వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డును దక్కించుకున్న ఫోక్స్‌వ్యాగన్ ఐడి 4

జర్మన్ కార్ బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్ అందిస్తున్న ఐడి.4 కారును వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డు వరించింది. ఈ సంవత్సరం వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ జ్యూరీలో 24 దేశాల నుండి 90 మంది అంతర్జాతీయ ఆటోమొబైల్ జర్నలిస్టులు పాల్గొన్నారు, వీరంతా కలిసి ఫోక్స్‌వ్యాగన్ ఐడి.4 కారుకి ఈ టైటిల్ ఇచ్చారు.

వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డును దక్కించుకున్న ఫోక్స్‌వ్యాగన్ ఐడి 4

వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ పోటీలో ఏదైనా కార్ మోడల్ నిలవాలంటే, సదరు కార్ మోడల్ సంవత్సరానికి 10,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. కనీసం రెండు దేశాల్లోనైనా అతిపెద్ద అంతర్జాతీయ మార్కెట్లలో సదరు కారు విక్రయించబడాలి.

వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డును దక్కించుకున్న ఫోక్స్‌వ్యాగన్ ఐడి 4

అంతకాకుండా, సదరు కారు మే 1 ,2020 నుండి మే 1, 2021 మధ్యలో కాలంలో విక్రయించబడుతూ ఉండాలి. ఫోక్స్‌వ్యాగన్ ఐడి. 4 యూరప్, అమెరికా మరియు చైనా దశాలలో విక్రయించబడుతోంది. ఇదొక ఎలక్ట్రిక్ కారు మరియు ఐడి. 4 ఈ దేశాలలో ఎక్కువగా ఇష్టపడే ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా కొనసాగుతోంది.

MOST READ:వేగంగా వస్తున్న ట్రైన్‌కి అడ్డంగా వెళ్లి చిన్నారి ప్రాణాలు కాపాడిన రియల్ హీరో [వీడియో]

వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డును దక్కించుకున్న ఫోక్స్‌వ్యాగన్ ఐడి 4

ఫోక్స్‌వ్యాగన్ ఐడి. 4 యొక్క ఉద్గార ప్రమాణాలు, అధునాతన సాంకేతికత మరియు లక్షణాల కారణంగా జ్యూరీ ఈ కారును వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక చేసింది. కంపెనీ ఈ ఏడాది 1,50,000 యూనిట్ల ఐడి 4 కార్లను విక్రయించాలని కంపెనీ యోచిస్తోంది. ఫోక్స్‌వ్యాగన్ తన ప్రణాళికలో భాగంగా ప్రతి ఏటా ఓ కొత్త ఎలక్ట్రిక్ కారును విడుదల చేయబోతోంది.

వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డును దక్కించుకున్న ఫోక్స్‌వ్యాగన్ ఐడి 4

గతేడాది ఆరంభంలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పో సందర్భంగా ఫోక్స్‌వ్యాగన్ ఐడి 4 కారును ఈ కంపెనీ భారతదేశంలో కూడా ఆవిష్కరించింది. ఈ కారు యొక్క అంతర్జాతీయ మోడల్ 77 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంది. ఈ కారు ఒకే ఛార్జీపై 520 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది.

MOST READ:లంబోర్ఘిని ఉరుస్ కారు కొన్న మరో బాలీవుడ్ సెలబ్రెటీ.. ఎవరంటే?

వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డును దక్కించుకున్న ఫోక్స్‌వ్యాగన్ ఐడి 4

ఫోక్స్‌వ్యాగన్ ఐడి 4 కారులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 201 బిహెచ్‌పి పవర్‌ను మరియు 310 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఐడి 4 ఎలక్ట్రిక్ కారులో కంపెనీ ఓ జిటిఎక్స్ పెర్ఫార్మెన్స్ వేరియంట్‌ను కూడా తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇటీవలే ఇందుకు సంబంధించిన ఓ టీజర్‌ను కూడా కంపెనీ విడుదల చేసింది.

వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డును దక్కించుకున్న ఫోక్స్‌వ్యాగన్ ఐడి 4

అంతర్జాతీయ మార్కెట్లలో ఫోక్స్‌వ్యాగన్ అందిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ కారణంగా, కంపెనీ గత సంవత్సరం 2,12,000 యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాలను పంపిణీ చేయగలిగింది. ఈ మొత్తం వాహనాల్లో 1,34,000 యూనిట్ల పూర్తి ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి.

MOST READ:మెర్సిడెస్ ఇక్యూటి ఎమ్‌పివి; చిన్న ఫ్యామిలీ కోసం చిన్న వ్యాన్

వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డును దక్కించుకున్న ఫోక్స్‌వ్యాగన్ ఐడి 4

ఇదిలా ఉంటే.. 2021వ సంవత్సరానికి గాను వరల్డ్ కార్ డిజైన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ల్యాండ్ రోవర్ డిఫెండర్ దక్కించుకుంది. ఈ అవార్డుకు జాగ్వార్ ల్యాండ్ రోవర్‌కు ఎంపిక కావడం ఇది ఆరవసారి. గత 17 ఏళ్ల అవార్డుల చరిత్రలో ఏ ఇతర ఓఈఎమ్‌కి ఇన్ని అవార్డులు రాలేదు.

Most Read Articles

English summary
Volkswagen ID.4 Awarded World Car Of The Year 2021, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X