మీకు తెలుసా.. 2022 లో విడుదల కానున్న కొత్త కార్లు

భారతీయ మార్కెట్లో 2021 వ సంవత్సరంలో ఆటో మొబైల్ పరిశ్రమ నుంచి చాలా కొత్త మోడల్స్ విడుదలయ్యి మంచి ఆదరణ పొందాయి. అయితే రానున్న కొత్త సంవత్సరం 2022 లో కూడా అనేక ఆధునిక మోడల్స్ లాంచ్ కానున్నాయి. దేశీయ మార్కెట్లో వచ్చే సంవత్సరం కియా కారెన్స్, మారుతి బ్రెజ్జా, స్కోడా స్లావియా మరియు సిట్రోయెన్ సి3 మోడల్స్ విడుదల కానున్నాయి. ఈ కొత్త కార్లను గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

మీకు తెలుసా.. 2022 లో విడుదల కానున్న కొత్త కార్లు

కియా కారెన్స్ (Kia Carens):

దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ అయిన కియా మోటార్స్ దేశీయ మార్కెట్లో తన నాల్గవ మోడల్ అయిన కియా కారెన్స్ MPV ని ఇటీవల ఆవిష్కరించింది. కొత్త Kia Carens రానున్న కొత్త సంవత్సరం అంటే 2022 మొదటి త్రైమాసికంలో ఫిబ్రవరి లేదా మార్చిలో భారతీయ మార్కెట్లో అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంటుంది.

మీకు తెలుసా.. 2022 లో విడుదల కానున్న కొత్త కార్లు

ఇది 6 మరియు 7 సీటింగ్ కాన్ఫిగరేషన్‌లతో మార్కెట్లో విడుదల కానుంది. ఈ కొత్త MPV ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. Kia కంపెనీ తన కొత్త Carens MPV లో తన సెల్టోస్ మాదిరిగానే మూడు ఇంజన్ ఎంపికలను అందిస్తోంది. ఇందులోని 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ 115 బిహెచ్‌పి పవర్ మరియు 144 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

మీకు తెలుసా.. 2022 లో విడుదల కానున్న కొత్త కార్లు

ఇక 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్, 140 బిహెచ్‌పి పవర్ మరియు 242 ఎన్ఎమ్ టార్క్ మరియు 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇక మూడవది 1.5-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇది 115 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

మీకు తెలుసా.. 2022 లో విడుదల కానున్న కొత్త కార్లు

స్కోడా స్లావియా (Skoda Slavia):

స్కోడా కంపెనీ దేశీయ మార్కెట్లో తన మిడ్-సైజ్ ప్రీమియం సెడాన్ స్కోడా స్లావియాను 2021 నవంబర్ 18న భారత మార్కెట్‌కు పరిచయం చేసింది. ఈ కారును ప్రవేశపెట్టిన వెంటనే కంపెనీ బుకింగ్ ప్రారంభించింది. స్కోడా ఆటో ఇండియా ఈ కొత్త సెడాన్‌ను వచ్చే ఏడాది మార్చి నాటికి మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంటుంది.

మీకు తెలుసా.. 2022 లో విడుదల కానున్న కొత్త కార్లు

కంపెనీ యొక్క ఈ కొత్త స్కోడా స్లావియా రెండు ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. ఇందులో ఒకటి 1.0-లీటర్ టిఎస్ఐ 3 సిలిండర్ కాగా, మరొకటి 1.5-లీటర్ టిఎస్ఐ 4 సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్. ఇందులోని 1.0-లీటర్ టిఎస్ఐ 3-సిలిండర్ ఇంజన్ 115 బిహెచ్‌పి పవర్ మరియు 178 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్‌తో అందించబడుతుంది. ఇక 1.5-లీటర్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.

