ఢిల్లీ రోడ్లపై టొయోటా ఆర్ఏవి4 టెస్టింగ్; ఈ ఏడాదే భారత్‌లో లాంచ్!

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ బ్రాండ్నీస్ టొయోటా, అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్న తమ పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ ఆర్ఏవి4 (RAV4)ను ఈ ఏడాది భారత మార్కెట్లో విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

ఢిల్లీ రోడ్లపై టొయోటా ఆర్ఏవి4 టెస్టింగ్; ఈ ఏడాదే భారత్‌లో లాంచ్!

టొయోటా కిర్లోస్కర్ మోటార్ కంపెనీ ఇప్పటికే ఈ కొత్త ఆర్ఏవి4 ఎస్‌యూవీని భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. తాజాగా ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో ఈ కారును పరీక్షిస్తుండగా కెమెరాకు చిక్కింది. టొయోటా ఆర్ఏవి4 ఎస్‌యూవీని కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (సియుబి) రూట్‌లో పూర్తిగా విదేశాల్లో తయారు చేసి, భారత్‌కు దిగుమతి చేసుకొని విక్రయించే అవకాశం ఉంది.

ఢిల్లీ రోడ్లపై టొయోటా ఆర్ఏవి4 టెస్టింగ్; ఈ ఏడాదే భారత్‌లో లాంచ్!

భారత్‌లో టొయోటా ఆర్ఏవి4 హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్‌తో రావచ్చని సమాచారం. టొయోటా ఇండియా ఈ ఎస్‌యూవీని దేశీయ కస్టమర్లకు పరిచయం చేయాలని గతేడాదే నిర్ణయించుకుంది. భారతదేశంలోని కొత్త దిగుమతి నియమాలను ఉపయోగించుకొని కంపెనీ ఈ కారును పరిమిత సంఖ్యలో ఇక్కడికి దిగుమతి చేసుకోనుంది.

MOST READ:కదిలే కారుపై షాకింగ్ స్టంట్స్ చేసిన పొలిటికల్ లీడర్ కొడుకుపై చర్యలు తీసుకున్న పోలీసులు

ఢిల్లీ రోడ్లపై టొయోటా ఆర్ఏవి4 టెస్టింగ్; ఈ ఏడాదే భారత్‌లో లాంచ్!

టొయోటా భారత రోడ్లపై హైబ్రిడ్ వెర్షన్ ఆర్ఏవి4 మోడల్‌ను టెస్ట్ చేస్తోంది. ఈ స్పై చిత్రాలలో ముందు చక్రం వీల్ ఆర్చ్‌కి పై భాగంలో హైబ్రిడ్ బ్యాడ్జ్‌ను గమనించవచ్చు. ఈ మోడల్‌ను కంపెనీ ఎలాంటి క్యామోఫ్లేజ్ లేకుండా టెస్ట్ చేయటాన్ని చూస్తుంటే, దీని డిజైన్ పూర్తిగా విదేశాల్లో లభించే మోడల్ మాదిరిగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీ రోడ్లపై టొయోటా ఆర్ఏవి4 టెస్టింగ్; ఈ ఏడాదే భారత్‌లో లాంచ్!

ఈ కారులో ఆఫర్ చేయబోయే 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను స్పై చిత్రాలలో చూడవచ్చు. అల్లాయ్ వీల్స్, కారు చుట్టూ బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, వండో లైనర్ చుట్టూ క్రోమ్ గార్నిష్, సైడ్ మిర్రర్లపై టర్న్ ఇండికేటర్స్, రియర్ స్పాయిలస్, ఆల్ డిస్క్ బ్రేక్స్, వెనుక భాగంలో రైజ్డ్ రియర్ బంపర్ వంటి డిజైన్ ఫీచర్లను ఇందులో గమనించవచ్చు.

MOST READ:ఈ బుజ్జి కారుకి 4 రోజుల్లో రూ.7.5 కోట్ల ఆర్డర్లు; ఇది ఎక్కడో కాదు మనదేశంలోనే..!

ఢిల్లీ రోడ్లపై టొయోటా ఆర్ఏవి4 టెస్టింగ్; ఈ ఏడాదే భారత్‌లో లాంచ్!

