భారత్‌లో పెట్రోల్ మైల్డ్-హైబ్రిడ్ XC90 విడుదల చేసిన Volvo: ధర & వివరాలు

ప్రముఖ స్వీడిష్ కార్ల తయారీ సంస్థ వోల్వో (Volvo) దేశీయ విఫణిలో కొత్త వోల్వో ఎక్స్‌‌సి90 (Volvo XC90) ను అధికారికంగా విడుదల చేసింది. భారతీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త వోల్వో ఎక్స్‌‌సి90 ధర రూ. 89.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). వోల్వో ఎక్స్‌‌సి90 ఇప్పుడు పూర్తిగా కొత్త పెట్రోల్ మైల్డ్-హైబ్రిడ్ ఇంజన్‌తో విడుదలచేయబడింది. వోల్వో ఎక్స్‌‌సి90 గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో పెట్రోల్ మైల్డ్-హైబ్రిడ్ XC90 ని విడుదల చేసిన Volvo: ధర & వివరాలు

వోల్వో కంపెనీ ఇప్పుడు కొత్త ప్లాట్‌ఫారమ్ ఆధారంగా ఎక్స్‌‌సి90 ని ప్రారంభించింది. దేశీయ మార్కెట్లో అత్యధిక డిమాండ్ ఉన్న S90 మరియు XC90 మోడళ్ల యొక్క కొత్త వేరియంట్‌లతో లగ్జరీ కార్ల విక్రయాలు ఇప్పటికే ప్రారంభించబడ్డాయి. అయితే వాతావరణంలో పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని, కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నంలో డీజిల్ కార్ల అమ్మకాలను తగ్గించిన వోల్వో, ఇప్పుడు తన కార్లను కొత్త పెట్రోల్ హైబ్రిడ్ ఇంజన్‌గా అప్‌గ్రేడ్ చేస్తోంది.

భారత్‌లో పెట్రోల్ మైల్డ్-హైబ్రిడ్ XC90 ని విడుదల చేసిన Volvo: ధర & వివరాలు

ఇందులో భాగంగానే కొత్తగా విడుదలైన ఈ వోల్వో ఎక్స్‌‌సి90 మోడల్ లో కూడా 2.0 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్‌ను అందిస్తోంది. ఇప్పటికే చాలా కంపెనీలు పెట్రోల్ హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే విడుదల చేయడంతో 2022 నాటికి ఇతర కార్ మోడళ్లలో డీజిల్ ఇంజన్ ఎంపికలు కూడా పూర్తిగా నిలిపివేయబడే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

భారత్‌లో పెట్రోల్ మైల్డ్-హైబ్రిడ్ XC90 ని విడుదల చేసిన Volvo: ధర & వివరాలు

ఇప్పటికే హైబ్రిడ్ ఇంజన్ వాహనాల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న వోల్వో, 2023 నాటికి మొత్తం 6 కార్ మోడళ్లను హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ వేరియంట్లలో విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే కంపెనీ యొక్క కార్లు డీజిల్ ఇంజిన్లతో రావడం లేదు.

భారత్‌లో పెట్రోల్ మైల్డ్-హైబ్రిడ్ XC90 ని విడుదల చేసిన Volvo: ధర & వివరాలు

వోల్వో ఎక్స్‌‌సి90 ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇందులో రిఫ్రెష్ చేసిన ఫ్రంట్‌ డిజైన్ చూడవచ్చు. అంతే కాకుండా ఈ కొత్త కారులో ఆటోమేటెడ్ డ్రైవర్ అసిస్ట్ టెక్నాలజీని అందించారు. డ్రైవర్ అసిస్ట్ టెక్నాలజీ అడ్వాన్స్‌డ్ క్రూయిజ్ కంట్రోల్, లైన్ కిప్ అసిస్ట్, 360 డిగ్రీ కెమెరా, ఫ్రంట్ అండ్ రియర్ కోయలిషన్ అలర్ట్, క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, పార్క్ అసిస్ట్ వంటి అనేక ప్రీమియం ఫీచర్లను అందిస్తుంది.

