525 హార్స్ పవర్ వి8 ఇంజన్‌తో వస్తున్న మోస్ట్ పవర్‌ఫుల్ డిఫెండర్ వి8

టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ ల్యాండ్ రోవర్ అందిస్తున్న డిఫెండర్ ఎస్‌యూవీలో ఇప్పుడు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది.

525 హార్స్ పవర్ వి8 ఇంజన్‌తో వస్తున్న మోస్ట్ పవర్‌ఫుల్ డిఫెండర్ వి8

కొత్త 2021 ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఇప్పుడు 525 హార్స్ పవర్ శక్తిని జనరేట్ చేసే సూపర్‌చార్జ్డ్ వి8 ఇంజన్‌తో అందుబాటులోకి రానుంది. అడ్వెంచర్ సిరీస్‌లో టాప్-ఆఫ్ ది లైన్ వేరియంట్‌గా రానున్న ఈ ఎస్‌యూవీ 90 (3-డోర్) మరియు 110 (5-డోర్) వెర్షన్లలో లభ్యం కానుంది.

525 హార్స్ పవర్ వి8 ఇంజన్‌తో వస్తున్న మోస్ట్ పవర్‌ఫుల్ డిఫెండర్ వి8

జాగ్వార్ ల్యాండ్ రోవర్ గ్రూప్‌లోనే అత్యంత పాపులర్ అయిన సూపర్‌చార్జ్డ్ 5.0 లీటర్ వి8 ఇంజన్‌తో కొత్త 2021 ల్యాండ్ రోవర్ డిఫెండర్ వి8 ఎస్‌యూవీని తయారు చేశారు. ఈ ఇంజన్ గరిష్టంగా 525 హెచ్‌పి పవర్‌ను మరియు 625 ఎన్‌ఎమ్ టార్క్‌ను పంపిణీ చేస్తుంది.

MOST READ:భారత మార్కెట్లో రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్ కార్స్ డిమాండ్.. కారణం ఇదే

525 హార్స్ పవర్ వి8 ఇంజన్‌తో వస్తున్న మోస్ట్ పవర్‌ఫుల్ డిఫెండర్ వి8

ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఆల్-వీల్ డ్రైవ్‌తో లభ్యం కానున్న ఈ పవర్‌ఫుల్ డిఫెండర్ వి8 మోడల్ (90 వేరియంట్) కేవలం 5.2 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిమీ వేగాన్ని చేరుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 240 కిలోమీటర్లు.

525 హార్స్ పవర్ వి8 ఇంజన్‌తో వస్తున్న మోస్ట్ పవర్‌ఫుల్ డిఫెండర్ వి8

డిఫెండర్ సిరీస్‌లోనే ఇది అత్యంత వేగవంతమైన మరియు శక్తివంతమైన మోడల్. ఈ పవర్‌ను హ్యాండిల్ చేయటం కోసం కంపెనీ దీని 4×4 సిస్టమ్ మరియు చాస్సిస్‌లో స్వల్ప మార్పులు చేసింది. ఇందులో ప్రత్యేకంగా కాలిబ్రేట్ చేసిన స్ప్రింగ్‌లు మరియు డాంపర్లు, పెద్ద యాంటీ-రోల్ బార్‌లు, అలాగే కఠినమైన మలుపులలో సైతం సులువుగా ప్రయాణించేందుకు వీలుగా డిజైన్ చేసిన ఎలక్ట్రానికల్లీ కంట్రోల్డ్ రియర్ డిఫరెన్షియల్ వంటి మార్పులు ఉన్నాయి.

MOST READ:పరుగులుపెడుతున్న నిస్సాన్ మ్యాగ్నైట్ బుకింగ్స్ ; కేవలం 3 నెలల్లో 40000 యూనిట్లు

525 హార్స్ పవర్ వి8 ఇంజన్‌తో వస్తున్న మోస్ట్ పవర్‌ఫుల్ డిఫెండర్ వి8

ఈ కారులో కొత్తగా జోడించిన ఎలక్ట్రానికల్లీ కంట్రోల్డ్ రియర్ డిఫరెన్షియల్ ఫీచర్ కారణంగా వెనుక యాక్సిల్ మంచి పనితీరును చూపుతుంది. అలాగే, ఇందులోని సస్పెన్షన్ సెటప్‌ను మరింత ధృడంగా చేసి, రీకాలిబ్రేట్ చేశారు. యాంటీ-రోల్ బార్ల పరిమాణాన్ని మార్చారు మరియు బ్రేక్‌లను కూడా ఈ వేరియంట్ కోసం విస్తరించడం జరిగింది.

525 హార్స్ పవర్ వి8 ఇంజన్‌తో వస్తున్న మోస్ట్ పవర్‌ఫుల్ డిఫెండర్ వి8

కొత్త 2021 ల్యాండ్ రోవర్ డిఫెండర్ వి8 మోడల్‌ను కార్పాతియన్ ఎడిషన్ అనే ప్రత్యేక సిరీస్‌తో విక్రయించనున్నారు. ఇది కార్పాతియన్ గ్రే అని పిలువబడే ప్రత్యేకమైన బాడీ కలర్‌ను కలిగి ఉంటుంది. అలాగే, దీని హుడ్, రూఫ్ మరియు టెయిల్‌గేట్‌లను బ్లాక్ కలర్‌లో పెయింట్ చేయబడి ఉంటుంది.

MOST READ:టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ ఆ "లైన్" దాటితే, ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు!

525 హార్స్ పవర్ వి8 ఇంజన్‌తో వస్తున్న మోస్ట్ పవర్‌ఫుల్ డిఫెండర్ వి8

ఈ సరికొత్త 2021 ల్యాండ్ రోవర్ డిఫెండర్ వి8 ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. అయితే, ఇది భారత్‌లో కూడా విడుదల అవుతుందా లేదా అనే దానిపై ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు. మన దేశంలో ఇతర ల్యాండ్ రోవర్ డిఫెండర్ వేరియంట్లను కంపెనీ విక్రయిస్తోంది.

Most Read Articles

English summary
The Most Powerful Land Rover Defender Unveiled With Supercharged 5.0 Litre V8 Engine, Details. Read In Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X