భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..

ఫోక్స్‌వ్యాగన్ ఇండియా గతంలో ఇంపోర్టెడ్ మోడల్‌గా భారత మార్కెట్లో విక్రయించిన టి-రోక్ ఎస్‌యూవీని, తిరిగి దేశీయ విపణిలో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు కంపెనీ ఓ టీజర్‌ను కూడా విడుదల చేసింది.

భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..

కొత్త 2021 ఫోక్స్‌వ్యాగన్ టి-రోక్ ఎస్‌యూవీని కూడా సిబియు (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూపంలోనే ఇండియాకు దిగుమతి చేసుకొని విక్రయించనున్నారు. వెబ్‌సైట్‌లో ఈ మోడల్ ధర కూడా లీక్ అయ్యింది. దీని ఎక్స్ షోరూమ్ (ఇండియా) ధరను రూ.21.35 లక్షలకు కంపెనీ లిస్ట్ చేసింది.

భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..

అయితే, ఆ వెంటనే ఫోక్స్‌వ్యాగన్ ఇండియా తమ వెబ్‌సైట్ నుంచి ఈ ధరలను తొలగించి వేసింది. మునుపటి మోడల్‌తో పోలిస్తే ఈ కొత్త 2021 మోడల్ టి-రోక్ ధర రూ.1.36 లక్షలు అధికంగా ఉంది. కాగా, ఈ ఎస్‌యూవీ కోసం దేశంలోని ఎంపిక చేసిన డీలర్లు బుకింగ్‌లను స్వీకరిస్తున్నారు.

భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..

కొత్త ధరల మినహా 2021 ఫోక్స్‌వ్యాగన్ టి-రోక్ ఎస్‌యూవీలో ఎటువంటి మార్పులు చేయలేదని తెలుస్తోంది. మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో వస్తున్న టి-రోక్ భారత మార్కెట్లో టిగువాన్ ఆల్-స్పేస్ మరియు కంపెనీ నుండి రాబోయే టైగన్ ఎస్‌యూవీల మధ్యలో విక్రయించనున్నారు.

భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..

ఫోక్స్‌వ్యాగన్ టి-రోక్ ఎస్‌యూవీ సింగిల్ ఇంజన్ మరియు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో లభిస్తుంది. ఇది ఒకే వేరియంట్లో ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో లభిస్తుంది. ఈ ఎస్‌యూవీలో 1.5 లీటర్ టిఎస్‌ఐ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 148 బిహెచ్‌పి పవర్‌ను మరియు 240 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..

ఈ ఇంజన్ సెవన్-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఫోక్స్‌వ్యాగన్ టి-రోక్ ఎస్‌యూవీ కేవలం 8.4 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కి.మీ వేగాన్ని చేరుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 205 కిలోమీటర్లుగా ఉంటుందని కంపెనీ పేర్కొంది.

భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..

ఫోక్స్‌వ్యాగన్ టి-రోక్ బోల్డ్ షోల్డర్ క్రీజ్ లైన్లతో అగ్రెసివ్ లుక్‌ని కలిగి ఉంటుంది. మోడ్రన్ డిజైన్ లాంగ్వేజ్‌తో తయారైన ఈ ఎస్‌యూవీలో ఇంటిగ్రేటెడ్ డిఆర్‌ఎల్‌లతో కూడిన ఎల్‌ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడి కార్నరింగ్ లైట్లు మరియు ఫాగ్ లాంప్స్, 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఫ్లేర్డ్ వీల్ ఆర్చెస్, ఎల్‌ఈడి టెయిల్ లైట్స్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్స్ మరియు రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..

కొత్త ఫోక్స్‌వ్యాగన్ టి-రోక్ ఇంటీరియర్స్‌లో 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్ మరియు 10.25 ఇంచ్ 'వర్చువల్ కాక్‌పిట్' డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..

ఇంకా ఇందులో లెథర్ అప్‌హోలెస్ట్రీ, పానరోమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబిడితో కూడిన ఏబిఎస్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..

గతేడాది మార్చి నెలలో ఫోక్స్‌వ్యాగన్ తమ టి-రోక్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. అప్పట్లో ఈ కారును రూ.19.99 లక్షల ఎక్స్-షోరూమ్ (ఇండియా) ధరతో విక్రయించారు. మొదటి బ్యాచ్‌లో భాగంగా కంపెనీ గతంలో 1,000 యూనిట్లను మాత్రమే భారత మార్కెట్లోకి దిగుమతి చేసుకుంది.

భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..

ఈ మోడల్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టిన మొదటి మూడు నెలల్లోనే పూర్తిగా 1,000 యూనిట్ల మొదటి బ్యాచ్ అమ్మకాలు పూర్తిగా అమ్ముడైపోయాయి. అయితే, పెరిగిన ధర కారణంగా కొత్త 2021 ఫోక్స్‌వ్యాగన్ టి-రోక్ ఎస్‌యూవీ అమ్మకాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.

Most Read Articles

English summary
Volkswagen To Re-launch New 2021 T-Roc In India; This Time It Will More Pricier Than Before! Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X