కారు వెనుక భాగంలో బ్లాక్ ప్లాస్టిక్ బంపర్ మరియు దానిపై సిల్వర్ స్కఫ్ ప్లేట్, స్ప్లిట్ టెయిల్ ల్యాంప్ డిజైన్, బూట్ డోర్‌పై క్రోమ్ గార్నిష్, పైభాగంలో షార్క్ ఫిన్ యాంటెన్నా మరియు బాడీని అంటుకుని ఉన్నట్లుగా ఉండే రూఫ్ ట్రాక్స్, డ్యూయెల్ ఎగ్జాస్ట్ పైప్స్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి.

ఢిల్లీ రోడ్లపై టొయోటా ఆర్ఏవి4 టెస్టింగ్; ఈ ఏడాదే భారత్‌లో లాంచ్!

ఇంటర్నేషనల్ వెర్షన్ టొయోటా ఆర్ఏవి4 'టొయోటా సేఫ్టీ సెన్స్ 2.0' ఫీచర్‌తో లభిస్తుంది. ఇందులో పాదచారుల గుర్తింపు (మరియు ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్)తో కొల్లైజన్ అవైడెన్స్ సిస్టమ్, డైనమిక్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, ఆటోమేటిక్ హై బీమ్ మరియు రోడ్ సైన్ డిటెక్షన్ వంటి సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇంకా ఇందులో పార్కింగ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ మరియు ఎనిమిది ఎయిర్‌బ్యాగులు వంటి ఇతర సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

MOST READ:సుజుకి హయాబుసా సూపర్‌బైక్‌పై ట్రాఫిక్ పోలీస్ [వీడియో]

ఢిల్లీ రోడ్లపై టొయోటా ఆర్ఏవి4 టెస్టింగ్; ఈ ఏడాదే భారత్‌లో లాంచ్!

టొయోటా ఆర్ఏవి4 ఎస్‌యూవీలో ఆప్షనల్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన 2.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ కూడా ఉంటుంది. భారత మార్కెట్లోకి కంపెనీ తమ హైబ్రిడ్-పెట్రోల్ ఇంజన్‌ను తీసుకువస్తుందని అంచనా. ఈ 2.5-లీటర్ డిఓహెచ్‌సి ఇంజన్ ఎలక్ట్రిక్ మోటారుతో జతచేయబడి ఉంటుంది. ఇది లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది.

ఢిల్లీ రోడ్లపై టొయోటా ఆర్ఏవి4 టెస్టింగ్; ఈ ఏడాదే భారత్‌లో లాంచ్!

హైబ్రిడ్-పెట్రోల్ ఇంజన్లు రెండూ కలిసి ఎఫ్‌డబ్ల్యూడి (ఫ్రంట్ వీల్ డ్రైవ్) వేరియంట్‌లో 215 బిహెచ్‌పిల శక్తిని మరియు ఏడబ్ల్యూడి (ఆల్ వీల్ డ్రైవ్) వేరియంట్‌లో 221 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఈ ఇంజన్లు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జతచేయబడి ఉంటాయి.

MOST READ:ఈ జట్కా బండ్లకు గుర్రాలు అక్కర్లేదు; వీటిపై సామాన్యులు కూడా సెలబ్రిటీల్లా తిరగొచ్చు!

ఢిల్లీ రోడ్లపై టొయోటా ఆర్ఏవి4 టెస్టింగ్; ఈ ఏడాదే భారత్‌లో లాంచ్!

భారతదేశంలో టొయోటా తమ ఎఫ్‌డబ్ల్యుడి (ఫ్రంట్ వీల్ డ్రైవ్) వెర్షన్ ఆర్ఏవి4 మోడల్‌ను మాత్రమే ప్రవేశపెడుతుందని అంచనా. సిబియూ రూట్‌లో ఈ మోడల్‌ను విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్న కారణంగా, మార్కెట్లో దీని ధర కూడా చాలా ఎక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది. మరిన్ని లేటెస్ట్ ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

Photo Source: GaadiWaadi

Most Read Articles

English summary
Toyota RAV4 Spied Again On Indian Streets; Launch Expected This Year. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X