అప్పుడే 5000 యూనిట్లు దాటిన టాటా సఫారీ బుకింగ్స్ ; వివరాలు

దేశీయ మార్కెట్లో ప్రముఖ వాహనతయారీదారు టాటా మోటార్స్ యొక్క అత్యంత ప్రసిద్ధి మోడల్ టాటా సఫారి. ఇటీవల కంపెనీ దీనిని 6 మరియు 7 సీటర్ మోడల్‌గా తీసుకువచ్చింది. టాటా సఫారి గత నెలలోనే విడుదలైంది. భారత మార్కెట్లో విడుదలైనప్పటినుండి దీనికి మార్కెట్లో మంచి స్పందన వస్తోంది.

అప్పుడే 5000 యూనిట్లు దాటిన టాటా సఫారీ బుకింగ్స్ ; వివరాలు

కంపెనీ ఇటీవల అందించిన సమాచారం ప్రకారం, టాటా సఫారీ బుకింగ్స్ ఇప్పుడు 5000 యూనిట్లకంటే ఎక్కువ. టాటా సఫారి కంపెనీ యొక్క పూణే ప్లాంట్లో ఉత్పత్తి చేయబడుతోంది. కానీ టాటా సఫారి యొక్క వెయిటింగ్ పీరియడ్ 2.5 నెలల వరకు ఉంటుందని ఇటీవల వార్తలు వచ్చాయి.

అప్పుడే 5000 యూనిట్లు దాటిన టాటా సఫారీ బుకింగ్స్ ; వివరాలు

ఇప్పుడు కంపెనీ తన ఉత్పత్తిని మరింత వేగంగా పెంచే దిశగా కృషి చేస్తోంది. హారియర్ మరియు అల్ట్రోస్ కూడా ఈ కంపెనీ ప్లాంట్‌లో తయారవుతున్నాయి. ప్రస్తుతం ఈ మూడు మోడళ్లకు మంచి స్పందన లభిస్తుంది. ఈ కొత్త మోడల్‌కు మంచి స్పందన లభిస్తుండగా, గత కొన్ని నెలలుగా అల్ట్రోల అమ్మకాలు బాగా పెరిగాయి.

MOST READ:రోడ్డుపై యాక్టివా స్కూటర్‌పై ఉన్న యువతి చేసిన పనికి చిర్రెత్తిన కెటిఎమ్ బైక్ రైడర్‌

అప్పుడే 5000 యూనిట్లు దాటిన టాటా సఫారీ బుకింగ్స్ ; వివరాలు

అదే సమయంలో, టాటా మోటార్స్ యొక్క నెక్సాన్ ఎస్‌యూవీకి మంచి స్పందన లభిస్తోంది. ఈ కారణంగా కంపెనీ యొక్క అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా నిలిచింది. దీని వెయిటింగ్ పీరియడ్ ఇప్పుడు 2.5 నెలల కన్నా ఎక్కువ. ఈ నాలుగు మోడళ్ల అమ్మకాలు బాగా జరుగుతున్నాయి.

అప్పుడే 5000 యూనిట్లు దాటిన టాటా సఫారీ బుకింగ్స్ ; వివరాలు

కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త టాటా సఫారి ధర రూ. 14.69 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులో దాని టాప్-స్పెక్ వేరియంట్ ధర 21.45 లక్షల రూపాయలు. సంస్థ ఈ కారును 9 మాన్యువల్ మరియు 6 ఆటోమేటిక్ వేరియంట్లలో ప్రవేశపెట్టింది.

MOST READ:పార్కింగ్ సమయంలో కంట్రోల్ తప్పిన పోర్స్చే మాకాన్ ; తృటిలో తప్పిన ప్రమాదం

అప్పుడే 5000 యూనిట్లు దాటిన టాటా సఫారీ బుకింగ్స్ ; వివరాలు

టాటా సఫారి 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ కలిగి ఉంటుంది, ఇది 173 బిహెచ్‌పి శక్తిని మరియు 350 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. దీనికి 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్ ఉన్నాయి. కంపెనీ దీనిని మునుపటికంటే ఎక్కువ ఫీచర్స్ తో అప్డేట్ చేసింది. టాటా సఫారీ యొక్క 6 సీట్ల వేరియంట్‌లో మధ్య వరుసలో కెప్టెన్ సీటు, 7 సీట్ల వేరియంట్‌లో బెంచ్ సీటు ఉన్నాయి.

అప్పుడే 5000 యూనిట్లు దాటిన టాటా సఫారీ బుకింగ్స్ ; వివరాలు

టాటా సఫారీ యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయూన్ని వస్తే, ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి, హిల్ డీసెంట్ కంట్రోల్, చైల్డ్ సీట్ ఐసోఫిక్స్, రియర్ పార్కింగ్ సెన్సార్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్ వంటివి ఉన్నాయి.

MOST READ:పుష్ పుల్ టెక్నాలజీ వల్ల ట్రైన్ వేగం మరింత పెరిగే అవకాశం ; ఈ పుష్ పుల్ టెక్నాలజీ ఏంటనుకుంటున్నారా..!

అప్పుడే 5000 యూనిట్లు దాటిన టాటా సఫారీ బుకింగ్స్ ; వివరాలు

కొత్త సఫారి మంచి ఇంటీరియర్స్ కూడా కలిగి ఉంటుంది . ఇందులో లెదర్ సీట్ అప్హోల్స్ట్రే, లేత గోధుమరంగు ఇంటీరియర్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, రియర్ ఎయిర్ వెంట్స్, యుఎస్బి ఛార్జింగ్ స్లాట్లు, 8.8 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 ఇంచెస్ ఇన్‌స్ట్రుమెంట్ పానెల్, జెబిఎల్ స్పీకర్, పనరోమిక్ సన్‌రూఫ్, ఐఆర్‌ఎ కనెక్ట్ టెక్నిక్స్, వీటితో పాటు హిందీ, ఇంగ్లీష్ మరియు హింగ్లిష్ వాయిస్ కమాండ్స్ కూడా ఇవ్వబడ్డాయి.

Most Read Articles

English summary
Tata Safari Bookings Crosses 5000 Mark. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X