Volkswagen ID5 ఎలక్ట్రిక్ కూప్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; పూర్తి చార్జ్ పై 520 కిలోమీటర్ల రేంజ్

జర్మన్ కార్ బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్ తమ ఎలక్ట్రిక్ వెహికల్ ఐడి (ID) సిరీస్ లో మరో కొత్త మోడల్ ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. ఫోక్స్‌వ్యాగన్ ఐడి.5 (Volkswagen ID.5) పేరుతో కంపెనీ ఆవిష్కరించిన ఈ సరికొత్త కూప్ ఎస్‌యూవీ స్టన్నింగ్ లుక్స్, లాంగ్ రేంజ్ మరియు లేటెస్ట్ టెక్ ఫీచర్లతో అందుబాటులోకి రానుంది. ఫోక్స్‌వ్యాగన్ ఇప్పటి వరకూ ఐడి సిరీస్ లో హ్యాచ్‌బ్యాక్ మరియు ఎస్‌యూవీ బాడీ టైప్ మోడళ్లను తయారు చేయగా, తొలిసారిగా ఇందులో కూప్ ఎస్‌యూవీ బాడీ టైప్ మోడల్ ను ప్రవేశపెట్టింది.

Volkswagen ID5 ఎలక్ట్రిక్ కూప్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; పూర్తి చార్జ్ పై 520 కిలోమీటర్ల రేంజ్

కొత్త ఫోక్స్‌వ్యాగన్ ఐడి.5 కూప్ ఎస్‌యూవీలో స్టాండర్డ్ వేరియంట్ తో పాటుగా కంపెనీ ఇందులో ఓ పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ జిటిఎక్స్ (GTX) వేరియంట్ ను కూడా ప్రవేశపెట్టింది. ఐడి.5 కారులో చిన్నపాటి కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ మరియు కొత్త సాంకేతిక ఫీచర్లు మినహా ఇది ఓవరాల్ గా దాని పాత తరం ఐడి.4 ఎస్‌యూవీ మాదిరిగానే ఉంటుంది. ఇందులో ప్రధానమైన డిజైన్ మార్పు దాని వెనుక భాగంలో కనిపిస్తుంది. ఇప్పుడు ఇది వెనుక వైపు వాలుగా ఉండే రూఫ్ లైన్ తో చూడటానికి కూప్ ఎస్‌యూవీ మాదిరిగా ఉంటుంది.

Volkswagen ID5 ఎలక్ట్రిక్ కూప్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; పూర్తి చార్జ్ పై 520 కిలోమీటర్ల రేంజ్

ఫోక్స్‌వ్యాగన్ ID.3 హ్యాచ్‌బ్యాక్ మరియు ID.4 కాంపాక్ట్-ఎస్‌యూవీల మాదిరిగానే ఈ కొత్త ఫోక్స్‌వ్యాగన్ ID.5 కూప్ ఎస్‌యూవీ కూడా మాడ్యులర్ MEB ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ప్లాట్‌ఫామ్ పై నిర్మించిన ఐడి.5 ఎలక్ట్రిక్ కారు లోపలి భాగంలో మరింత ఎక్కువ క్యాబిన్ స్థలం లభిస్తుంది. కాగా, ఫోక్స్‌వ్యాగన్ ID.5 GTX AWD వేరియంట్ మాత్రం ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలతో కూడిన డ్యూయల్-మోటార్ సెటప్‌ను పొందుతుంది.

Volkswagen ID5 ఎలక్ట్రిక్ కూప్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; పూర్తి చార్జ్ పై 520 కిలోమీటర్ల రేంజ్

ఈ కారు ముందు భాగంలో సొగసైన ఫ్రంట్ గ్రిల్, ఇరువైపులా డేటైమ్ ఎల్ఈడి రన్నింగ్ లైట్లతో కూడిన సన్నటి హెడ్‌లైట్ క్లస్టర్‌లు, పెద్ద ఫ్రంట్ బంపర్, ఆకర్షణీయమైన అల్లాయ్ వీల్స్, బ్లాక్డ్ అవుట్ పిల్లర్స్, వెనుక వైపు వాలుగా ఉండే రూఫ్ లైన్, స్మోక్డ్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, స్పోర్టీ అప్పీల్ ను ఇచ్చే బూట్ స్పాయిలర్, డ్యూయెల్ టోన్ రియర్ బంపర్, షార్క్ ఫిన్ యాంటెన్నా మరియు బ్లాక్ కలర్ రూఫ్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి.

