మార్కెట్లో రూ.15 లక్షల లోపు లభించే బెస్ట్ ఎస్‌యూవీలు

భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో ఎస్‌యూవీలకు డిమాండ్ గణనీయంగా ఉంటోంది. హ్యాచ్‌బ్యాక్, సెడాన్లతో పోల్చుకుంటే ఎస్‌యూవీ విభాగంలోనే అమ్మకాల వృద్ధి రేటు అత్యధికంగా ఉంటోంది. ఈ పోటీకి తగ్గట్లు గానే కార్ కంపెనీలు కూడా అనేక ఎస్‌యూవీలను దేశీయ విపణిలో అందిస్తున్నాయి.

మార్కెట్లో రూ.15 లక్షల లోపు లభించే బెస్ట్ ఎస్‌యూవీలు

ప్రస్తుతం భారత మార్కెట్లో సరసమైన మరియు ఫీచర్ లోడెడ్ ఎస్‌యూవీలు అందుబాటులో ఉన్నాయి. గత కొన్నేళ్లుగా మార్కెట్ ట్రెండ్‌ను పరిశీలిస్తే, కస్టమర్లు ఎక్కువగా ఎస్‌యూవీలనే ఆదరించడాన్ని చూడొచ్చు. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం భారత్‌లో రూ.15 లక్షల కన్నా తక్కువ ధరకు లభించే ఎస్‌యూవీల వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మార్కెట్లో రూ.15 లక్షల లోపు లభించే బెస్ట్ ఎస్‌యూవీలు

1. కియా సెల్టోస్ - ప్రారంభ ధర రూ.9.89 లక్షలు

కియా మోటార్స్ సంస్థకి గేమ్ ఛేంజర్ మోడల్ ఈ కియా సెల్టోస్. మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో లభిస్తున్న ఈ హాటెస్ట్ కారు ప్రారంభ ధర రూ.9.89 లక్షలు మాత్రమే. ఇది మొత్తం 8 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అంతేకాదు, ఇందులో మూడు రకాల ఇంజన్ ఆప్షన్లు (1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ మరియు 1.4 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌) ఉంటాయి. కంపెనీ ఈ కారులో అనేక గొప్ప ఫీచర్లను కూడా అందిస్తోంది.

మార్కెట్లో రూ.15 లక్షల లోపు లభించే బెస్ట్ ఎస్‌యూవీలు

2. హ్యుందాయ్ క్రెటా - ప్రారంభ ధర రూ.9.81 లక్షలు

కియా సెల్టోస్ మాదిరిగానే, హ్యుందాయ్ క్రెటా కూడా ఈ విభాగంలో అత్యంత పాపులర్ అయిన మోడళ్లలో ఒకటి. వాస్తవానికి, సెల్టోస్ మరియు క్రెటాలు రెండూ కూడా ఒకే ప్లాట్‌ఫాంపై నిర్మించబడ్డాయి. ఇది కూడా సెల్టోస్ మాదిరిగానే 1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ మరియు 1.4 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో మొత్తం 17 వేరియంట్లు మరియు 10 కలర్ ఆప్షన్లు ఉన్నాయి. మార్కెట్లో దీని ధరలు రూ.9.81 లక్షల నుండి రూ.17.31 లక్షల మధ్యలో ఉన్నాయి.

మార్కెట్లో రూ.15 లక్షల లోపు లభించే బెస్ట్ ఎస్‌యూవీలు

3. ఎమ్‌జి హెక్టర్ - ప్రారంభ ధర రూ.12.83 లక్షలు

మోరిస్ గ్యారేజ్ మోటార్స్ (ఎమ్‌జి మోటార్స్) నుండి లభిస్తున్న పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ ఎమ్‌జి హెక్టర్. ఈ కారు మొత్తం 11 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో హైబ్రిడ్ సిస్టమ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ ఎస్‌యూవీ కూడా మూడు ఇంజన్ ఆప్షన్స్ (1.5 లీటర్ టిసిఐసి పెట్రోల్, 2.0 లీటర్ డీజిల్ మరియు 1.5 లీటర్ టిసిఐసి హైబ్రిడ్) ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కారులో, కంపెనీ 10.25 ఇంచ్ టచ్ స్క్రీన్‌తో పాటుగా అనేక ఫీచర్లను అందిస్తుంది. మార్కెట్లో ఈ ఎస్‌యూవీ ధరలు రూ.12.83 లక్షల నుంచి రూ.17.89 లక్షల మధ్యలో ఉన్నాయి.

