Just In
- 9 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 20 hrs ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 22 hrs ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 23 hrs ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- News
మోదీ దుకాణంలో మందులు అగ్గువ -శానిటరీ ప్యాడ్ రూ.2.50కే: ప్రధాని; 7500వ జన ఔషధి కేంద్రం ప్రారంభం
- Movies
రాజీవ్ కనకాల మా నాన్న.. చైల్డ్ ఆర్టిస్ట్ మాటలకు సుమ షాక్
- Sports
ఐపీఎల్ 2021 షెడ్యూల్ వచ్చేసింది.. వేదికల్లో హైదరాబాద్‌కు దక్కని చోటు !
- Finance
ట్విట్టర్ సీఈవో 15 ఏళ్ల క్రితం తొలి ట్వీట్‌కు రూ.కోట్లు
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
గుజరాత్‌లో టెస్లా ప్లాంట్; బెంగుళూరులో ఆర్ అండ్ డి మాత్రమే!
అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించనున్న సంగతి తెలిసినదే. ఈ మేరకు ఇప్పటికే, కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు నగరంలో ఓ ఆర్ అండ్ డి (రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్) సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన టెస్లా, తమ తయారీ కేంద్రాన్ని గుజరాత్ రాష్ట్రంలో నెలకొల్పాలని ప్లాన్ చేస్తోంది.

ఇందుకు ప్రధాన కారణం, గుజరాత్‌లో రెండు ప్రధాన ఓడరేవులు ఉండటమే. టెస్లా తమ ఎలక్ట్రిక్ కార్లను పూర్తిగా విదేశాల్లో తయారు చేసి ఇక్కడికి దిగుమతి చేసుకోవాలన్నా లేదా ఇక్కడే భారతదేశంలోనే స్థానికంగా వాటిని అసెంబుల్ చేయాలన్నా విడిభాగాలను దిగుమతి చేసుకునేందుకు అందుబాటులో ఓడరేవు ఉండాలి.

ఈ నేపథ్యంలో, గుజరాత్‌లో ఉన్న కండ్ల లేదా ముంద్రా ఓడరేవుకు సమీపంలో టెస్లా తమ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. గుజరాత్ రాష్ట్రం ఇప్పటికే, తన అద్భుతమైన మౌళిక సదుపాయాలతో గ్లోబల్ ఆటోమొబైల్ దిగ్గజాలకు ఎంతో ఇష్టమైన గమ్యస్థానంగా మారుతోంది.
MOST READ:కార్లపై స్పెషల్ ఆపరేషన్ స్టార్ట్ చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా ?

టెస్లా భారతదేశంలో తన కార్యకలాపాలను ప్రారంభించడానికి గుజరాత్ రాష్ట్రంతో సహా మరికొన్ని ఇతర రాష్ట్రాలతో కూడా సంప్రదింపులు జరుపుతోంది. కాగా, గుజరాత్‌లో టెస్లా బేస్‌ను ఏర్పాటు చేసేందుకు ఆ కంపెనీకి కావల్సిన అన్ని రకాల సహాయాలు మరియు ప్రోత్సాహకాలు తప్పకుండా ఇస్తామని గుజరాత్ ప్రభుత్వం హామీ ఇచ్చింది.

టెస్లా భారత్‌లో తమ ప్రయాణాన్ని 'మోడల్ 3'తో ప్రారంభించే అవకాశం ఉంది. ప్రస్తుతం టెస్లా నుండి అత్యంత పాపులర్ అయిన 'మోడల్ ఎస్' మరియు 'మోడల్ ఎక్స్' ఎలక్ట్రిక్ కార్ల కంటే ముందుగా కంపెనీ ఈ మోడల్ 3ని అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించింది. టెస్లా మోడల్ 3 ఇప్పటికీ కంపెనీ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా ఉంది.
MOST READ:2030 నాటికి భారత్‌లో రోడ్డు ప్రమాదాలు సున్నా చేయడానికి కేంద్రం ముందడుగు

భారతదేశంలో టెస్లా రాకకు సంబంధించిన ఖచ్చిమైన తేదీలను మరియు దేశంలో టెస్లా కార్ల ధరలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఇటీవలే టెస్లా ఐఎన్‌సి బెంగళూరులో ఆర్ అండ్ డి సెటప్ కోసం తమ పేరును రిజిస్టర్ చేసుకుంది. వచ్చే ఏడాది ప్రారంభం నాటికి భారత రోడ్లపై టెస్లా ఎలక్ట్రిక్ కార్లు పరుగులు తీసే అవకాశం ఉంది.

