భారత మార్కెట్లో Volkswagen Tiguan Allspace డిస్‌కంటిన్యూ; కొత్త మోడల్ వస్తున్నందుకేనా..!?

జర్మన్ కార్ బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) గత మార్చ్ 2020 లో భారత మార్కెట్లో విడుదల చేసిన ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ (Volkswagen Tiguan Allspace) ప్రీమియం 7 సీటర్ ఎస్‌యూవీని కంపెనీ ఇక్కడి మార్కెట్లో డిస్‌కంటిన్యూ చేసింది. అయితే, గుడ్‌న్యూస్ ఏంటంటే, డిసెంబర్ 7వ తేదీన ఫోక్స్‌వ్యాగన్ తమ సరికొత్త టిగువాన్ ఎస్‌యూవీని 5 సీటర్ వెర్షన్ గా పరిచయం చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ కొత్త మోడల్ వస్తున్న నేపథ్యంలో, కంపెనీ తమ పాత మరియు ఖరీదైన 7-సీటర్ టిగువాన్ ఆల్‌స్పేస్ నుండి మార్కెట్ నుండి తొలగించిందని భావిస్తున్నారు.

భారత మార్కెట్లో Volkswagen Tiguan Allspace డిస్‌కంటిన్యూ; కొత్త మోడల్ వస్తున్నందుకేనా..!?

కొత్తగా మార్కెట్లో విడుదల కాబోయే 2021 టిగువాన్ ఫేస్‌లిఫ్ట్ (New Tiguan Facelift) 5-సీటర్ ఎస్‌యూవీ ఇదివరకటి 7-సీటర్ టిగువాన్ ఆల్‌స్పేస్ స్థానాన్ని భర్తీ చేయనుంది. అంతేకాకుండా, ఇది దాని కన్నా మరింత సరసమైన ధరకే అందుబాటులోకి రావచ్చని కూడా తెలుస్తోంది. గతంలో కంపెనీ ఈ 7-సీటర్ టిగువాన్ ఆల్‌స్పేస్ ఎస్‌యూవీని సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్ లో ఇండియాకు దిగుమతి చేసుకొని విక్రయించేది, ఫలితంగా అధిక దిగుమతి సుంఖాల కారణంగా దాని ధర కూడా అధికంగా ఉండేది.

భారత మార్కెట్లో Volkswagen Tiguan Allspace డిస్‌కంటిన్యూ; కొత్త మోడల్ వస్తున్నందుకేనా..!?

కాగా, ఇప్పుడు ఈ 5-సీటర్ మోడల్ టిగువాన్ ఎస్‌యూవీని ఫోక్స్‌వ్యాగన్ భారతదేశంలోనే స్థానికంగా అసెంబుల్ చేయనుంది. గత 2020 లో Volkswagen Tiguan Allspace మార్కెట్లోకి వచ్చినప్పుడు దాని ప్రారంభ ధర రూ. 34.20 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉండేది. అయితే, ఇది అధిక ధరకు తగినట్లుగా అద్భుతమైన క్యాబిన్ స్పేస్ మరియు ఫీచర్లను కలిగి ఉండేది. కొత్త టిగువాన్ ఫేస్‌లిఫ్ట్ 5-సీటర్ తో పాటుగా కొత్త టిగువాన్ ఆల్‌స్పేస్ 7-సీటర్ కూడా వస్తుందని భావించారు. అయితే, ఈ దశలో కంపెనీ ప్రస్తుతానికి కేవలం 5-సీటర్ వెర్షన్ ను మాత్రమే ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

భారత మార్కెట్లో Volkswagen Tiguan Allspace డిస్‌కంటిన్యూ; కొత్త మోడల్ వస్తున్నందుకేనా..!?

అంతర్జాతీయ మార్కెట్లోల లభిస్తున్న 2021 ఫేస్‌లిఫ్టెడ్ ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్‌లో కంపెనీ కొన్ని కీలకమైన డిజైన్ అప్‌గ్రేడ్స్ చేసింది. ఇందులో కొత్త షార్ప్ హెడ్‌ల్యాంప్స్, గుండ్రటి లోగోతో విభజించబడిన ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లు, సరికొత్త ఫ్రంట్ గ్రిల్ ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. కొత్త టిగువాన్ ఆల్‌స్పేస్ హెడ్ లైట్ల కోసం ఫోక్స్‌వ్యాగన్ యొక్క ఐక్యూ లైటింగ్ టెక్నాలజీని ఈ కారులో ఉపయోగించారు. ఈ టెక్నాలజీ వలన ఎదురుగా వస్తున్న వాహనాలపై ఎక్కువ కాంతి ప్రభావాన్ని చూపకుండా ఉండేలా, హైబీమ్ లైట్లను ఉపయోగించేందుకు సహకరిస్తుంది.

భారత మార్కెట్లో Volkswagen Tiguan Allspace డిస్‌కంటిన్యూ; కొత్త మోడల్ వస్తున్నందుకేనా..!?

