ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ మరియు టిగువాన్ ఎస్‌యూవీలు మళ్ళీ వస్తున్నాయ్..

ఫోక్స్‌వ్యాగన్ ఇండియా, దేశీయ మార్కెట్లో తన ప్రస్తుత వాహన పోర్ట్‌ఫోలియోను విస్తరించనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న మోడళ్లకు అదనంగా, టి-రోక్ ఎస్‌యూవీతో మరిన్ని కొత్త మోడళ్లను జోడించనున్నట్లు కంపెనీ తెలిపింది.

ఫోక్స్‌వ్యాగన్ టి-రోక్ మరియు టిగువాన్ ఎస్‌యూవీలు మళ్ళీ వస్తున్నాయ్..

భారతదేశంలో ఫోక్స్‌వ్యాగన్ టి-రోక్ ఎస్‌యూవీ యొక్క మొదటి బ్యాచ్ ఇప్పటికే పూర్తిగా అమ్ముడైపోయిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, ఈ మోడల్ రెండ బ్యాచ్‌ను ప్రారంభించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. టి-రోక్‌ను పూర్తిగా విదేశాల్లో తయారు చేసి, ఇక్కడి మార్కెట్లో దిగుమతి చేసుకుంటున్నారు.

ఫోక్స్‌వ్యాగన్ టి-రోక్ మరియు టిగువాన్ ఎస్‌యూవీలు మళ్ళీ వస్తున్నాయ్..

గతేడాది భారత మార్కెట్లో విడుదలైన ఫోక్స్‌వ్యాగన్ టి-రోక్ మొదటి బ్యాచ్‌లో భాగంగా, కంపెనీ 1,000 యూనిట్లను దేశీయ మార్కెట్లోకి దిగుమతి చేసుకుంది. ఈ మోడల్‌కి మార్కెట్ నుండి అద్భుతమైన స్పందన రావడంతో, ఈ ఎస్‌యూవీని ప్రారంభించిన కొన్ని నెలల్లోనే అన్ని యూనిట్లు అమ్ముడైపోయాయి.

MOST READ:ఈ ఏడాది భారత్‌లో లాంచ్ కానున్న టాప్ 5 కార్లు : వివరాలు

ఫోక్స్‌వ్యాగన్ టి-రోక్ మరియు టిగువాన్ ఎస్‌యూవీలు మళ్ళీ వస్తున్నాయ్..

కాగా, ఇప్పుడు భారత మార్కెట్లో ఈ ఎస్‌యూవీని రీస్టాక్ చేయనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. ఇది మునుపటిలాగే సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్‌లో దేశానికి దిగుమతి కానుంది. ఒకవేళ కంపెనీ ఈ మోడల్‌ను స్థానికంగా అసెంబుల్ చేయాలనుకుంటే, సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) రూట్‌లో విడిభాగాలను భారత్‌కు దిగుమతి చేసుకొనే అవకాశం ఉంది.

ఫోక్స్‌వ్యాగన్ టి-రోక్ మరియు టిగువాన్ ఎస్‌యూవీలు మళ్ళీ వస్తున్నాయ్..

ఫోక్స్‌వ్యాగన్ టి-రోక్ ఎస్‌యూవీ ఒకే ఇంజన్ మరియు ఒకే ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో ఒకే ఒక్క వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. మార్కెట్లో ఈ ఎస్‌యూవీ ధర రూ .19.99 లక్షలు, ఎక్స్‌షోరూమ్ (ఇండియా)గా ఉంది.

MOST READ:ముఖేష్ అంబానీ సెక్యూరిటీలో చేరిన 4 కొత్త కార్లు.. ఒక్కక్కటి 2 కోట్లకు పైమాటే

ఫోక్స్‌వ్యాగన్ టి-రోక్ మరియు టిగువాన్ ఎస్‌యూవీలు మళ్ళీ వస్తున్నాయ్..