టెస్లాను తమ రాష్ట్రానికి ఆహ్వానించేందుకు గుజరాత్‌తో పాటుగా మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలు సిద్ధంగా ఉన్నాయి. ఈ మేరకు టెస్లా అధికారులతో చర్చలు కూడా జరుపుతున్నాయి. అయితే, టెస్లా మాత్రం గుజరాత్ రాష్ట్రాన్నే తమ తయారీ కేంద్రంగా మార్చుకునే అవకాశం ఉంది.
MOST READ:భారత సర్కార్ సాయం చేసి ఉంటే రూ.5,000 లకే ఈ కార్ లభించేంది..

గుజరాత్ ఇప్పటికే పునరుత్పాదక ఇంధన కేంద్రంగా అభివృద్ధి చెందడంతో పాటుగా ఆ రాష్ట్రంలో విద్యుత్ ఖర్చు కూడా చాలా పోటీగా ఉంటుంది. అంతేకాకుండా, గుజరాత్ రాష్ట్రంలో దేశంలో మధ్యలో ఉండటం, రెండు ప్రధాన ఓడరేవులను కలిగి ఉండటం మరియు భారతదేశంలోని అన్ని ప్రధాన మార్కెట్లకు సామీప్యతను కలిగి ఉండటం వంటి అంశాలను పరిశీలిస్తే, టెస్లాకు ఇంతకంటే మంచి మార్కెట్ మరొకటి ఉండకపోవచ్చు.

భారతదేశంలో ముందుగా టెస్లా విడుదల చేయబోయే ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ కారు 'మోడల్ 3' విషయానికి వస్తే, ఈ కారులో కస్టమర్ ఎంచుకునే వేరియంట్‌ను బట్టి, ఇందులోని బ్యాటరీలు పూర్తి ఛార్జ్‌పై 500 కిలోమీటర్లకు పైగా డ్రైవింగ్ రేంజ్‌ని ఆఫర్ చేస్తాయి. ఈ కారు కేవలం 3.5 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు.
MOST READ:స్పోర్ట్స్ కార్‌లా హ్యుందాయ్ ఎలాంట్రా; దీని నుంచి చూపు తిప్పుకోవటం కష్టం!

సుధీర్ఘమైన డ్రైవింగ్ రేంజ్, అత్యుత్తమ నాణ్యత, అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీ (డ్రైవర్ ప్రమేయం లేకుండా సెన్సార్లు, జిపిఎస్ ఆధారంగా దానంతట అదే నడిచే టెక్నాలజీ) వంటి అనేక ఫీచర్లతో ఇది మంచి ప్రాక్టికాలిటీని కలిగి ఉంటుంది. ఈ కార్లలోని క్యాబిన్‌లో డ్యాష్‌బోర్డు మధ్యలో అమర్చబడిన ఓ పెద్ద టాబ్లెట్ లాంటి టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ ఉంటుంది.

ఈ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ద్వారా కారులోని అనేక అంశాలను కంట్రోల్ చేయవచ్చు. కారు చార్జింగ్ స్థితి, ప్రయాణించగలిగే దూరం, సమీపంలోని చార్జింగ్ స్టేషన్ మొదలైన డ్రైవర్ ఉపయోగర సమాచారాన్ని ఇది తెలియజేస్తుంది. టెస్లా భారత్‌కు రావటంతో, ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ ఇకపై మరింత వేగంతో వృద్ధి చెందవచ్చని నిపుణులు భావిస్తున్నారు.