టిగువాన్ ఆల్‌స్పేస్ సైడ్ ప్రొఫైల్ లో కొత్తగా 17 ఇంచ్ నుండి 20 ఇంచ్ వరకూ వివిధ రకాల అల్లాయ్ వీల్స్ అందుబాటులో ఉంటాయి, ఈ ఎస్‌యూవీ వెనుక డిజైన్‌లో కూడా కొత్త రివైజ్డ్ బంపర్ మరియు కొత్త టెయిల్ లాంప్స్‌ను గమనించవచ్చు. ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే, పాత మోడల్‌కి ఈ కొత్త మోడల్‌కి మధ్య సూక్ష్మమైన మార్పులు ఉన్నాయి. ఇందులో కొత్త స్టీరింగ్ వీల్, ఫోక్స్‌వ్యాగన్ యొక్క ఎమ్ఐబి3 మల్టీమీడియా సిస్టమ్, పెద్ద పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద 10.25 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు టెంపరేచర్స్‌ని కంట్రోల్ చేయటానికి టచ్ సెన్సిటివ్ స్క్రోల్ ప్యాడ్ మొదలైనవి ఉంటాయి.

భారత మార్కెట్లో Volkswagen Tiguan Allspace డిస్‌కంటిన్యూ; కొత్త మోడల్ వస్తున్నందుకేనా..!?

అప్‌డేటెడ్ ఫీచర్లలో భాగంగా, కొత్త 2021 టిగువాన్ ఆల్‌స్పేస్‌లో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, పవర్డ్ డ్రైవర్ సీట్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, 30-కలర్ యాంబియంట్ లైటింగ్, పవర్డ్ టెయిల్ గేట్ మరియు స్లైడింగ్ సెకండ్-రో సీట్స్ వంటి మరిన్ని అదనపు ఫీచర్లను కూడా ఉంటాయి. అలాగే, ఈ కారులో ఆఫర్ చేయబోయే కొన్ని సేఫ్టీ ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగులు, ఏబిఎస్ విత్ ఇబిడి, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, డ్రైవర్ అలర్ట్ సిస్టమ్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి. ఇన్ని ఆసక్తికరమైన ఫీచర్లు ఉన్నప్పటికీ, అధిక ధర మరియు తక్కువ సేల్స్ కారణంగా కంపెనీ ఈ సిబియూ మోడల్ అమ్మకాలని నిలిపివేసినట్లుగా తెలుస్తోంది.

భారత మార్కెట్లో Volkswagen Tiguan Allspace డిస్‌కంటిన్యూ; కొత్త మోడల్ వస్తున్నందుకేనా..!?

డిసెంబర్ 7న కొత్త 2021 Volkswagen Tiguan ఫేస్‌లిఫ్ట్ లాంచ్..

ఇదిలా ఉంటే, ఫోక్స్‌వ్యాగన్ తమ కొత్త 2021 టిగువాన్ ఫేస్‌లిఫ్ట్ (New Volkswagen Tiguan Facelift) మోడల్‌ను డిసెంబర్ 7, 2021వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ఇప్పటికే ఈ కొత్త కారును తమ అధికారిక భారతీయ వెబ్‌సైట్ లో కూడా లిస్ట్ చేసింది మరియు ఆసక్తి ఉన్న కస్టమర్ల నుండి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లను కూడా స్వీకరిస్తోంది. ఫోక్స్‌వ్యాగన్ బ్రాండ్ యొక్క 'ఇండియా 2.0' స్ట్రాటజీలో భాగంగా, కంపెనీ ఈ ఫేస్‌లిఫ్టెడ్ 5-సీటర్ టిగువాన్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టనుంది.

భారత మార్కెట్లో Volkswagen Tiguan Allspace డిస్‌కంటిన్యూ; కొత్త మోడల్ వస్తున్నందుకేనా..!?

ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ టిగువాన్ 5-సీటర్ మోడల్ ఇప్పటికే పలు అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకానికి అందుబాటులో ఉంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా, ఇది భారతదేశంలో విడుదల కావడం ఆలస్యమైంది. ఫోక్స్‌వ్యాగన్ భారతదేశంలో కొత్తగా 4 ఎస్‌యూవీలను ప్రవేశపెట్టనున్నట్లు గతంలో వెల్లడించిన సంగతి తెలిసినదే. వీటిలో ఇప్పటికే సరికొత్త టైగన్ ఎస్‌యూవీ విడుదల కాగా, తాజాగా 2021 టిగువాన్ ఫేస్‌లిఫ్ట్ విడుదల కాబాతోంది. మిగిలిన రెండు ఎస్‌యూవీ మోడళ్లలో కొత్త తరం టి-రోక్ మరియు టిగువాన్ ఆల్‌స్పేస్ 7-సీటర్ ఎస్‌యూవీలు ఉండొచ్చని భావిస్తున్నారు.

భారత మార్కెట్లో Volkswagen Tiguan Allspace డిస్‌కంటిన్యూ; కొత్త మోడల్ వస్తున్నందుకేనా..!?

ఈ జర్మన్ బ్రాండ్ నుండి వస్తున్న కొత్త 2021 టిగువాన్ ఫేస్‌లిఫ్ట్ 5-సీటర్ ఎస్‌యూవీ, భారతదేశంలోని మిడ్-సైజ్ ప్రీమియం ఎస్‌యయూవీ విభాగంలో విడుదల కానుంది. ఇది ఈ విభాగంలో కొత్తగా రాబోయే ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ జీప్ కంపాస్, హ్యుందాయ్ టక్సన్ మరియు సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. - ఈ ఎస్‌యూవీలో చేసిన మార్పులకు సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Volkswagen tiguan allspace suv discontinued in india details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X