కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో ఫేస్‌లిఫ్ట్ వెల్లడి: ఫీచర్లు, స్పెసికేషన్లు మరియు వివరాలు

జర్మన్ కార్ బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ పోలో కారులో కంపెనీ ఓ సరికొత్త వెర్షన్‌ను ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. కంపెనీ ఇప్పటికే తమ 6వ తరం పోలో ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తోంది.

కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో ఫేస్‌లిఫ్ట్ వెల్లడి: ఫీచర్లు, స్పెసికేషన్లు మరియు వివరాలు

కొత్తగా భారత మార్కెట్లోకి రానున్న 2021 వెర్షన్ ఫోక్స్‌వ్యాగన్ పోలో కారులో డిజైన్ మరియు ఫీచర్ అప్‌గ్రేడ్‌లు ఉండనున్నాయి. ఇందులో రివైజ్డ్ ఫ్రంట్ గ్రిల్, రీడిజైన్ చేసిన ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్ ఉన్నాయి. కొత్త హెడ్‌ల్యాంప్ సెటప్‌తో ఇది అప్‌డేట్ చేసిన ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంటుంది.

కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో ఫేస్‌లిఫ్ట్ వెల్లడి: ఫీచర్లు, స్పెసికేషన్లు మరియు వివరాలు

ఈ కారు ముందు భాగంలో ఫ్రంట్ గ్రిల్‌కి దిగువన ఓ పొడవాటి ఎల్ఈడి లైట్ బార్ ఉంటుంది. ఇది ఇరువైపులా హెడ్‌లైట్ క్లస్టర్‌లో దిగువన అమర్చిన ఎల్ఈడి డే టైమ్ రన్నింగ్ లైట్లను కలుపుతున్నట్లుగా ఉంటుంది. ఈ మార్పుల వలన కొత్త 2021 పోలో ప్రస్తుత మోడల్ కంటే మరింత షార్ప్ రూపాన్ని కలిగి ఉంటుంది.

కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో ఫేస్‌లిఫ్ట్ వెల్లడి: ఫీచర్లు, స్పెసికేషన్లు మరియు వివరాలు

అంతేకాకుండా, ఇందులోని హెడ్‌ల్యాంప్ యూనిట్‌లో రెండు ప్రొజెక్టర్ లైట్లు ఉంటాయి. ఈ లైటింగ్ సెటప్ కంపెనీ విక్రయిస్తున్న మరొక పాపులర్ స్మాల్ కార్ గోల్ఫ్ మోడల్ నుండి స్పూర్తి పొందినట్లుగా అనిపిస్తుంది. ఇందులో ఫ్రంట్ బంపర్ దిగువ భాగంలో కొత్త సి-ఆకారపు ఫాగ్ ల్యాంప్ హౌసింగ్‌తో పాటు అడ్డంగా ఉంచిన ఫాగ్ ల్యాంప్ సెటప్ కూడా ఉంటుంది.

కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో ఫేస్‌లిఫ్ట్ వెల్లడి: ఫీచర్లు, స్పెసికేషన్లు మరియు వివరాలు

ఈ కారులో ఇప్పుడు మునుపటి కంటే మరింత విస్తృతంగా కనిపించే కొత్త సెంట్రల్ ఎయిర్ ఇన్‌టేక్స్ కూడా ఉంటాయి. ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ నుండి స్పూర్తి పొందిన డిజైన్ అంశాలు కేవలం దాని ముందు భాగానికి మాత్రమే పరిమితం కావు, వెనుక భాగంలో కూడా కనిపిస్తాయి. ఉదాహరణకు, ఇందులో ఎల్-ఆకారపు ఎల్ఈడి టెయిల్ లైట్స్‌గా చెప్పుకోవచ్చు.

కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో ఫేస్‌లిఫ్ట్ వెల్లడి: ఫీచర్లు, స్పెసికేషన్లు మరియు వివరాలు

కొత్త 2021 ఫోక్స్‌వ్యాగన్ పోలో వెనుక బంపర్‌ను కూడా రీడిజైన్ చేశారు. అలాగే, ఇంటీరియర్ క్యాబిన్‌ను కూడా అప్‌గ్రేడ్ చేశారు. కారులో ఇప్పుడు కొత్త డాష్‌బోర్డ్ లేఅవుట్, పెద్ద 9.2 ఇంచ్ టచ్‌స్క్రీన్ డిస్ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి.

కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో ఫేస్‌లిఫ్ట్ వెల్లడి: ఫీచర్లు, స్పెసికేషన్లు మరియు వివరాలు

ఈ కారులోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అనేక కనెక్టివిటీ ఆప్షన్లు మరియు లేటెస్ట్ కార్ కనెక్ట్ టెక్నాలజీతో వస్తుంది. డ్రైవర్ సమాచారం కోసం అందించే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా పూర్తిగా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. ఇవే కాకుండా, ఈ కారులో డ్రైవర్ అసిస్టెంట్ ఫీచర్లు కూడా ఇవ్వబడతాయని సమాచారం.

కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో ఫేస్‌లిఫ్ట్ వెల్లడి: ఫీచర్లు, స్పెసికేషన్లు మరియు వివరాలు

ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, ఫోక్స్‌వ్యాగన్ పోలో ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో, ప్రస్తుత పోలో కార్లలో ఉపయోగిస్తున్న వాటినే కొనసాగించే అవకాశం ఉంది. బేస్ వేరియంట్‌లో 1-లీటర్ ఎంపిఐ ఇంజన్ లభిస్తుంది, ఇది 79 బిహెచ్‌పి శక్తిని జనరేట్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.

కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో ఫేస్‌లిఫ్ట్ వెల్లడి: ఫీచర్లు, స్పెసికేషన్లు మరియు వివరాలు

అలాగే, ఇందులోని ప్రీమియం వేరియంట్లలో 1.0 లీటర్ టిఎస్‌ఐ ఇంజన్ ఉంటుంది, ఇది 94 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యం కానుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Volkswagen Polo Facelift Revealed; Specs, Features And Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X