మీకు తెలుసా.. 2022 లో విడుదల కానున్న కొత్త కార్లు

మారుతి విటారా బ్రెజ్జా (Maruti Vitara Brezza):

ప్రముఖ వాహన తయారీ సంస్థ అయినా మారుతి సుజుకి తన కొత్త బ్రేజ్జాను 2022 ప్రారంభంలో ప్రారంభించే అవకాశం ఉంది. ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఈ కొత్త మోడల్ ఇప్పటికే అనేకసార్లు టెస్ట్ చేయబడింది.

మీకు తెలుసా.. 2022 లో విడుదల కానున్న కొత్త కార్లు

దేశీయ విఫణిలోకి ఈ కొత్త 2022 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా లాంచ్ అయిన తర్వాత ఒక ఉన్నతమైన కాంపాక్ట్ SUV అవుతుంది, ఎందుకంటే ఇది ఇటీవలే కొత్త ప్రీమియం ఫీచర్లతో గుర్తించబడింది. ఈ ఫీచర్లు మారుతి సుజుకి యొక్క ఏ కారులోనూ లేకపోవడం గమనార్హం.

మారుతి ఈ కొత్త కారు యొక్క ఎక్స్టీరియర్ డిజైన్ మాత్రమే కాకుండా ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా అప్డేట్ చేయడం జరిగింది. ఇందులో కొత్త డ్యాష్‌బోర్డ్ మరియు క్యాబిన్ లేఅవుట్ చుట్టూ హై క్వాలిటీ ప్లాస్టిక్‌ని ఉపయోగించి దాని క్యాబిన్‌కు అనేక ఫీచర్లను జోడిస్తుంది. అయితే, దీని ఇంజన్‌లో ఎలాంటి మార్పులు జరగవు. కొత్త మారుతి విటారా బ్రెజ్జా ప్రస్తుత 1.5-లీటర్, 4-సిలిండర్ పెట్రోల్‌తో, మారుతి సుజుకి మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది.

మీకు తెలుసా.. 2022 లో విడుదల కానున్న కొత్త కార్లు

సిట్రోయెన్ సి3 (Citroen C3):

ప్రముఖ ప్రెంచ్ కార్ తయారీ సంస్థ సిట్రోయెన్ (Citroen) భారతీయ మార్కెట్లో సిట్రోయెన్ సి3 (Citroen C3) ని విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇది 2022 లో విడుదలయ్యే అవకాశం ఉంటుంది. దేశీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త సిట్రోయెన్ సి3 (Citroen C3) కంపెనీ యొక్క తదుపరి మోడల్ కానుంది. ఈ చిన్న మరియు ఆధునిక SUV 2022 ప్రథమార్ధంలో విడుదల కానుంది. అంతే కాకుండా కంపెనీ డిజిటల్ కస్టమర్ సర్వీస్ కూడా అందిస్తుంది.

మీకు తెలుసా.. 2022 లో విడుదల కానున్న కొత్త కార్లు

సిట్రోయెన్ కంపెనీ తన కొత్త సి3 కారు యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్స్ గురించి అధికారిక సమాచారం అందివ్వలేదు. కానీ ఈ SUV ని 1.2-లీటర్ టర్బో-ఛార్జ్డ్ ఇంజన్‌తో అందించే అవకాశం ఉంటుంది. కావున ఈ ఇంజిన్ 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 108 బిహెచ్‌పి పవర్ మరియు 1,500 ఆర్‌పిఎమ్ వద్ద 205 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది.

మీకు తెలుసా.. 2022 లో విడుదల కానున్న కొత్త కార్లు

2022 లో విడుదల కావడానికి కేవలం పైన చెప్పిన కార్లు మాత్రమే కాకుండా అనేక కార్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ కార్లన్నీ కూడా మార్కెట్లో ఎలాంటి ఆదరణ పొందుతాయి అనే విషయమే తెలియాలి. కొత్త సంవత్సరంలో కొత్త కార్లను కొనాలనుకునే వారి ఇవి తప్పకుండా మంచి ఎంపిక అవుతాయి. అందులో ఎటువంటి సందేహం లేదు.

Most Read Articles

English summary
Upcoming car launches skoda slavia new brezza citroen c3 kia carens details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X