భారత్‌లో పెట్రోల్ మైల్డ్-హైబ్రిడ్ XC90 ని విడుదల చేసిన Volvo: ధర & వివరాలు

అంతే కాకుండా ఇందులో టచ్ స్క్రీన్ ఇంటర్‌ఫేస్‌ కూడా అందుబాటులో ఉంటుంది, కావున ఫోన్ కాల్‌లకు సమాధానమివ్వడం ద్వారా సులభంగా టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను ఎనేబుల్ చేస్తుంది. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులోని క్యాబిన్ కూడా చాలా ఫ్రీమియం అనుభూతిని అందిస్తుంది. ఇందులోని క్యాబిన్ నాణ్యతను మెరుగుపరచడానికి వుడ్, క్రిస్టల్ యొక్క అధునాతన స్కాండినేవియన్ డిజైన్‌ను పిఎమ్ 2.5 ఎయిర్‌క్లియర్ టెక్నాలజీతో కలిపి ఇన్-కార్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్లికేషన్‌లను కూడా అందిస్తుంది.

భారత్‌లో పెట్రోల్ మైల్డ్-హైబ్రిడ్ XC90 ని విడుదల చేసిన Volvo: ధర & వివరాలు

కొత్త కారు 2.0-లీటర్ 48V మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ పెట్రోల్ ఇంజన్‌తో కూడిన ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో 8-స్పీడ్ ఆటో మేటిక్ గేర్‌బాక్స్ ద్వారా 296 బిహెచ్‌పి పవర్ మరియు 420 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మంచి పర్ఫామెన్స్ అందించే విధంగా తయారుచేయబడి ఉంటుంది. కావున ఇది మంచి లగ్జరీ అనుభూతిని అందిస్తుంది.

భారత్‌లో పెట్రోల్ మైల్డ్-హైబ్రిడ్ XC90 ని విడుదల చేసిన Volvo: ధర & వివరాలు

కొత్త 2021 వోల్వో ఎక్స్‌‌సి90 నాలుగు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి ఒనిక్స్ బ్లాక్, డెనిమా బ్లూ, పైన్ గ్రే మరియు వైట్ పెర్ల్ కలర్స్. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటాయి. వోల్వో ఎక్స్‌‌సి90 దేశీయ మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ జిఎల్ ఎస్, బిఎండబ్ల్యు ఎక్స్7 మరియు రేంజ్ రోవర్ వెలార్‌ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

భారత్‌లో పెట్రోల్ మైల్డ్-హైబ్రిడ్ XC90 ని విడుదల చేసిన Volvo: ధర & వివరాలు

వోల్వో కంపెనీ ఇప్పటికే తన ఫ్లాగ్‌షిప్ కార్ మోడళ్లలో డీజిల్ ఇంజిన్‌ను నిలిపివేసింది. కావున ప్రస్తుతం పెట్రోల్ మరియు హైబ్రిడ్ మోడళ్లను మాత్రమే మార్కెట్లో విక్రయిస్తోంది. డీజిల్ మరియు పెట్రోల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి అనేక ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.

భారత్‌లో పెట్రోల్ మైల్డ్-హైబ్రిడ్ XC90 ని విడుదల చేసిన Volvo: ధర & వివరాలు

నివేదికల ప్రకారం భారతదేశంతో సహా ప్రపంచంలోని ప్రధాన దేశాలు 2030 నాటికి పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్‌తో నడిచే వాహనాలను పూర్తిగా నిషేధించడానికి సిద్ధంగా ఉన్నాయి. డీజిల్ ఇంజిన్ వాహనాల వినియోగాన్ని పరిమితం చేయడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రాయితీలను కల్పిస్తున్నాయి. ఈ కారణంగా ఇటీవల కాలంలో దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహన వినియోగం పెరుగుతోంది. ఎక్కువమంది ప్రజలు ఎలక్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీన్ని బట్టి చూస్తే భవిష్యత్ లో ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే వినియోగంలో ఉంటాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు.

Most Read Articles

Read more on: #వోల్వో #volvo
English summary
Volvo launched the new petrol mild hybrid xc90 in india find here all other details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X