స్పాట్ టెస్ట్‌లో కనిపించిన కొత్త Toyota Hilux.. లాంచ్ ఎప్పుడంటే

ప్రముఖ వాహన తయారీ సంస్థ అయిన టయోటా (Toyota) దేశీయ మార్కెట్లో తన కొత్త హైలక్స్‌ను విడుదల చేయడానికి తగిన సన్నాహాలను సిద్ధం చేస్తోంది. కంపెనీ యొక్క ఈ కొత్త పికప్ ట్రక్కు గుర్గావ్‌లో జరిగిన ఒక యాడ్ షూట్‌లో కనిపించింది. ఇది 2022 జనవరి నెలలో విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఈ కొత్త పికప్ ట్రక్కు గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన కొత్త Toyota Hilux.. లాంచ్ ఎప్పుడంటే

కంపెనీ నివేదికల ప్రకారం, టయోటా తన హైలక్స్‌ను డబుల్ క్యాబ్ వేరియంట్‌లో అందించే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా కంపెనీ ఈ లైఫ్ స్టైల్ ట్రక్‌ను రెండు డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లలో తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. ఇది అనేక ఆకర్షణీయమైన ఫీచర్లతో విడుదల కానుంది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన కొత్త Toyota Hilux.. లాంచ్ ఎప్పుడంటే

టయోటా హిలక్స్‌ ఆధునిక డిజైన్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇందులో పెద్ద మరియు హెక్సాగోనల్ ఫ్రంట్ గ్రిల్ ఇవ్వబడింది. అంతే కాకుండా దీనికి రెండు వైపులా ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌లు ఇవ్వబడ్డాయి. కావున ఇది చూడటానికి చాలా దూకుడుగా కనిపిస్తుంది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన కొత్త Toyota Hilux.. లాంచ్ ఎప్పుడంటే

ఈ కొత్త పికప్ ట్రక్కు అల్లాయ్ వీల్స్‌తో పాటు వీల్ ఆర్చ్‌ల చుట్టూ ప్లాస్టిక్ క్లాడింగ్ పొందుతుంది. దీని డిజైన్ దాదాపు ఫార్చ్యూనర్ మాదిరిగానే ఉంటుంది. ఇది వర్టికల్ టెయిల్ లైట్ మరియు డబుల్ క్యాబ్ స్టైలింగ్‌ పొందుతుంది. కంపెనీ యొక్క ఫార్చ్యూనర్ మరియు ఇన్నోవాలు ఏ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడ్డాయో అదే ప్లాట్‌ఫారమ్‌పై ఈ కొత్త హైలెక్స్ ట్రక్కు కూడా నిర్మించే అవకాశం ఉంటుంది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన కొత్త Toyota Hilux.. లాంచ్ ఎప్పుడంటే

ఈ కొత్త హైలెక్స్ ట్రక్కు యొక్క ఇంటీరియర్‌ డిజైన్ ఇంకా అధికారికంగా వెలువడలేదు. కానీ ఇందులో ప్రస్తుత తరం ఫార్చ్యూనర్ బేస్డ్ బ్లాక్ థీమ్, 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, పుష్ స్టార్ట్/స్టాప్ బటన్, జేబీఎల్ సిస్టమ్ మరియు లెదర్ అపోల్స్ట్రే వంటివి ఉన్నాయి. అంతే కాకుండా ఇది క్రూయిజ్ కంట్రోల్, అడిషినల్ ఎయిర్‌బ్యాగ్‌లు మరియు పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు వంటివి కూడా పొందుతుంది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన కొత్త Toyota Hilux.. లాంచ్ ఎప్పుడంటే

కొత్త టయోటా హైలెక్స్ రెండు డీజిల్ ఇంజన్లలో విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఇందులోని 2.4-లీటర్ డీజిల్ ఇంజన్‌తో 150 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఇక రెండవ ఇంజిన్ అయిన 2.8-లీటర్ డీజిల్ విషయానికి వస్తే, ఇది 204 బిహెచ్‌పి పవర్ అందిస్తుంది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన కొత్త Toyota Hilux.. లాంచ్ ఎప్పుడంటే

