ఇప్పటికి తగ్గని Taigun డిమాండ్.. అప్పుడే 16,000 దాటిన బుకింగ్స్

ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) భారతీయ మార్కెట్లో కొత్త ఫోక్స్‌వ్యాగన్ టైగన్ (Volkswagen Taigun) రూ. 10.49 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది. బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభించబడ్డాయి. అయితే కంపెనీ ఇప్పటికి దాదాపు 16,000 యూనిట్ల బుకింగ్స్ స్వీకరించినట్లు అధికారికంగా తెలిపింది.

ఇప్పటికి తగ్గని Taigun డిమాండ్.. అప్పుడే 16,000 దాటిన బుకింగ్స్

కంపెనీ ఇప్పటి వరకు కస్టమర్లకు డెలివరీ చేసిన కార్లు కూడా ఈ 16,000 బుకింగ్స్ లో ఉన్నాయి. ఈ బుకింగ్స్ చూస్తే కంపెనీ యొక్క ఈ కారుకి ఎంత డిమాండ్ ఉందో తెలుస్తుంది. అయితే ఈ కొత్త Volkswagen Taigun కి మరింత ప్రజాదరణ పెరిగే అవకాశం ఉంటుంది.

ఇప్పటికి తగ్గని Taigun డిమాండ్.. అప్పుడే 16,000 దాటిన బుకింగ్స్

Volkswagen కంపెనీ Taigun SUV ని ఇండియా 2.0 ప్రాజెక్ట్ కింద MQB-AO-IN అనే కొత్త ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన మొదటి మోడల్. ఇది చాలా వరకు కొత్త మోడల్ మాదిరిగా ఉంటుంది. కావున ఇందులో రెండు కొత్త పెట్రోల్ ఇంజిన్ల ఎంపిక, అలాగే పెట్రోల్, ఆటోమేటిక్ మరియు DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపిక ఇవ్వబడింది.

ఇప్పటికి తగ్గని Taigun డిమాండ్.. అప్పుడే 16,000 దాటిన బుకింగ్స్

కొత్త Volkswagen Taigun మొత్తం 5 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి కుర్కుమా ఎల్లో, వైల్డ్ చెర్రీ రెడ్, కాండీ వైట్, రిఫ్లెక్స్ సిల్వర్ మరియు కార్బన్ స్టీల్ గ్రే కలర్స్.

Taigun అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది, దీని ముందుభాగంలో ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డిఆర్ఎల్ లతో ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంది. బంపర్‌లో ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్‌లను కూడా పొందుతుంది. ముందు బంపర్‌లో బ్లాక్డ్ అవుట్ హనీకూంబ్ గ్రిల్ కూడా చూడవచ్చు. బోనెట్‌పై లైన్స్ కూడా గమనించవచ్చు. ఇందులోని వీల్ ఆర్చెస్ కారుని మరింత స్టైలిష్ గా కనిపించేలా చేస్తాయి.

ఇప్పటికి తగ్గని Taigun డిమాండ్.. అప్పుడే 16,000 దాటిన బుకింగ్స్

Taigun SUV ఆల్‌రౌండ్ క్లాడింగ్, 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ కలిగి ఉంటుంది. రియర్ ప్రొఫైల్ ఒక ఎల్ఈడీ బార్‌తో ఒక ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ కలిగి ఉండి, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా ఇందులో షార్క్-ఫిన్ యాంటెన్నా, రూఫ్ రైస్, డ్యూయల్ టోన్ ORVM వంటివి కూడా ఉన్నాయి.

ఇప్పటికి తగ్గని Taigun డిమాండ్.. అప్పుడే 16,000 దాటిన బుకింగ్స్

ఈ కొత్త SUV లో 8.0 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ వంటివి అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్స్ కూడా ఉన్నయి. ఇందులో ఉన్న 8.0 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కారు యొక్క స్పీడ్, యావరేజ్ స్పీడ్, యావరేజ్ ఫ్యూయెల్ కెపాసిటీ, ​​ఓడోమీటర్, రేంజ్ లెఫ్ట్‌ వంటి సమాచారాన్ని ప్రదర్శిస్తుంది.

ఇప్పటికి తగ్గని Taigun డిమాండ్.. అప్పుడే 16,000 దాటిన బుకింగ్స్

వీటితో పాటు Volkswagen Taigun వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, రియర్ ఏసీ వెంట్స్, ఫ్రంట్ అండ్ రియర్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ పోర్ట్‌లు, కప్‌హోల్డర్‌లతో సెంట్రల్ ఆర్మ్‌రెస్ట్, క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, రెడ్ యాంబియంట్ లైటింగ్ మరియు స్మార్ట్ టచ్ క్లైమాట్రానిక్ ఆటో ఏసీ వంటివి కూడా అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

ఇప్పటికి తగ్గని Taigun డిమాండ్.. అప్పుడే 16,000 దాటిన బుకింగ్స్

Volkswagen Taigun అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెషన్ డిఫ్లేటింగ్ వార్ణింగ్, పార్క్ డిస్టెన్స్ కంట్రోల్, రియర్ వ్యూ కెమెరా, హిల్ హోల్డ్ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి మరియు ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి.

ఇప్పటికి తగ్గని Taigun డిమాండ్.. అప్పుడే 16,000 దాటిన బుకింగ్స్

Volkswagen Taigun యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇది రెండు ఇంజిన్ ఎంపికలలో అందించబడుతుంది. ఇందులో ఒకటి 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కాగా, రెండవది 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. ఇందులోని 1.0-లీటర్ ఇంజిన్ 5500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 113 బిహెచ్‌పి పవర్ మరియు 1750 ఆర్‌పిఎమ్ వద్ద 175 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో జతచేయబడింది.

ఇప్పటికి తగ్గని Taigun డిమాండ్.. అప్పుడే 16,000 దాటిన బుకింగ్స్

ఇక 1.5-లీటర్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 5000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 148 బిహెచ్‌పి శక్తిని మరియు 1500 ఆర్‌పిఎమ్ వద్ద 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ DSG గేర్‌బాక్స్‌తో జతచేయబడింది. జిటి వేరియంట్లో 1.5-లీటర్ టీఎస్ఐ ఇంజిన్‌తో ప్రామాణికంగా అందించబడుతుంది.

Most Read Articles

English summary
Volkswagen taigun booking crosses 16000 units details
Story first published: Monday, October 11, 2021, 19:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X