ఈ ఎస్‌యూవీలో పవర్‌ఫుల్ 1.5 లీటర్ టిఎస్‌ఐ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 148 బిహెచ్‌పి పవర్‌ను మరియు 240 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ సెవన్-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

ఫోక్స్‌వ్యాగన్ టి-రోక్ కేవలం 8.4 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కి.మీ వేగాన్ని చేరుకోగలదు. దీని గరిష్టం వేగం గంటకు 205 కిలోమీటర్లుగా ఉంటుందని ఫోక్స్‌వ్యాగన్ పేర్కొంది.

ఫోక్స్‌వ్యాగన్ టి-రోక్ మరియు టిగువాన్ ఎస్‌యూవీలు మళ్ళీ వస్తున్నాయ్..

ఇకపోతే, ఫోక్స్‌వ్యాగన్ టి-రోక్‌తో పాటుగా, 5-సీటర్ వెర్షన్ ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‌యూవీని కూడా సరికొత్త ఇంజన్‌తో తిరిగి భారత మార్కెట్లో ప్రారంభించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఫేస్‌లిఫ్టెడ్ 2021 ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్‌ను గతేడాది అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఫోక్స్‌వ్యాగన్ టి-రోక్ ఎస్‌యూవీ మరియు ఫేస్‌లిఫ్టెడ్ టిగువాన్ భారత్‌లో విడుదల కావచ్చని అంచనా.

MOST READ:సైనికుల కోసం బుల్లెట్ బైక్‌లనే మొబైల్ అంబులెన్స్‌లుగా మార్చేశారు..

ఫోక్స్‌వ్యాగన్ టి-రోక్ మరియు టిగువాన్ ఎస్‌యూవీలు మళ్ళీ వస్తున్నాయ్..

ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ కొత్త ఫ్రంట్ మరియు రియర్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో హెడ్‌లైట్ క్లస్టర్‌తో విలీనం అయ్యే రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్ ఉంటుంది, ఇది చూడటానికి గోల్ఫ్ 8 మోడల్‌లో కనిపించినట్లుగా ఉంటుంది. ఇంకా ఇందులో కొత్త హెడ్‌ల్యాంప్ సెటప్, కొత్త అల్లాయ్ వీల్స్ డిజైన్ వంటి మార్పులు కూడా ఉండనున్నాయి.

ఫోక్స్‌వ్యాగన్ టి-రోక్ మరియు టిగువాన్ ఎస్‌యూవీలు మళ్ళీ వస్తున్నాయ్..

ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ధరను అందుబాటులో ఉంచేందుకు గానూ దీనిని కేవలం ఫ్రంట్-వీల్-డ్రైవ్ వేరియంట్‌గానే విడుదల చేసే అవకాశం ఉంది. ఫేస్‌లిఫ్టెడ్ 5 సీటర్ ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‌యూవీని కూడా సిబియు మార్గంలో భారతదేశానికి తీసుకువచ్చే అవకాశం ఉంది. లేదంటే, ప్రత్యామ్నాయంగా దీనిని పూణేలోని కంపెనీ చాకన్ ప్లాంట్‌లో అసెంబ్లింగ్ చేసే సామర్థ్యం కూడా ఫోక్స్‌వ్యాగన్‌కి ఉంది.

MOST READ:కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు

ఫోక్స్‌వ్యాగన్ టి-రోక్ మరియు టిగువాన్ ఎస్‌యూవీలు మళ్ళీ వస్తున్నాయ్..

మునుపటి ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్‌లో 2.0-లీటర్ టిడిఐ ఇంజన్‌ను ఉపయోగించారు. అయితే, టి-రోక్ ఎస్‌యూవీలో ఉపయోగించే ఇంజన్ ఆప్షన్లనే కొత్త టిగువాన్ ఎస్‌యూవీలో కూడా ఆఫర్ చేయవచ్చని సమాచారం. ఈ కొత్త మోడల్‌లో 48వి హైబ్రిడ్ సిస్టమ్ కూడా ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

Most Read Articles

English summary
Volkswagen Plans To Bring Back The T-Roc And Tiguan SUVs To India Again, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X