లగ్జరీ హోమ్‌గా మారిన Toyota Hiace MPV; వీడియో వైరల్

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీలలో ఒకటి Toyota (టయోటా). Toyota కంపెనీ దేశీయ మార్కెట్లో ఇప్పటికే చాలా వాహనాలను విడుదల చేసి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. అయితే కంపెనీ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన MPV లలో ఒకటి Toyota Hiace. Toyota ఈ MPV ని పరిమితి సంఖ్యలో మాత్రమే విక్రయించింది. ఈ కారణంగానే Toyota Hiace MPV భారతీయ రోడ్లపైన అరుదుగా కనిపిస్తుంది.

లగ్జరీ హోమ్‌గా మారిన Toyota Hiace MPV; వీడియో వైరల్

Toyota Hiace (టయోటా హియాస్) చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండి, లోపలి భాగం కూడా చాలా విశాలంగా ఉంటుంది. విశాలంగా ఉన్న కారణంగా దీనిని ఎక్కువమంది వినియోగదారులు తమకు అనుకూలంగా మాడిఫై చేసుకుంటారు. మార్కెట్లో మాడిఫైడ్ వాహనాలు ఇప్పుడు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. ఇది వరకే మనం మాడిఫైడ్ బైకులు మరియు మాడిఫైడ్ కార్లను గురించి చాలా సమాచారం తెలుసుకున్నాం.

ఇప్పుడు ఇదే తరహాలో కేరళకు చెందిన ఒక వ్యక్తి తన Toyota Hiace MPV ని ఒక చిన్న ఇల్లుగా మార్చదు. ఇందులో ఒక ఇంటిలో ఉండవలసిన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

లగ్జరీ హోమ్‌గా మారిన Toyota Hiace MPV; వీడియో వైరల్

మాడిఫైడ్ Toyota Hiace MPV లో ఒక కిచెన్, టాయిలెట్ మరియు సౌకర్యవంతమైన సీటింగ్ వంటి వివిధ స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. వీటితో పాటు ఇందులో వ్యక్తులు ఉండటానికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడ కనిపించే ఫోటోలు చూసినట్లయితే మీకు కూడా అవగతం అవుతుంది.

లగ్జరీ హోమ్‌గా మారిన Toyota Hiace MPV; వీడియో వైరల్

మాడిఫైడ్ Toyota Hiace MPV లోని ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులో మంచి సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. మీరు ఈ వీడియోలో గమనించినట్లయితే మొత్తం 7 సీట్లు ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో మొదటి రెండు సీట్లను ఎలక్ట్రిక్ బటన్లతో అడ్జస్ట్ చేయవచ్చు. అంతే కాకుండా ఇందులో యాంబియంట్ లైట్, ప్రీమియం క్వాలిటీ స్పీకర్, ఎల్ఈడీ టీవీ మరియు స్మాల్ రిఫ్రిజిరేటర్ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి.

లగ్జరీ హోమ్‌గా మారిన Toyota Hiace MPV; వీడియో వైరల్

ఇవి మాత్రమే కాకుండా ఈ మాడిఫైడ్ Toyota Hiace MPV లో కిచెన్ సింక్ మరియు గ్యాస్ స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది. ఈ వాహనంలో డ్రైవర్ రూమ్ మరియు ప్యాసింజెర్ రూమ్ రెండూ వేరు వేరుగా ఉంటాయి. అయితే, డ్రైవర్ క్యాబిన్ ముగ్గురు వ్యక్తులకు సరిపోయేలా రీడిజైన్ చేయబడింది. కావున డ్రైవర్‌లతో పాటు మరో ఇద్దరు ప్రయాణికులు ఇక్కడ కూర్చోవచ్చు.

లగ్జరీ హోమ్‌గా మారిన Toyota Hiace MPV; వీడియో వైరల్

ఈ Toyota Hiace MPV లోపలి భాగాన్ని ప్రీమియం క్వాలిటీ లుక్‌గా మార్చడానికి వుడ్ ప్యానెల్స్ ఉపయోగించబడ్డాయి. ఈ డిజైన్స్ వల్ల Toyota Hiace MPV చాలా లగ్జరీగా కనిపిస్తుంది. అంతే కాకుండా ఇంటీరియర్ ప్రీమియంను మరింత పెంచడానికి Toyota Hiace MPV వెలుపల కూడా కొన్ని మార్పులు చేయబడ్డాయి. ఇందులో కొత్త ఎల్ఈడీ ఫ్రంట్ హెడ్‌లైట్, ఆఫ్టర్‌మార్కెట్ ఎల్ఈడీ టెయిల్ లైట్, ఫ్రంట్ మరియు రియర్ బంపర్‌లు భర్తీ చేయబడ్డాయి.

లగ్జరీ హోమ్‌గా మారిన Toyota Hiace MPV; వీడియో వైరల్

ఈ మొత్తం అప్డేట్స్ వల్ల Toyota Hiace MPV ఒక కుటుంబానికి చాలా అనుకూలమైన వాహనంగా మారింది. ఈ మాడిఫైడ్ Toyota Hiace MPV OJS ఆటోమొబైల్స్ ద్వారా మాడిఫైడ్ చేయబడింది. ఇక్కడ కనిపిస్తున్న Toyota Hiace MPV 2016 మోడల్. అయితే ప్రస్తుతం కంపెనీ ఈ వాహనాన్ని మంచి డిజైన్ మరియు అప్డేటెడ్ ఫీచర్స్ తో భారతీయ మార్కెట్లో తిరిగి విడుదలచేయడానికి సన్నాహాలను సిద్ధంచేస్తోంది. Toyota కంపెనీ నుంచి విక్రయిస్తున్న ఏకైక MPV 'Toyota Innova Crysta'.

సాధారణంగా కొన్ని సంపన్న దేశాల్లో వాహనాలను లగ్జరీ హోమ్స్ గా మార్చుకోవడం సర్వ సాధారణం. అయితే భారతదేశంలో ఈ విధంగా మార్చుకోవడానికి అనుకూలమైన వాహనాలు దొరకడం చాలా అరుదు. అయినప్పటికీ వారికి నచ్చిన వాహనాలను వారికీ నచ్చిన రీతిలో మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.

లగ్జరీ హోమ్‌గా మారిన Toyota Hiace MPV; వీడియో వైరల్

భారతదేశంలో వాహన సవరణ చట్టవిరుద్ధంగా పరిగణించబడుతుంది. బహిరంగ రహదారులపై మాడిఫైడ్ వాహనాలు కనిపిస్తే, అటువంటి వాహనాలను సంబంధిత పోలీసులు లేదా రవాణా శాఖ అధికారులు స్వాధీనం చేసుకుంటారు. కొన్నిసార్లు భారీ జరిమానా విధించబడుతుంది. భారతదేశంలో, కేరళలో పెద్ద సంఖ్యలో ఇలాంటి మాడిఫైడ్ వాహనాలు తయారు చేయబడతాయి. ఇవి మోటార్ వాహన చట్టానికి వ్యతిరేఖంగా ఉంటే సంబంధిత అధికారులు వాటికి స్వాధీనం చేసుకుంటారు. ఇది వరకే మీరు దేశ వ్యాప్తంగా స్వాధీనం చేసుకున్న మాడిఫైడ్ వాహనాల గురించి తెలుసుకుని ఉంటారు. కావున వాహనం ప్రియులు అప్రమత్తంగా ఉండాలి.

Image Courtesy: Revokid Vlogs

Most Read Articles

English summary
Toyota hiace mpv modified like a motor home details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X