టెస్టింగ్ దశలో ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీ; జిటి వేరియంట్ ఖరారు!

జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ గడచిన మార్చి నెలలో ఆవిష్కరించిన టైగన్ ఎస్‌యూవీ త్వరలోనే మార్కెట్లో విడుదల కానుంది. తాజాగా ఈ మోడల్ టెస్టింగ్ దశలో ఉండగా కెమెరాకు చిక్కింది. ఎలాంటి క్యామోఫ్లేజ్ లేకుండా ఈ మోడల్‌ను పరీక్షించడాన్ని చూస్తుంటే, అతి త్వరలోనే ఇది కస్టమర్లకు అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

టెస్టింగ్ దశలో ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీ; జిటి వేరియంట్ ఖరారు!

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, తాజాగా పరీక్ష దశలో కెమెరాకు చిక్కిన మోడల్ టైగన్ యొక్క పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ వేరియంట్ జిటి అని తెలుస్తోంది. ఫోక్స్‌వ్యాగన్ సంస్థ ఈ ఎస్‌యూవీని ఈ ఏడాది పండుగ సీజన్ కంటే ముందే భారత మార్కెట్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది.

టెస్టింగ్ దశలో ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీ; జిటి వేరియంట్ ఖరారు!

స్టాండర్డ్ వేరియంట్‌తో పోల్చుకుంటే ఈ జిటి వేరియంట్ ఫోక్స్‌వ్యాగన్ టైగన్‌లో స్వల్ప కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ ఉంటాయి. ఈ స్పై చిత్రాలలో టైగన్ జిటి మోడల్ వెనుక చిత్రాలను గమనించవచ్చు. దీని వెనుక వైపు జిటి జిటి బ్యాడ్జ్‌తో పాటుగా స్మోక్డ్ ఎల్‌ఇడి టెయిల్ ల్యాంప్స్‌ను ఇందులో చూడొచ్చు.

MOST READ:సైకిల్ దొంగిలించిన బాలుడికి షాకింగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన పోలీసులు!

టెస్టింగ్ దశలో ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీ; జిటి వేరియంట్ ఖరారు!

ఈ ఎస్‌యూవీ స్కిడ్ ప్లేట్ పై భాగంలో ప్రీమియం అప్పీల్ కోసం క్రోమ్ బార్‌ను జోడించారు. ఫోక్స్‌వ్యాగన్ టైగన్ జిటిలో బాడీ కలర్ రూఫ్ రైల్ మరియు బ్లాక్ షార్క్ ఫిన్ యాంటెన్నా కూడా ఉన్నాయి. చిన్నపాటి మార్పుల మినహా ఈ జిటి మోడల్ మొత్తం చూడటానికి దాని రెగ్యులర్ స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే కనిపిస్తుంది.

టెస్టింగ్ దశలో ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీ; జిటి వేరియంట్ ఖరారు!

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఫ్రంట్ డిజైన్‌ను గమనిస్తే, ఇందులో ముందు వైపు క్రోమ్ ప్లేట్‌తో కూడిన పెద్ద గ్రిల్, ఎల్ఈడి డిఆర్ఎల్స్‌తో కూడిన హెడ్‌లాంప్స్, 17 ఇంచ్ డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్, వెనుక భాగంలో టైగన్ బూట్ లిడ్ పొడవు అంతటా నడిచే పెద్ద లైట్ బార్ మరియు ఈ లైట్ బార్‌లో విలీనం చేసినట్లుగా ఉండే ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్, వాటి మధ్యలో ఫోక్స్‌వ్యాగన్ బ్యాడ్జ్ మొదలైనవి ఉన్నాయి.

MOST READ:పెరిగిన టీవీఎస్ జూపిటర్, జెస్ట్, స్కూటీ పెప్, ఎన్‌టార్క్ 125 స్కూటర్ల ధరలు

టెస్టింగ్ దశలో ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీ; జిటి వేరియంట్ ఖరారు!

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఇంటీరియర్స్‌లో ప్రీమియం లుకింగ్ క్యాబిన్ లేఅవుట్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 12.3 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్ మరియు లేటెస్ట్ కార్ కనెక్ట్ టెక్నాలజీ మొదలైన ఫీచర్లు ఉండనున్నాయి.

టెస్టింగ్ దశలో ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీ; జిటి వేరియంట్ ఖరారు!

ఇక ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, ఫోక్స్‌వ్యాగన్ అనుబంధ సంస్థ స్కొడా భారత్ కోసం రెడీ చేసిన కుషాక్ ఎస్‌యూవీలో ఉపయోగించిన ఇంజన్లనే ఈ టైగన్ ఎస్‌యూవీలోనూ ఉపయోగించే అవకాశం ఉంది. ఇందులో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మరియు 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. ఇవి 6 స్పీడ్ మాన్యువల్ మరియు 7 స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ ఆప్షన్లతో రానున్నాయి.

MOST READ:విమానాలపై పక్షులు ఎందుకు దాడి చేస్తాయి.. వాటిని ఎలా నివారిస్తారు..మీకు తెలుసా?

టెస్టింగ్ దశలో ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీ; జిటి వేరియంట్ ఖరారు!

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఈ ఏడాది ద్వితీయార్థంలో భారత మార్కెట్లో విడుదల కానుంది. అత్యంత పోటీతో కూడుకున్న మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో విడుదల కానున్న టైగన్ ఎస్‌యూవీ ఫోక్స్‌వ్యాగన్ సంస్థకు ఒక ముఖ్యమైన మోడల్‌గా మారనుంది. ఇది ఈ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి ఎస్-క్రాస్ మరియు త్వరలో రానున్న స్కొడా కుషాక్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Source: Team BHP

Most Read Articles

English summary
Volkswagen Taigun Spied Testing In India, GT Variant Confirmed. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X