కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్: ఫోక్స్‌వ్యాగన్ వాహనాలపై సర్వీస్, వారంటీ పొడగింపు

భారతదేశంలో కోవిడ్-19 సెకండ్ వేవ్ కారణంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌లను దృష్టిలో ఉంచుకొని జర్మన్ కార్ బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్ తమ వాహనాలపై అందించే పెయిడ్ మరియ ఉచిత సర్వీస్‌లు, వారంటీ మరియు మెయింటినెన్స్ ప్యాకేజీల గడువును మరికొంత కాలం పొడగిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.

కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్: ఫోక్స్‌వ్యాగన్ వాహనాలపై సర్వీస్, వారంటీ పొడగింపు

ఈ లాక్‌డౌన్ సమయంలో ఏప్రిల్ 1, 2021వ తేదీ నుండి మే 31, 2021వ తేదీ మధ్యలో పైన పేర్కొన్న సేవలను వినియోగించుకోలేకపోయిన వినియోగదారుల కోసం వీటి గడువును జూన్ 30, 2021 వరకు పొడిగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ సమయంలో స్టాండర్డ్ వారంటీ మరియు రోడ్-సైడ్ అసిస్టెన్స్‌లను కూడా విస్తరిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.

కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్: ఫోక్స్‌వ్యాగన్ వాహనాలపై సర్వీస్, వారంటీ పొడగింపు

అదేవిధంగా, కంపెనీ అందించే ఎక్స్‌టెండెడ్ వారంటీ, పెయిడ్ సర్వీస్ వాల్యూ ప్యాకేజీలు మరియు ఆర్‌ఎస్‌ఎ సేవలను ఫోక్స్‌వ్యాగన్ ఇండియా పొడిగించింది. ఏప్రిల్ 1, 2021 నుండి మే 31, 2021 మధ్యలో గడువు ముగిసిన ప్యాకేజీలను ఇప్పుడు జూన్ 30, 2021 వరకు పొడిగించడం జరిగింది.

MOST READ:అవసరమైన వారికి ఉచితంగా ఆక్సిజన్ అందిస్తున్న 26 ఏళ్ల యువతి.. నిజంగా గ్రేట్ కదా..!

కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్: ఫోక్స్‌వ్యాగన్ వాహనాలపై సర్వీస్, వారంటీ పొడగింపు

స్టాండర్డ్ వారంటీకి అదనంగా కొనుగోలు చేసిన క్స్‌టెండెడ్ వారంటీ వ్యవధిని కూడా పొడిగించినట్లు కంపెనీ ప్రకటించింది. సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, "ఏప్రిల్ 2021 మరియు మే 2021 నెలల్లో తమ కారు యొక్క రెండు సంవత్సరాల వారంటీ పూర్తవుతున్న కస్టమర్, ఇప్పుడు ఆ వారంటీ వ్యవధిని జూన్ 30, 2021 వరకు ఉపయోగించుకోవచ్చు" అని పేర్కొంది.

కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్: ఫోక్స్‌వ్యాగన్ వాహనాలపై సర్వీస్, వారంటీ పొడగింపు

భారతదేశంలో కోవిడ్-19 వైరస్ సెకండ్ వేవ్ శరవేగంగా వ్యాపిస్తుండటంతో, ఈ వైరస్ సంక్రమణను కట్టడి చేసేందుకు దేశంలోని అనేక రాష్ట్రాలు స్వచ్ఛంగా లాక్‌డౌన్‌లను ప్రకటించడం ప్రారంభించాయి. కొన్ని రాష్ట్రాల్లో సంపూర్ణ లాక్‌డౌన్ కొనసాగుతుండగా మరికొన్ని రాష్ట్రాల్లో పాక్షిక లాక్‌డౌన్ అమలవుతోంది.

MOST READ:లాక్‌డౌన్ రూల్స్ గాలికొదిలేసిన ముఖ్యమంత్రి కొడుకు.. ఎవరో తెలుసా..?

కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్: ఫోక్స్‌వ్యాగన్ వాహనాలపై సర్వీస్, వారంటీ పొడగింపు

ఈ నేపథ్యంలో, దేశంలోని అనేక ఆటోమొబైల్ కంపెనీలు తమ ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకొని వాహనా తయారీ ప్లాంట్లను తాత్కాలికంగా మూసివేసి, ఉత్పత్తిని నిలిపిశాయి. మరికొన్ని ప్రాంతాల్లో కంపెనీ తమ కార్పొరేట్ కార్యాలయాలు, షోరూమ్‌లు మరియు సర్వీస్ సెంటర్లలో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించుకున్నాయి.

కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్: ఫోక్స్‌వ్యాగన్ వాహనాలపై సర్వీస్, వారంటీ పొడగింపు

స్థానికంగా అమలులో ఉన్న లాక్‌డౌన్ మార్గదర్శకాలకు అనుగుణంగా సర్వీస్ సెంటర్లు పనిచేస్తున్నాయి. కొంత సమయం మాత్రమే సర్వీస్ సెంటర్లను తెరచి ఉన్న కారణంగా, కస్టమర్లు తమ వాహనాలను సరైస గడువు సమయంలో లోపుగా సర్వీస్ చేయించుకోలేకపోతున్నారు. ఈ కారణంతో ఇప్పటికే అనేక కంపెనీలు తమ వాహనాలపై సర్వీస్ మరియు వారంటీలను పొడగిస్తూ వచ్చాయి.

MOST READ:మీకు తెలుసా.. భారతదేశంలో అత్యంత ఖరీదైన కాన్వాయ్‌ ఉపయోగిస్తున్న వ్యక్తి ఇతడే..

కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్: ఫోక్స్‌వ్యాగన్ వాహనాలపై సర్వీస్, వారంటీ పొడగింపు

తాజాగా, ఇప్పుడు ఫోక్స్‌వ్యాగన్ కూడా తమ వాహనాలపై సర్వీస్, వారంటీ వ్యవధిని జూన్ 30, 2021వ తేదీ వరకూ పొడగించింది. ఈ విపత్కర సమయంలో తమ వినియోగదారుల సౌలభ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ శ్రీ ఆశిష్ గుప్తా అన్నారు.

కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్: ఫోక్స్‌వ్యాగన్ వాహనాలపై సర్వీస్, వారంటీ పొడగింపు

కస్టమర్-సెంట్రిక్ బ్రాండ్‌గా, తాము తమ కస్టమర్ల భద్రతకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తామని, ఇందులో భాగంగానే, జూన్ 30, 2021వ తేదీ వరకు తమ సమగ్ర సేవలు మరియు వారెంటీలకు పొడిగింపును ప్రకటించామని ఆయన చెప్పారు. ఈ నిర్ణయం ద్వారా కస్టమర్లకు కొంతమేర మనశ్శాంతి లభిస్తుందని గుప్తా తెలిపారు.

ఇదిలా ఉంటే, భారతదేశంలో కోవిడ్-19పై పోరుకు గాను ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ 1 మిలియన్ యూరోలను భారత ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చింది.

MOST READ:ఆ గవర్నమెంట్ హాస్పిటల్ లో ఆక్సిజన్ బస్ సౌకర్యం కూడా.. ఎక్కడంటే?

Most Read Articles

English summary
Volkswagen Vehicles Warranty And Service Period Extended Due To Covid-19 Lockdown. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X