌లో ఉండటానికి కారణం ఏంటో తెలుసా.. అయితే ఇది చూడండి

Most Read Articles

English summary
Tata Motors Delivered 100 New Safari SUVs In One Day In Delhi-NCR. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X