ఫోక్స్‌వ్యాగన్ టైగన్ టెలివిజన్ కమర్షియల్ విడుదల; త్వరలోనే కార్ లాంచ్!

జర్మన్ కార్ బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్ గడచిన మార్చి నెలలో ఆవిష్కరించిన టైగన్ ఎస్‌యూవీకి సంబంధించి కంపెనీ తాజాగా ఓ టెలివిజన్ కమర్షియల్‌ను విడుదల చేసింది. ఈ ఎస్‌యూవీ అతి త్వరలోనే భారత మార్కెట్లో విడుదల కానుంది.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ టెలివిజన్ కమర్షియల్ విడుదల; త్వరలోనే కార్ లాంచ్!

ఫోక్స్‌వ్యాగన్ తమ టైగన్ కాన్సెప్ట్ ఎస్‌యూవీని తొలిసారిగా 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచింది. ఇటీవలే ఈ ఎస్‌యూవీకి సంబంధించిన అఫీషియల్ చిత్రాలను వెల్లడించిన ఫోక్స్‌వ్యాగన్, ఇప్పుడు కొత్త టివిసిని విడుదల చేసింది.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ టెలివిజన్ కమర్షియల్ విడుదల; త్వరలోనే కార్ లాంచ్!

దాదాపు 30 సెకన్ల నిడివి గల ఈ టీజర్ వీడియోలో కంపెనీ తమ సరికొత్త టైగన్ ఎస్‌యూవీని అనేక కోణాల్లో చూపించింది. ఈ టీజర్ మొత్తం కారు యొక్క ఎక్స్టీరియర్ డిజైన్‌ను హైలైట్ చేస్తుంది. ఇందులో కారు ఫ్రంట్, సైడ్ మరియు టెయిల్ విభాగాన్ని చూపించారు.

MOST READ:ఫ్యాన్సీ నెంబర్ కల్చర్‌కి బ్రేక్ వేసిన గవర్నమెంట్; ఎక్కడో తెలుసా?

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ టెలివిజన్ కమర్షియల్ విడుదల; త్వరలోనే కార్ లాంచ్!

ఈ టీజర్ వీడియోలో కారు ముందు భాగంలో 'జిటి' బ్యాడ్జ్‌ను కూడా మవం చూడొచ్చు. సమాచారం ప్రకారం, యాడ్‌లో కనిపించిన ఈ మోడల్ టైగన్ యొక్క టాప్-ఎండ్ వేరియంట్‌గా తెలుస్తోంది. ఇందులో జిటి బ్యాడ్జ్ దాని స్పోర్ట్ వెర్షన్‌ను సూచిస్తుంది.

స్టాండర్డ్ వేరియంట్ టైగన్‌తో పోల్చుకుంటే ఈ జిటి వేరియంట్ ఫోక్స్‌వ్యాగన్ టైగన్‌లో స్వల్ప కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో వెనుక వైపు జిటి జిటి బ్యాడ్జ్‌తో పాటుగా స్మోక్డ్ ఎల్‌ఇడి టెయిల్ ల్యాంప్స్‌ ఉన్నాయి.

MOST READ:కొత్త కారు కొన్న కన్నడ సీరియల్ యాక్టర్ భరత్ బోపన్న.. పూర్తి వివరాలు

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ టెలివిజన్ కమర్షియల్ విడుదల; త్వరలోనే కార్ లాంచ్!

ఈ ఎస్‌యూవీ స్కిడ్ ప్లేట్ పై భాగంలో ప్రీమియం అప్పీల్ కోసం క్రోమ్ బార్‌ను జోడించారు. ఫోక్స్‌వ్యాగన్ టైగన్ జిటిలో బాడీ కలర్ రూఫ్ రైల్ మరియు బ్లాక్ షార్క్ ఫిన్ యాంటెన్నా కూడా ఉన్నాయి. చిన్నపాటి మార్పుల మినహా ఈ జిటి మోడల్ మొత్తం చూడటానికి దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే కనిపిస్తుంది.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ టెలివిజన్ కమర్షియల్ విడుదల; త్వరలోనే కార్ లాంచ్!

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఫ్రంట్ డిజైన్‌లో క్రోమ్ ప్లేట్‌తో కూడిన పెద్ద గ్రిల్, ఎల్ఈడి డిఆర్ఎల్స్‌తో కూడిన హెడ్‌లాంప్స్, 17 ఇంచ్ డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్, వెనుక భాగంలో టైగన్ బూట్ లిడ్ పొడవు అంతటా నడిచే పెద్ద లైట్ బార్ మరియు ఈ లైట్ బార్‌లో విలీనం చేసినట్లుగా ఉండే ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్, వాటి మధ్యలో ఫోక్స్‌వ్యాగన్ బ్యాడ్జ్ మొదలైనవి ఉన్నాయి.

MOST READ:సమంత మనసు ఆకాశమంత.. దీనికి ఇదే నిలువెత్తు నిదర్శనం

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ టెలివిజన్ కమర్షియల్ విడుదల; త్వరలోనే కార్ లాంచ్!

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఇంటీరియర్స్‌లో ప్రీమియం లుకింగ్ క్యాబిన్ లేఅవుట్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 12.3 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్ మరియు లేటెస్ట్ కార్ కనెక్ట్ టెక్నాలజీ మొదలైన ఫీచర్లు ఉండనున్నాయి.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ టెలివిజన్ కమర్షియల్ విడుదల; త్వరలోనే కార్ లాంచ్!

ఇక ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, ఫోక్స్‌వ్యాగన్ అనుబంధ సంస్థ స్కొడా భారత్ కోసం రెడీ చేసిన కుషాక్ ఎస్‌యూవీలో ఉపయోగించిన ఇంజన్లనే ఈ టైగన్ ఎస్‌యూవీలోనూ ఉపయోగించే అవకాశం ఉంది. ఇందులో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మరియు 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. ఇవి 6 స్పీడ్ మాన్యువల్ మరియు 7 స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ ఆప్షన్లతో రానున్నాయి.

MOST READ:భారత్‌లో అక్కడ కరోనా లాక్‌డౌన్ స్టార్ట్; కఠినమైన రూల్స్, వీటికి మాత్రమే మినహాయింపు

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ టెలివిజన్ కమర్షియల్ విడుదల; త్వరలోనే కార్ లాంచ్!

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఈ ఏడాది ద్వితీయార్థంలో భారత మార్కెట్లో విడుదల కానుంది. అత్యంత పోటీతో కూడుకున్న మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో విడుదల కానున్న టైగన్ ఎస్‌యూవీ ఫోక్స్‌వ్యాగన్ సంస్థకు ఒక ముఖ్యమైన మోడల్‌గా మారనుంది. ఇది ఈ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి ఎస్-క్రాస్ మరియు త్వరలో రానున్న స్కొడా కుషాక్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Volkswagen Taigun TVC Released Ahead Of Official Launch, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X