కొత్త బస్సులను విడుదల చేసిన VECV: ఈ బస్సులు చాలా సూపర్ గురూ..!!

భారతీయ మార్కెట్లో రోజురోజుకి కొత్త వాహనాలు విడుదలవుతున్నాయి. ఈ క్రమంలో భాగంగానే Volvo - Eicher Commercial Vehicles (VECV) కొత్త కోచ్ మరియు స్లీపర్ బస్సులను అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త మరియు ఆధునిక బస్సులు కస్టమర్ అవసరాలకు అనుకూలంగా అనుకూలీకరించుకోవచ్చు. ఈ కొత్త బస్సుల గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

కొత్త బస్సులను విడుదల చేసిన VECV: ఈ బస్సులు చాలా సూపర్ గురూ..!!

'వోల్వో - ఐషర్ కమర్షియల్ వెహికల్స్' ఈ కొత్త బస్సులను బెంగుళూరు హోస్కోటేలోని వోల్వో బస్ ప్రొడక్షన్ ప్లాంట్‌లో ప్రస్తుతం ఉన్న 12.4 మీటర్స్ ఐషర్ చాసిస్ ఉపయోగించి తయారు చేయబడతాయి. ఈ కొత్త బస్ సిరీస్ దేశంలో బస్సు ప్రయాణానికి ఒక కొత్త ప్రమాణాన్ని నిర్దేశిస్తుందని VECV తెలిపింది.

కొత్త బస్సులను విడుదల చేసిన VECV: ఈ బస్సులు చాలా సూపర్ గురూ..!!

ఈ బస్సులను ప్రారంభించిన తర్వాత VECV బస్ డివిజన్ ఛైర్మన్ ఆకాష్ పసిర్ మాట్లాడుతూ, "అన్ని మార్కెట్ విభాగాలలో పూర్తిగా మార్కెట్ చేయగల ఆర్థిక వ్యవస్థ, మిడ్ ప్రీమియం మరియు ప్రీమియం బస్సులను అందించడానికి మా డ్రైవ్‌లో ఇది మొదటి మైలురాయి. నేషనల్ లైసెన్స్ జారీ చేసిన తరువాత, నిర్వాహకులు ఎక్కువ దూరాలను ప్రయాణించడానికి నాణ్యమైన బస్సులను పొందాలని అనుకుంటారు. కావున ఇటువంటి వారికీ ఈ బస్సులు ఖచ్చితమైన ఎంపిక అవుతుంది.

కొత్త బస్సులను విడుదల చేసిన VECV: ఈ బస్సులు చాలా సూపర్ గురూ..!!

ప్రస్తుతం చాలామంది ప్రజలు మంచి లగ్జరీ అనుభవాన్ని కోరుకుంటారు. కావున వారు ఆధునిక ఫీచర్స్ ఉన్న వాహనాలను కోరుకుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతే కాకుండా వేగంగా పెరుగుతున్న మార్కెట్ అవసరాలకు కొత్త ఉత్పత్తులే సరైన సమాధానం.

కొత్త బస్సులను విడుదల చేసిన VECV: ఈ బస్సులు చాలా సూపర్ గురూ..!!

కంపెనీ పూర్తిగా అత్యాధునికంగా నిర్మించిన కోచ్ మరియు స్లీపర్ బస్‌లు ఇప్పుడు ట్రైన్ మరియు విమాన ప్రయాణాలకు సమానంగా అందుబాటులోకి వస్తాయని విశ్వసిస్తున్నాము. VECV ఈ కొత్త బస్సులతో మిడ్ ప్రీమియం విభాగాన్ని కూడా ఆవిష్కరించాలని చూస్తోంది. VECV బస్ మార్కెట్‌లో ఈ సెగ్మెంట్ వైట్ స్పేస్‌ని పరిగణిస్తుంది.

కొత్త బస్సులను విడుదల చేసిన VECV: ఈ బస్సులు చాలా సూపర్ గురూ..!!

దీని గురించి VECV యొక్క MD మరియు CEO వినోద్ అగర్వాల్ మాట్లాడుతూ, ఒక సంవత్సరం క్రితం మేము భారతీయ బస్సు పరిశ్రమ వృద్ధిని రూపొందించాలనే స్పష్టమైన లక్ష్యంతో VECV లో ఒక బస్సు డివిజన్‌ను రూపొందించామని వారు అన్నారు. అయితే ఎట్టకేలకు ఈ రోజు కొత్త సిరీస్‌ని విడుదల చేస్తున్నందుకు గర్వపడుతున్నాను.

కొత్త బస్సులను విడుదల చేసిన VECV: ఈ బస్సులు చాలా సూపర్ గురూ..!!

