Tesla కార్లలో ఫన్నీ వీడియో గేమ్స్.. ప్రయాణీకుల భద్రతతో డెత్ గేమ్స్..

ఎలోన్ మస్క్ ఆధ్వర్యంలోని ఎలక్ట్రిక్ కార్ కంపెనీ 'టెస్లా' (Tesla) అతి తక్కువ సమయంలోనే ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసినదే. ఇందుకు ప్రధాన కారణం, సదరు కారు యొక్క బ్యాటరీ రేంజ్, డిజైన్ మరియు అధునాతన సాంకేతిక ఫీచర్లు. అన్నింటికీ మించి ఆ కారులో ఉండే సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ. అయితే, కస్టమర్లు ఈ టెస్లా కార్లలోని అటానమస్ (ఆటోమేటిక్) డ్రైవింగ్ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారంటూ ఇప్పటికే ఈ కంపెనీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Tesla కార్లలో ఫన్నీ వీడియో గేమ్స్.. ప్రయాణీకుల భద్రతతో డెత్ గేమ్స్..

ఈ అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీని ఉపయోగించి చాలా మంది కార్లలో నిద్రపోవడం లేదా నిర్లక్ష్యంగా వ్యవహరించడం లేదా కార్లలో మొబైల్ ఫోన్స్ వంటి గ్యాడ్జెట్లను ఉపయోగించడం చేస్తున్నారు. తాజాగా, ఇప్పుడు టెస్లా సెంటర్ కన్సోల్ లో ఉండే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లో వీడియో గేమ్స్ ఆడుతూ తమ ప్రాణాలతోనే కాకుండా, రోడ్డుపై వెళ్లే ఇతరుల ప్రాణాలతో కూడా చెలగాటం ఆడుతున్నారు.

Tesla కార్లలో ఫన్నీ వీడియో గేమ్స్.. ప్రయాణీకుల భద్రతతో డెత్ గేమ్స్..

టెస్లా ఇటీవల దాని సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసింది, ఈ అప్‌డేట్ తో ఇప్పుడు వాహనం చలనంలో ఉన్నా సరే డ్రైవర్ లేదా ఫ్రంట్ ప్యాసింజర్ దాని టచ్‌స్క్రీన్‌పై వీడియో గేమ్‌లను ఆడటానికి ఈ అప్‌డేట్ అనుమతిస్తుంది. ఫలితంగా, ఇది ఇప్పుడు భద్రత మరియు డ్రైవర్ పరధ్యానం గురించి ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కి ముందు, వాహనం పార్కింగ్ లో ఉన్నప్పుడు లేదా పూర్తిగా నిలిపి ఉన్నప్పుడు మాత్రమే వీడియో గేమ్‌లను ఆడేందుకు అనుమతి ఉండేది.

Tesla కార్లలో ఫన్నీ వీడియో గేమ్స్.. ప్రయాణీకుల భద్రతతో డెత్ గేమ్స్..

అయితే, ఈ కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ తర్వాత కారు చలనంలో ఉన్నప్పుడు కూడా వీడియో గేమ్స్ ఆడేందుకు అనుమతి ఉంటుంది. టెస్లా వాహనం చలనంలో ఉన్నప్పుడు స్కై ఫోర్స్ రీలోడెడ్, సాలిటైర్ మరియు ది బాటిల్ ఆఫ్ పాలిటోపియా వంటి గేమ్స్ ని టచ్‌స్క్రీన్‌పై ప్లే చేయవచ్చని తేలింది. ఈ గేమ్‌ లను ప్రారంభించే ముందు వారు డ్రైవర్ కాదని ధృవీకరించమని నోటిఫికేషన్ వస్తుంది, కానీ డ్రైవర్ ఆ కారులోని డ్రైవర్ "నేను ప్రయాణికుడి"ని అనే ఆప్షన్ ఎంచుకొని కారు చలనంలో ఉన్నప్పుడే గేమ్స్ ఆడుకోవ్చచు.

Tesla కార్లలో ఫన్నీ వీడియో గేమ్స్.. ప్రయాణీకుల భద్రతతో డెత్ గేమ్స్..

అంతేకాకుండా, టెస్లా కారులోని మరికొన్ని ఇంటరాక్టివ్ యాప్‌లు కూడా ఈ అప్‌డేట్‌కు ముందు మోషన్‌లో పనిచేశాయి, వీటిలో డ్రాయింగ్ ప్యాడ్ మరియు సంగీతం కోసం కరోకే మోడ్ మొదలైనవి ఉండేవి. ఈ నేపథ్యంలో, టెస్లా సంస్థపై ఓ కారు యజమాని కేసు వేశారు. కారు చలనంలో ఉన్నప్పుడు డ్రైవరుని పరధ్యానానికి గురిచేసే ఇలాంటి విషయాలను మరియు ఆటలను నిషేధించాలని ఆయన తన వాజ్యంలో పేర్కొన్నారు. ఇది డ్రైవర్లకు మరియు ప్రయాణీకులకు భద్రతా ముప్పుగా ఉంటుందని చెప్పారు.