కంపెనీ యొక్క 2.8-లీటర్ డీజిల్ ఇంజన్ ఇప్పటికే టయోటా ఫార్చ్యూనర్‌లో ఉపయోగపడుతోంది. ఈ ఇంజన్ ఇప్పటికే ఫార్చ్యూనర్ 4 వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో అందుబాటులో ఉంది. ఈ రెండు ఇంజన్లు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతాయి. కావున ఇవి మంచి పనితీరుని మరియు మంచి పరిధిని కూడా అందించే అవకాశం ఉంటుంది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన కొత్త Toyota Hilux.. లాంచ్ ఎప్పుడంటే

ఇదిలా ఉండగా టయోటా కంపెనీ 2022 జనవరి 1 నుండి తన వాహనాల ధరలను పెంచనుంది. ప్రస్తుతం మార్కెట్లో ముడిసరుకుతో సహా ఇతర ఇన్‌పుట్ ఖర్చులు పెరిగిన కారణంగా కంపెనీ తన వాహనాల ధరలను పెంచుతున్నట్లు తెలిపింది. కానీ వినియోగదారులపై ఎక్కువ ప్రభావం కలగకుండా చూసుకుంటామని కంపెనీ తెలిపింది. కానీ ఏ కారుమీద ఎంత ధర పెంచనున్నారో ఇంకా అధికారికంగా తెలియదు. త్వరలో తెలుస్తుంది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన కొత్త Toyota Hilux.. లాంచ్ ఎప్పుడంటే

ఇప్పటికే చాలా కంపెనీలు ఈ బాటలో ఉన్నాయి. అయితే ఇప్పుడు టయోటా ఈ జాబితాలో చేరింది. కానీ ధరల గురించి సమాచారం అందుబాటులో లేనప్పటికీ,కొత్త ధరలన్నీ కూడా రాబోయే నెలల్లో డీలర్‌షిప్‌ల వద్ద అందుబాటులో ఉంటాయి.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన కొత్త Toyota Hilux.. లాంచ్ ఎప్పుడంటే

ఆటో మొబైల్ కంపెనీలు దాదాపుగా కొత్త సంవత్సరం ప్రారంభంలో తమ వాహన ధరలను పెంచుతున్న సంగతి తెలిసిందే, ఈ సంవత్సరం కూడా ధరల పెరుగుదల జరుగుతుంది. ఈ ఏడాది ముడిసరుకు ధరలు విపరీతంగా పెరుగుతున్నందున ఆటో కంపెనీలు తమ వాహనాల ధరలను చాలాసార్లు పెంచాయి. రాబోయే రోజుల్లో వీటి ధరలు మరింత పెంచే అవకాశం ఉంటుంది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన కొత్త Toyota Hilux.. లాంచ్ ఎప్పుడంటే

ప్రస్తుతం భారతీయ మార్కెట్లో సాధారణ కార్లకంటే కూడా పికప్ ట్రక్కులకు ఆదరణ పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని టయోటా కంపెనీ తన హైలెక్స్ లైఫ్ స్టైల్ పికప్ ట్రక్కును ఇండియన్ మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ కొత్త పికప్ ట్రక్కు యొక్క బుకింగ్స్ త్వరలో ప్రారంభమవవుతాయి. ఏది ఏమైనా ఇది వచ్చే సంవత్సరం భారతీయ మార్కెట్లో అడుగుపెడుతుంది. దేశీయ మార్కెట్లో విడుదలైన తరువాత ఎలాంటి ఆదరణ పొందుతుందో కూడా త్వరగానే తెలుస్తుంది.

Most Read Articles

Read more on: #టయోటా #toyota
English summary
Toyota hilux spotted during tvc shoot details
Story first published: Tuesday, December 21, 2021, 13:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X