Volkswagen ID5 ఎలక్ట్రిక్ కూప్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; పూర్తి చార్జ్ పై 520 కిలోమీటర్ల రేంజ్

కొత్త ఫోక్స్‌వ్యాగన్ ID.5 మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. వీటిలో ప్రో, ప్రో పెర్ఫార్మెన్స్ మరియు జిటిఎక్స్ వేరియంట్లు ఉన్నాయి. ఈ మూడు వేరియంట్‌లలో 77 kWh బ్యాటరీ ప్యాక్ అమర్చబడి ఉంటుంది. కాకపోతే, కస్టమర్ ఎంచుకునే వేరియంట్ ను బట్టి ఈ కారు సింగిల్ లేదా డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్ సెటప్ తో అందుబాటులో ఉంటుంది.

Volkswagen ID5 ఎలక్ట్రిక్ కూప్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; పూర్తి చార్జ్ పై 520 కిలోమీటర్ల రేంజ్

ఫోక్స్‌వ్యాగన్ ID.5 ప్రో ప్రారంభ వేరియంట్‌లో ఒక ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 172 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 10.4 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది మరియు గంటకు 159 కిమీ వేగంతో పరుగులు తీస్తుంది. ఇక ప్రో పెర్ఫార్మెన్స్ వేరియంట్‌ విషయానికి ఇందులో కూడా సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది, కాకపోతే, ఇది రియర్ యాక్సిల్ పై మౌంట్ చేయబడి ఉంటుంది.

Volkswagen ID5 ఎలక్ట్రిక్ కూప్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; పూర్తి చార్జ్ పై 520 కిలోమీటర్ల రేంజ్

ఫోక్స్‌వ్యాగన్ ID.5 ప్రో పెర్ఫార్మెన్స్ వేరియంట్ లోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 201 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 8.4 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. ఈ మోడల్ గరిష్టంగా గంటకు గరిష్టంగా 159 కి.మీ వేగంతో పరుగులు తీస్తుంది. ఇక ఇందులో చివరి వేరియంట్ అయిన జిటిఎక్స్ లో ప్రతి యాక్సిల్ (ఫ్రంట్ అండ్ రియర్) ఒక్కొక్క మోటార్ చొప్పున రెండు ఎలక్ట్రిక్ మోటార్లు అమర్చబడి ఉంటాయి.

Volkswagen ID5 ఎలక్ట్రిక్ కూప్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; పూర్తి చార్జ్ పై 520 కిలోమీటర్ల రేంజ్

జిటిఎక్స్ వేరియంట్లోని రెండు యాక్సిల్‌లపై అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్లు గరిష్టంగా 295 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఈ కారు కేవలం 6.3 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది మరియు ఇది గంటకు గరిష్టంగా 180 కిమీ వేగంతో పరుగులు తీస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు పూర్తి చార్జ్ పై గరిష్టంగా 520 కిమీ వరకూ రేంజ్ ను ఆఫర్ చేస్తుంది (వేరియంట్ ను బట్టి ఈ రేంజ్ మారుతూ ఉంటుంది).

Volkswagen ID5 ఎలక్ట్రిక్ కూప్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; పూర్తి చార్జ్ పై 520 కిలోమీటర్ల రేంజ్

చార్జింగ్ విషయానికి వస్తే, ఫోక్స్‌వ్యాగన్ ID.5 ఎలక్ట్రిక్ కూప్ ఎస్‌యూవీలో 135 kW కెపాసిటీ ఉన్న ఫాస్ట్ ఛార్జర్‌కు ఇందులోని బ్యాటరీ ప్యాక్‌ సపోర్ట్ చేస్తుంది. ఈ చార్జర్ సాయంతో కారులోని బ్యాటరీ ప్యాక్ ను కేవలం 30 నిమిషాల్లోనే 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. ఇదివరకు చెప్పుకున్నట్లుగా కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారును ఫోక్స్‌వ్యాగన్ యొక్క MEB ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించబడింది. మునుపటి ID.4 ఎలక్ట్రిక్ కారును కూడా అదే కాన్ఫిగరేషన్ పై నిర్మించారు.

Volkswagen ID5 ఎలక్ట్రిక్ కూప్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; పూర్తి చార్జ్ పై 520 కిలోమీటర్ల రేంజ్

కొత్త ఐడి.5 ఎలక్ట్రిక్ కారు కొలతలను గమనిస్తే, దీని పొడవు 4,599 మిమీ మరియు వీల్‌బేస్ 2,600 మిమీ గా ఉంటుంది. ఈ కారులో 549 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. ఇంకా ఇందులో 6 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు 12 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ కారు 2022 ప్రారంభంలో యూరోపియన్ మార్కెట్లోకి రానుంది. ప్రస్తుతం, జర్మనీలో ఫోక్స్‌వ్యాగన్ ప్లాంట్ లో తయారు చేయబడుతున్న ID.3 మరియు ID.4 మోడళ్ల సరసనే ఈ కొత్త ID.5 ఎలక్ట్రిక్ కారును కూడా తయారు చేయనున్నారు.

Most Read Articles

English summary
Volkswagen id 5 electric coupe suv unveiled details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X