ఐషర్ కంపెనీ స్థానిక ఉనికిని చాటే ప్రీమియం బస్సులను ఒక ప్రత్యేకమైన ఫీచర్స్ తో వోల్వో బస్సులను తయారు చేస్తాయి. ఈ బస్సులు నిజంగా రెండు ప్రపంచాలలో ఉత్తమమైన అనుభూతిని అందిస్తాయి. బస్ మార్కెట్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది, ఇదే సమయంలో కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గిన క్రమంలో పాఠశాలలు ప్రారంభమవుతున్నాయి. కావున పాఠశాలలకు అవసరమైన బస్సులను కూడా కంపెనీ అందించనుంది. అంతే కాకుండా ఆఫీసులకు అవసరమైన బస్సులు కూడా కంపెనీ అందిస్తుంది.

కొత్త బస్సులను విడుదల చేసిన VECV: ఈ బస్సులు చాలా సూపర్ గురూ..!!

భారతదేశంలో కరోనా మహమ్మారి చాలా తగ్గుముఖం పట్టిన కారణంగా ప్రజలు ప్రజా రవాణా చేయడానికి కూడా ఆసక్తి చూపుతున్నారు. కరోనా మహమ్మారి వల్ల, గత రెండేళ్లలో కొనుగోలు చేయకపోవడంతో, బస్సుల పరిమాణంలో పెరుగుదల ఉంటుందని మేము ఆశిస్తున్నామని ఆయన చెప్పారు.

కొత్త బస్సులను విడుదల చేసిన VECV: ఈ బస్సులు చాలా సూపర్ గురూ..!!

ఈ కొత్త బస్సులు ఐషర్ యొక్క 12.4 మీటర్స్ చాసిస్ మీద నిర్మించబడతాయి. ఇవి వోల్వో యొక్క 5.1 లీటర్ VEDX5 ఇంజిన్ ద్వారా శక్తిని పొందుతాయి. ఈ ఇంజిన్ ఇంజిన్ 2,100 బిహెచ్‌పి పవర్ మరియు 1200 ఆర్‌పిఎమ్ వద్ద 825 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజిన్ బెస్ట్ ఇన్ క్లాస్ కంటే మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది.

కొత్త బస్సులను విడుదల చేసిన VECV: ఈ బస్సులు చాలా సూపర్ గురూ..!!

ఈ బస్సులు ఎయిర్ కండిషన్డ్ 43 సీట్ల వెర్షన్‌తో 11,300 లీటర్ లగేజ్ స్పేస్‌ని కలిగి ఉంటాయి. కొత్త VCEV బస్సు యొక్క స్లీపర్ వెర్షన్‌లో 30 బెర్తులు ఉన్నాయి. ఇందులో అధిక భద్రత కోసం బెర్త్‌లు హై-రైజ్ పార్టిషన్‌లు ఇవ్వబడ్డాయి. క్రూయిజ్ కంట్రోల్, ఫ్యూయల్ కోచింగ్, ఎంబౌస్టర్ ప్లస్, ఇంటెలిజెంట్ ఇంజిన్ ప్రొటెక్షన్ సిస్టమ్స్ వంటి ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.

ఈ బస్సులలో ఎల్ఈడీ యాంబియంట్ లైటింగ్, రీడింగ్ లైట్లు మరియు USB పోర్ట్ వంటివి కూడా అంద్దుబాటులో ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా డ్రైవర్ కి చాలా అనుకూలంగా కూడా ఉంటాయి. ఈ బస్సుల్లో ఉపయోగించే మెటీరియల్స్ అగ్నిమాపక సిబ్బందిచే ధృవీకరించబడి ఉంటుంది.

కొత్త బస్సులను విడుదల చేసిన VECV: ఈ బస్సులు చాలా సూపర్ గురూ..!!

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

VECV ప్రారంభించిన కోచ్ మరియు స్లీపర్ బస్‌లు భారతదేశంలో పూర్తిగా కొత్త శకానికి నాంది పలుకుతాయి. ఈ కొత్త బస్సులు ఇంటర్‌సిటీ బస్సు విభాగంలో ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పాఠశాల కళాశాలలు దాదాపు ఏడాదిన్నర పాటు మూతపడ్డాయి. అదనంగా, IT కంపెనీలు తమ సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంపికను అందిస్తున్నాయి. ఇప్పుడు పాఠశాల కళాశాలలు మరియు IT కంపెనీలు నెమ్మదిగా ప్రారంభమవుతున్నాయి, కావున ఈ బస్సులకు రాబోయే రోజుల్లో మంచి డిమాండ్ ఉంటుందని భావిస్తున్నాము.

Most Read Articles

English summary
Vecv launches new coach and sleeper buses in domestic market video details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X