Tesla కార్లలో ఫన్నీ వీడియో గేమ్స్.. ప్రయాణీకుల భద్రతతో డెత్ గేమ్స్..

టెస్లా మోడల్ 3 కారుని ఉపయోగించే ఓ యజమాని, తన కారులో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆటలు ఆడగలమని గుర్తించిన తర్వాత అతను NHTSA కి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. టెస్లా విషయంలో వచ్చిన ఫిర్యాదు ఇదేం మొదటిది కాదు. మోడల్ 3కి సంబంధించి టెస్లాకు ప్రస్తుతం యజమానుల నుండి ఇప్పటికే 59 ఫిర్యాదులు ఉన్నాయి. అయితే, కంపెనీ మాత్రం సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్‌ను ఉపయోగిస్తున్నప్పుడు డ్రైవర్ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని చెబుతోంది.

Tesla కార్లలో ఫన్నీ వీడియో గేమ్స్.. ప్రయాణీకుల భద్రతతో డెత్ గేమ్స్..

యజమానుల నుండి ఈ ఫిర్యాదు అందుకున్న నేపథ్యంలో, యూఎస్ హైవే మరియు ట్రాఫిక్ సేఫ్టీ ఏజెన్సీ రోడ్డుపై భద్రతకు సంబంధించి టెస్లా నుండి సమాధానం కోరింది. డ్రైవింగ్‌లో వీడియో గేమ్‌లు ఆడడం వల్ల కారు డ్రైవర్‌తో పాటు రోడ్డుపై ఉన్న ఇతర వ్యక్తులకు ప్రాణాపాయం తప్పదని రోడ్‌ సేఫ్టీ ఏజెన్సీ చెబుతోంది. డ్రైవింగ్‌లో వీడియో గేమ్‌లు ఆడడం వల్ల డ్రైవర్ దృష్టి మరల్చవచ్చు, ఇది తీవ్రమైన ప్రమాదానికి దారి తీస్తుంది. వీలైనంత త్వరగా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా తన అన్ని కార్ల నుండి ఈ ఫీచర్‌ను తీసివేయాలని రోడ్డు భద్రతా ఏజెన్సీ టెస్లాకు సూచించింది. కారు పార్కింగ్ స్థలంలో పార్క్ చేసినప్పుడు లేదా ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు మాత్రమే కార్ స్క్రీన్‌పై గేమ్‌లు ఆడేందుకు అనుమతించాలని ఏజెన్సీ చెబుతోంది.

Tesla కార్లలో ఫన్నీ వీడియో గేమ్స్.. ప్రయాణీకుల భద్రతతో డెత్ గేమ్స్..

భారతదేశంలో మొదటి టెస్లా కారు ప్రవేశానికి రంగం సిద్ధం..!

ఇదిలా ఉంటే అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ బ్రాండ్ టెస్లా తన మొదటి ఎలక్ట్రిక్ కారును భారతదేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా, కంపెనీ ఇటీవలే భారతదేశంలో కార్ ఛార్జర్ యూనిట్‌ను కూడా దిగుమతి చేసుకుంది. టెస్లా భారతదేశంలో టైప్ 2 మరియు CCS2 అనే రెండు రకాల ఛార్జింగ్ సాకెట్లతో 150kW ఛార్జింగ్ గ్రిడ్‌ను ఆర్డర్ చేసింది. అయితే, ప్రస్తుతానికి టెస్లా ఛార్జింగ్ స్టేషన్‌లు ఎక్కడ అందుబాటులో ఉంటాయనే సమాచారాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

Tesla కార్లలో ఫన్నీ వీడియో గేమ్స్.. ప్రయాణీకుల భద్రతతో డెత్ గేమ్స్..

తాజా నివేదికల ప్రకారం, టెస్లా భారతదేశంలో 'మోడల్ 3' మరియు 'మోడల్ Y' ఎలక్ట్రిక్ కార్లను పరీక్షిస్తోంది. భారతదేశంలో తన ఎలక్ట్రిక్ కార్ల అమ్మకం కోసం కంపెనీ ప్రభుత్వం నుండి ఎన్ఓసి ని కూడా పొందింది. గత సంవత్సరం, టెస్లా భారతదేశంలోని మూడు మెట్రోపాలిటన్ నగరాలు, ముంబై, బెంగళూరు మరియు ఢిల్లీలలో తన డీలర్‌షిప్‌లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. టెస్లా తమ ఎలక్ట్రిక్ కార్లపై దిగుమతి పన్నులను తగ్గించాలని ప్రధానమంత్రి కార్యాలయాన్ని కోరింది. ఈ ఏడాది భారత మార్కెట్లో దిగుమతి చేసుకున్న ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలను ప్రారంభించాలనుకుంటున్నామని, అయితే అంతకు ముందు తమ కార్లపై దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం తగ్గించాలని టెస్లా కోరుతోంది.

Most Read Articles

Read more on: #టెస్లా #tesla
English summary
Video games in tesla cars may cause safety threats while driving complaint filed details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X