భారత్‌లో విడుదలైన ఫోక్స్‌వ్యాగన్ కొత్త వేరియంట్; ధర & వివరాలు

జర్మన్ కార్ల తయారీదారు ఫోక్స్‌వ్యాగన్ దేశీయ మార్కెట్లో ఇప్పటికే తమ బ్రాండ్ వాహనాలను చాలా వరకు ప్రవేశపెట్టి అత్యంత ప్రజాదరణ పొందింది. ఇప్పుడు కంపెనీ తన ప్రసిద్ధ హ్యాచ్ బ్యాక్ అయిన ఫోక్స్‌వ్యాగన్ పోలో యొక్క కొత్త కంఫర్ట్‌లైన్ టిఎస్ఐ ఎడిషన్ ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఫోక్స్‌వ్యాగన్ యొక్క కొత్త ఎడిషన్స్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

భారత్‌లో విడుదలైన ఫోక్స్‌వ్యాగన్ కొత్త వేరియంట్; ధర & వివరాలు

ఫోక్స్‌వ్యాగన్ యొక్క నాన్-మెటాలిక్ కలర్ ఆప్షన్‌ ధర మార్కెట్లో రూ. 7.41 లక్షలు కాగా, మెటాలిక్ కలర్ షేడ్స్ ధర రూ. 7.51 లక్షల (ఎక్స్‌షోరూమ్) వరకు ఉంది. ఫోక్స్‌వ్యాగన్ పోలో కంఫర్ట్‌లైన్ కేవలం 1.0-లీటర్ ఎంపిఐ ఇంజిన్‌తో మాత్రమే మాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఉండేది.

భారత్‌లో విడుదలైన ఫోక్స్‌వ్యాగన్ కొత్త వేరియంట్; ధర & వివరాలు

కానీ ఇప్పుడు విడుదలైన ఈ కొత్త వేరియంట్ 1.0-లీటర్ టిఎస్‌ఐ కంఫర్ట్‌లైన్ మరియు హైలైన్ ప్లస్ ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. ఫోక్స్‌వ్యాగన్ నుండి వచ్చిన ఈ 1.0-లీటర్, త్రీ సిలిండర్ టిఎస్ఐ ఇంజన్ 109 బిహెచ్‌పి పవర్ మరియు 175 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

MOST READ:చిట్టి చిట్టి రోబో కాదు, పిజ్జా డెలివరీ రోబో, తెలుసా.. అయితే ఇది చూడండి

భారత్‌లో విడుదలైన ఫోక్స్‌వ్యాగన్ కొత్త వేరియంట్; ధర & వివరాలు

ఈ ఇంజిన్‌ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ తో స్టాండర్డ్ గా అందించబడుతుంది, అయితే 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ హైలైన్ ప్లస్ వేరియంట్‌తో మాత్రమే అందించబడుతుంది. పోలో యొక్క కంఫర్ట్‌లైన్ టిఎస్‌ఐ మునుపటికంటే ఎక్కువ శక్తివంతమైన ఇంజిన్‌తో వస్తుంది.

భారత్‌లో విడుదలైన ఫోక్స్‌వ్యాగన్ కొత్త వేరియంట్; ధర & వివరాలు

ఈ కొత్త ఫోక్స్‌వ్యాగన్ వేరియంట్ లో కనిపించే ఫీచర్స్ దాదాపు కంఫర్ట్‌లైన్ ఎంపిఐలో మాదిరిగానే ఉంటాయి. అయితే ఇక్కడ గమనించదగ్గ మరో విషయం ఏమిటంటే, కంఫర్ట్‌లైన్ హైలైన్ ప్లస్ వేరియంట్ కంటే లక్ష రూపాయలు తక్కువ ధర కలిగి ఉంటుంది. వోక్స్వ్యాగన్ ఇటీవల ఈ కారు ధరను కూడా పెంచినట్లు ప్రకటించింది.

MOST READ:2021 టీవీఎస్ అపాచీ RTR 160 4V రివ్యూ.. ఇప్పుడు సూపర్ స్టైల్ & సూపర్ పర్ఫామెన్స్

భారత్‌లో విడుదలైన ఫోక్స్‌వ్యాగన్ కొత్త వేరియంట్; ధర & వివరాలు

ఫోక్స్‌వ్యాగన్ పోలో యొక్క బేస్ వేరియంట్స్ ట్రెండ్లైన్ ఎంపిఐ మరియు కంఫర్ట్‌లైన్ ఎంపిఐ ఇప్పుడు రూ. 15 వేల ఖరీదైనవి కాగా, హైలై ప్లస్ ధరను రూ. 14,800 వరకు పెంచింది. అదే సమయంలో, దాని జిటి లైన్ వేరియంట్ ధర ఇప్పుడు 7,200 రూపాయలు పెరిగింది.

భారత్‌లో విడుదలైన ఫోక్స్‌వ్యాగన్ కొత్త వేరియంట్; ధర & వివరాలు

ఇటీవల ఫోక్స్‌వ్యాగన్ తన ఎలక్ట్రిక్ కారు యొక్క కొత్త టీజర్ కూడా విడుదల చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు సంస్థ యొక్క ఈ కొత్త పర్ఫామెన్స్ ఎలక్ట్రిక్ కారు కానుంది. ఫోక్స్‌వ్యాగన్ ఐడి 4 జిటిఎక్స్ ఎలక్ట్రిక్ కారు యొక్క కొత్త టీజర్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది కూడా త్వరలోనే మార్కెట్లో అరంగేట్రం చేయనుంది. ప్రస్తుతం కంపెనీ దీని ఉత్పత్తిపై నిమగ్నమై ఉంది.

MOST READ:చూడటానికి ఎద్దుల బండిలా ఉంది, కానీ ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రక్!

భారత్‌లో విడుదలైన ఫోక్స్‌వ్యాగన్ కొత్త వేరియంట్; ధర & వివరాలు

ఫోక్స్‌వ్యాగన్ కొద్దీ రోజుల క్రితమే తన ఐడి .4 జిటిఎక్స్ ఎలక్ట్రిక్ కార్ టీజర్ విడుదల చేసింది. కానీ దీని గురించి కంపెనీ పెద్దగా సమాచారాన్ని అందించలేదు. అయితే దీనిని త్వరలో తీసుకురావడానికి తగిన సన్నాహాలను సిద్ధం చేస్తోంది.

భారత్‌లో విడుదలైన ఫోక్స్‌వ్యాగన్ కొత్త వేరియంట్; ధర & వివరాలు

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో దాదాపు అన్ని వాహన తయారీదారులు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. ఇప్పడు ఫోక్స్‌వ్యాగన్ కూడా తన ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేయడానికి సిద్ధమైంది. అయితే దీని గురించి మరింత సమాచారం త్వరలో అందుబాటులోకి వస్తుంది.

MOST READ:బ్రేకింగ్ న్యూస్; బెంగళూరులో తిరగాలంటే మీ బైక్‌కి ఇది తప్పని సరి.. లేకుంటే?

Most Read Articles

English summary
Volkswagen Polo Comfortline TSI Launched. Read in Telugu.
Story first published: Thursday, April 15, 2021, 18:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X