సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్ ద్వారా Volkswagen Taigun: డీటేల్స్

జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen), గత నెల చివర్లో తమ కొత్త ఫోక్స్‌వ్యాగన్ టైగన్ (Volkswagen Taigun) ఎస్‌యూవీని రూ. 10.49 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసిన సంగతి తెలిసినదే. కాగా, ఫోక్స్‌వ్యాగన్ ఇప్పుడు తమ సరికొత్త టైగన్ ఎస్‌యూవీని కూడా సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్ ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. కస్టమర్‌లు ఇప్పుడు ఈ కారును ప్రతినెలా కొంత మొత్తాన్ని చెల్లించి అద్దెకు తీసుకోవచ్చు.

సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్ ద్వారా Volkswagen Taigun: డీటేల్స్

ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ఇప్పటికే ఈ సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్ క్రింద తమ ఇతర మోడళ్లను కూడా అందిస్తోంది. తాజాగా, ఇందులోకి ఫోక్స్‌వ్యాగన్ టైగన్‌ను చేర్చడం ద్వారా కంపెనీ తమ మొత్తం ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోని సబ్‌స్క్రిప్షన్ కోసం వినియోగదారులకు అందుబాటులో ఉండేలా చేసింది. ఆసక్తి గల కస్టమర్లు ఇప్పుడు ఏ ఫోక్స్‌వ్యాగన్ బ్రాండ్ కారునైనా సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ద్వారా ఎంచుకోవచ్చు.

సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్ ద్వారా Volkswagen Taigun: డీటేల్స్

సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్ ద్వారా తమ కార్లను కస్టమర్లకు అందించేందుకు గానూ ఫోక్స్‌వ్యాగన్ ఇండియా గడచిన సెప్టెంబర్ నెలలో ఒరిక్స్‌ సంస్థతో ఓ భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసినదే. ఈ భాగస్వామ్యం కింద, కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ పోలో, వెంటో మరియు టి-రోక్‌ కార్లను సబ్‌స్క్రిప్షన్-బేస్డ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశపెట్టింది.

సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్ ద్వారా Volkswagen Taigun: డీటేల్స్

తాజాగా, ఈ ప్రోగ్రామ్ లో ఫోక్స్‌వ్యాగన్ టైగన్ యొక్క డైనమిక్ లైన్ మరియు జిటి ప్లస్ వేరియంట్లు కూడా అందుబాటులో ఉంచబడ్డాయి. ఈ వేరియంట్‌లలో ఏదైనా ఒకదానిని కస్టమర్లు ప్రతినెలా రూ. 28,000 నెలవారీ అద్దెను చెల్లించి పొందవచ్చు. కస్టమర్‌లు అవసరాలకు అనుగుణంగా కంపెనీ 24, 36 లేదా 48 నెలల కాలవ్యవధిలో ఈ సబ్‌స్క్రిప్షన్ ప్యాకేజీని అందిస్తోంది.

సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్ ద్వారా Volkswagen Taigun: డీటేల్స్

కంపెనీ సేవల్లో భాగంగా, 100 సాతం ఆన్-రోడ్ ఫైనాన్సింగ్, పీరియాడిక్ మెయింటినెన్స్, భీమా కవర్ మరియు కస్టమర్ సౌలభ్యం మేరకు కారును అప్‌గ్రేడ్ చేయడానికి లేదా తిరిగి కంపెనీకి ఇచ్చేసే అవకాశాలను కల్పిస్తుంది. ప్రస్తుతం, ఫోక్స్‌వ్యాగన్ సబ్‌స్క్రిప్షన్ సేవలు ఢిల్లీ ఎన్‌సిఆర్, ముంబై, పూణే, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై మరియు హైదరాబాద్‌ లలోని 30 ఫోక్స్‌వ్యాగన్ అవుట్‌లెట్లలో అందుబాటులో ఉన్నాయి.

సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్ ద్వారా Volkswagen Taigun: డీటేల్స్

ఫోక్స్‌వ్యాగన్ ఇండియా సెప్టెంబర్ 23, 2021వ తేదీన కొత్త టైగన్ ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో ఈ కారు ధరలు రూ. 10.50 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి రూ. 17.50 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యంలో ఉన్నాయి. కంపెనీ ఈ ఎస్‌యూవీని మొత్తం నాలుగు వేరియంట్లు, ఐదు కలర్లు మరియు రెండు ఇంజన్ ఆప్షన్లతో అందిస్తోంది.

సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్ ద్వారా Volkswagen Taigun: డీటేల్స్

టైగన్ ఎస్‌యూవీని కంపెనీ భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన MQB-A0-IN ప్లాట్‌ఫామ్‌ ఆధారంగా రూపొందించింది. ఇందులో ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డిఆర్ఎల్ లతో కూడిన ఎల్ఈడి మ్యాట్రిక్స్ హెడ్‌ల్యాంప్‌లు, ఫ్రంట్ బంపర్‌లో ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్‌లు, బ్లాక్డ్ అవుట్ హనీకోంబ్ గ్రిల్, బానెట్‌పై మజిక్యులర్ లైన్స్ మరియు వీల్ ఆర్చెస్, కారు చుట్టూ ప్లాస్టిక్ క్లాడింగ్ మరియు 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్ ద్వారా Volkswagen Taigun: డీటేల్స్

కారు వెనుక భాగంలో వాలుగా ఉండే రియర్ విండ్‌షీల్డ్, దాని పైభాగంలో అమర్చిన రూఫ్ స్పాయిలర్ మరియు షార్క్ ఫిన్ యాంటెన్నా, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ మరియు రెండు టెయిల్ ల్యాంప్స్ ను కలుపుతూ పోయే సన్నటి ఎల్ఈడి లైట్‌బార్, క్రోమ్ గార్నిష్, బ్లాక్ కలర్ రూఫ్, డ్యూయల్ టోన్ సైడ్ మిర్రర్స్, బ్లాక్డ్ అవుట్ బి పిల్లర్స్ మరియు బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ వంటి ఎక్స్టీరియర్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్ ద్వారా Volkswagen Taigun: డీటేల్స్

ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఈ కారులో 8.0 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, రియర్ ఏసి వెంట్స్, ఫ్రంట్ అండ్ రియర్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ పోర్ట్‌లు, కప్‌హోల్డర్‌లతో కూడిన సెంట్రల్ ఆర్మ్‌రెస్ట్, క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, రెడ్ యాంబియంట్ లైటింగ్ మరియు స్మార్ట్ టచ్ క్లైమాట్రానిక్ ఆటో ఏసి వంటి ఫీచర్లు ఉన్నాయి.

సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్ ద్వారా Volkswagen Taigun: డీటేల్స్

ఇక సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీలో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ డిఫ్లేటింగ్ వార్నింగ్, పార్క్ డిస్టెన్స్ కంట్రోల్, రియర్ వ్యూ కెమెరా, హిల్ హోల్డ్ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగులు, ఏబిఎస్ విత్ ఈబిడి మరియు ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ మొదలైనవి ఉన్నాయి.

సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్ ద్వారా Volkswagen Taigun: డీటేల్స్

ఇక చివరగా, టైగన్ ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, స్కోడా కుషాక్ మాదిరిగానే కుడా ఇది కూడా రెండు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో మొదటిది 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, ఈ ఇంజన్ 113 బిహెచ్‌పి పవర్ ను మరియు 175 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్ ద్వారా Volkswagen Taigun: డీటేల్స్

ఇకపోతే, రెండవ ఇంజన్ ఆప్షన్ 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ 148 బిహెచ్‌పి పవర్ ను మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ ఆటోమేటిక్ మరియు 7 స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. ఇందులోని జిటి వేరియంట్లలో 1.5 లీటర్ ఇంజన్ స్టాండర్డ్ గా లభిస్తుంది.

Most Read Articles

English summary
Volkswagen taigun now available with monthly subscription program details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X