Toyota నుండి 16 ఎలక్ట్రిక్ వాహనాలు.. వీటిలో భారతదేశానికి ఎన్ని వస్తున్నాయ్..?

రానున్న సంవత్సరాల్లో రోడ్లపై పెట్రోల్, డీజిల్ కార్లు పూర్తిగా కనుమరుగు కానున్నాయా..? భవిష్యత్తు మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల (EV) పైనే ఆధారపడనుందా..? తాజా పరిణామాలు చూస్తుంటే ఇదంతా నిజమే అనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే, అనేక ఆటోమొబైల్ కంపెనీలు తమ పెట్రోల్, డీజిల్ వాహనాలతో పాటుగా ఇప్పటి నుండే ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధి చేయడం మరియు వాటిని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావటం చేస్తున్నాయి.

Toyota నుండి 16 ఎలక్ట్రిక్ వాహనాలు.. వీటిలో భారతదేశానికి ఎన్ని వస్తున్నాయ్..?

తాజాగా, ప్రపంచంలోని అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీలలో ఒకటైన, జపాన్‌కి చెందిన టొయోటా మోటార్ కార్పొరేషన్ (Toyota Motor Corporation) ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో తమ ప్రణాళికను వెల్లడించింది. విద్యుదీకరణ (ఎలక్ట్రిఫికేషన్) మరియు బ్యాటరీ ఈవీ వ్యూహాల గురించి మీడియాకు తెలియజేసింది. బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణకు ప్రాధాన్యతనిస్తూ కార్బన్-న్యూట్రాలిటీని సాధించడానికి ఈ జపనీస్ ఆటోమేకర్ యొక్క వ్యూహాన్ని టొయోటా మోటార్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ అకియో టయోడా వెల్లడి చేశారు.

Toyota నుండి 16 ఎలక్ట్రిక్ వాహనాలు.. వీటిలో భారతదేశానికి ఎన్ని వస్తున్నాయ్..?

ఈ సందర్భంగా టయోడా మాట్లాడుతూ.. "కార్బన్ న్యూట్రాలిటీని సాధించడం అంటే ఈ గ్రహం మీద ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించగలిగే ప్రపంచాన్ని గ్రహించడం అని నేను నమ్ముతున్నాను. ఆ సవాలుకు తగినట్లుగా మేము వీలైనంత త్వరగా CO2 ఉద్గారాలను తగ్గించాలి, ఇది జరుగుతుంది." అని చెప్పారు. రానున్న రోజుల్లో టొయోటా 16 ఎలక్ట్రిక్ వాహనాలను వివిధ ప్రపంచ మార్కెట్లలో విడుదల చేయనుంది.

Toyota నుండి 16 ఎలక్ట్రిక్ వాహనాలు.. వీటిలో భారతదేశానికి ఎన్ని వస్తున్నాయ్..?

కంపెనీ ఇటీవల ఆవిష్కరించిన సరికొత్త ఎలక్ట్రిక్ కారు టొయోటా బిజెడ్4ఎక్స్ (Toyota bZ4X)ను త్వరలోనే అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేసేందుకు టొయోటా ప్లాన్ చేస్తోంది. కాగా, కంపెనీ ఇప్పుడు తమ bZ లైనప్ సిరీస్‌ను మరింత విస్తరించాలని చూస్తోంది. బ్యాటరీ ఈవీల కోసం టొయోటా కొత్త యుగం అని పిలుస్తున్న పదునైన సిల్హౌట్‌తో కంపెనీ ఓ మిడ్-సైజ్ ఎస్‌యూవీని ప్రదర్శించింది. ఈ శ్రేణిలో ఒక కాంపాక్ట్ ఎస్‌యూవీ కూడా ఉంది, ఇది యూరప్ మరియు జపాన్‌లకు అనుగుణంగా డిజైన్ చేయబడిన ఒక చిన్న బ్యాటరీ మరియు సౌకర్యవంతమైన ఇంటీరియర్‌తో కూడిన కాంపాక్ట్ ఎస్‌యూవీ.

Toyota నుండి 16 ఎలక్ట్రిక్ వాహనాలు.. వీటిలో భారతదేశానికి ఎన్ని వస్తున్నాయ్..?

టొయోటా మోటార్ ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ లైన్ కోసం కిలోమీటరుకు 125 వాట్-గంటల విద్యుత్ వినియోగాన్ని లక్ష్యంగా పెట్టుకుంది, ఇది విభాగంలో అత్యధికంగా మారే అవకాశం కూడా ఉంది. వీటితో పాటుగా కంపెనీ ఆల్-ఎలక్ట్రిక్ మిడ్-సైజ్ సెడాన్ మరియు మూడు వరుస సీట్లతో కూడిన ఓ పెద్ద ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కూడా ప్లాన్ చేస్తుంది. టొయోటా మోటార్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ టయోడా మాట్లాడుతూ, "ఆటోమేకర్ ఇప్పటికే ఉన్న వాహన మోడళ్లకు బ్యాటరీ ఈవీ ఎంపికలను జోడించడమే కాకుండా, అన్ని రకాల కస్టమర్ల అవసరాలను తీర్చడానికి bZ సిరీస్ వంటి సరసమైన మాస్-ప్రొడక్షన్ మోడళ్ల యొక్క పూర్తి లైనప్‌ను కూడా తీసుకువస్తుంది." అని అన్నారు.