మార్కెట్లో రూ.15 లక్షల లోపు లభించే బెస్ట్ ఎస్‌యూవీలు

4. రెనో డస్టర్ - ప్రారంభ ధర రూ.8.59 లక్షలు

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో ఇండియా నుండి దేశీయ విపణిలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలలో డస్టర్ కూడా ఒకటి. బిఎస్6 అప్‌డేట్ తరువాత, కంపెనీ ఈ కారులో డీజిల్ ఇంజన్ ఆప్షన్‌ను నిలిపివేసింది. ప్రస్తుతం ఇది పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇందులో 1.5 లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.3 లీటర్ 4-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. మార్కెట్లో ఈ కారు ధరలు రూ.8.59 లక్షల నుండి రూ.13.59 లక్షల మధ్యలో ఉన్నాయి.

మార్కెట్లో రూ.15 లక్షల లోపు లభించే బెస్ట్ ఎస్‌యూవీలు

5. మహీంద్రా ఎక్స్‌యూవీ 300 - ప్రారంభ ధర రూ.7.95 లక్షలు

మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న ఈ పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ300 మోడల్‌ను పాపులర్ ఎక్స్‌యూవీ500 మోడల్ ఆధారంగా రూపొందించారు. ఈ ఎస్‌యూవీని నాలుగు వేరియంట్లు, ఏడు కలర్ ఆప్షన్లలో విక్రయిస్తున్నారు. ఇందులో 1.2 లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. మార్కెట్లో ఈ కారు ప్రారంభ ధరలు రూ.7.95 లక్షల నుంచి రూ.10.97 లక్షల మధ్యలో ఉన్నాయి.

మార్కెట్లో రూ.15 లక్షల లోపు లభించే బెస్ట్ ఎస్‌యూవీలు

6. ఫోర్డ్ ఎకోస్పోర్ట్ - ప్రారంభ ధర రూ.8.19 లక్షలు

అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్ ఇండియా, భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎకోస్పోర్ట్, ఇది మొత్తం 14 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో రెండు ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. అవి: 1.5 లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ మరియు 1.5 లీటర్ 4-సిలిండర్ డీజిల్ ఇంజన్. ఈ కారులో 9 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటుగా అనేక ఫీచర్లు ఉన్నాయి. మార్కెట్లో ఈ కారు ధరలు రూ.8.19 లక్షల నుండి రూ.11.73 లక్షల మధ్యలో ఉన్నాయి.

మార్కెట్లో రూ.15 లక్షల లోపు లభించే బెస్ట్ ఎస్‌యూవీలు

7. టాటా నెక్సాన్ - ప్రారంభ ధర రూ.6.99 లక్షలు

టాటా మోటార్స్ అందిస్తున్న పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ నెక్సాన్, పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో పాటుగా పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్ ఆప్షన్‌తో కూడా లభిస్తోంది. ఇందులో 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్లు ఉన్నాయి. ఈ కారులో 7 ఇంచ్ ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్‌తో పాటు అనేక ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి. మార్కెట్లో ఈ కారు ధరలు రూ.6.99 లక్షలు నుంచి రూ.12.70 లక్షల మధ్యలో ఉన్నాయి.

మార్కెట్లో రూ.15 లక్షల లోపు లభించే బెస్ట్ ఎస్‌యూవీలు

గమనిక:- పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ, జులై 6, 2021వ తేదీ నాటికి. భారత మార్కెట్లో పైన పేర్కొన్న ఎస్‌యూవీలు మాత్రమే కాకుండా, మారుతి విటారా బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సొనెట్, మారుతి ఎస్-క్రాస్, మారుతి ఎక్స్ఎల్-6, టాటా హారియర్, మహీంద్రా ఎక్స్‌యూవీ500, మహీంద్రా బొలెరో మరియు మహీంద్రా స్కార్పియో వంటి మోడళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Most Read Articles

English summary
Top SUVs In India Under Rs 15 Lakhs: Kia Seltos, Hyundai Creta, MG Hector, Tata Nexon And More. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X