Toyota నుండి 16 ఎలక్ట్రిక్ వాహనాలు.. వీటిలో భారతదేశానికి ఎన్ని వస్తున్నాయ్..?

టొయోటాకు చెందిన లగ్జరీ కార్ బ్రాండ్ లెక్సస్ లో కూడా బ్యాటరీ ఈవీ ఆప్షన్లను అందించడం ద్వారా కార్బన్-న్యూట్రల్ వాహనాల ఎంపికలను విస్తరించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. వచ్చే 2030 నాటికి 30 బ్యాటరీ ఈవీ మోడళ్లను విడుదల చేయడానికి తాము ప్లాన్ చేస్తున్నామని, ప్రపంచవ్యాప్తంగా ప్రయాణీకులు మరియు వాణిజ్య రంగాలకు కూడా బ్యాటరీ ఈవీ పూర్తి లైనప్‌ను అందించాలని యోచిస్తున్నామని టొయోడా చెప్పారు.

Toyota నుండి 16 ఎలక్ట్రిక్ వాహనాలు.. వీటిలో భారతదేశానికి ఎన్ని వస్తున్నాయ్..?

Toyota bZ4X గురించి క్లుప్తంగా..

టొయోటా ఆవిష్కరించిన టొయోటా బిజీ4ఎక్స్ (Toyota bZ4X) విషయానికి వస్తే, ఇది ఈ జపనీస్ బ్రాండ్ యొక్క మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. ప్రత్యేకించి ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం కంపెనీ సిద్ధం చేస్తున్న bZ సిరీస్‌లో bZ4X అనేది మొదటి మోడల్. సమీప భవిష్యత్తులో కంపెనీ ఈ సిరీస్ ఆధారంగా అనేక కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయనుంది. ఈ పేరులో bZ అంటే అర్థం 'బియాండ్ జీరో' (beyond Zero) (జీరోకి మించి అని అర్థం). అంటే, ఇది కార్బన్ న్యూట్రాలిటీ విషయంలో టొయోటా యొక్క విధానాన్ని ప్రతిబింబింపజేస్తుంది.

Toyota నుండి 16 ఎలక్ట్రిక్ వాహనాలు.. వీటిలో భారతదేశానికి ఎన్ని వస్తున్నాయ్..?

సుబారు కార్పొరేషన్ సహకారంతో టొయోటా తన bZ4X కోసం EV ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసింది. ఆఫ్-రోడ్ పనితీరు సామర్థ్యాలతో కూడిన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని సన్నద్ధం చేసే లక్ష్యంతో ఇరు కంపెనీలు ఈ ప్లాట్‌ఫామ్ ను అభివృద్ధి చేశాయి. చాలా ఏళ్ల పాటు సురక్షితంగా మరియు సులభంగా నడపగలిగే బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ (బీఈవీ)ని తయారు చేయాలనుకుంటున్నట్లు టొయోటా తెలిపింది. ముఖ్యంగా శీతాకాలపు సమయాల్లో క్రూజింగ్ రేంజ్‌ని సాధించడం మరియు టాప్-క్లాస్ బ్యాటరీ సామర్థ్యం నిలుపుదల నిష్పత్తిని అందించడమే తమ లక్ష్యమని కంపెనీ తెలిపింది.

Toyota నుండి 16 ఎలక్ట్రిక్ వాహనాలు.. వీటిలో భారతదేశానికి ఎన్ని వస్తున్నాయ్..?

టొయోటా bZ4X EV లో 71.4 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది మరియు ఈ బ్యాటరీ ప్యాక్ పూర్తి చార్జ్ పై ఫ్రంట్-వీల్-డ్రైవ్ వెర్షన్‌తో 500 కి.మీ రేంజ్ ను మరియు ఆల్-వీల్-డ్రైవ్ వెర్షన్‌తో దాదాపు 460 కి.మీ రేంజ్ ను ఆఫర్ చేస్తుందని టొయోటా పేర్కొంది. కాగా, టొయోటా bZ4X ఫ్రంట్-వీల్-డ్రైవ్ వెర్షన్ కేవలం ఒకే 150 kW మోటార్‌ ను కలిగి ఉంటుంది. అయితే, ఆల్-వీల్-డ్రైవ్ వెర్షన్ bZ4X మోడల్ లో మాత్రం ప్రతి యాక్సిల్‌ పై అమర్చబడిన రెండు 80 kW మోటార్‌లు ఉంటాయి. ఇందులోని బ్యాటరీని ప్యాక్ ను 150 kW డైరెక్ట్ కరెంట్ (డిసి) చార్జర్ సాయంతో కేవలం 30 నిమిషాల్లోనే 80 శాతానికి సరిపడా ఛార్జ్ చేసుకోవచ్చు.

Most Read Articles

English summary
Toyota motor corporation plans to launch 16 electric vehicles in coiming years details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X