ఎక్స్‌యూవీ700 vs ఎక్స్‌యూవీ500: ఈ రెండింటిలో తేడాలు ఏంటి?

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవల తమ సరికొత్త ఎస్‌యూవీ 'ఎక్స్‌యూవీ700'ని భారత మార్కెట్లో ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. లేటెస్ట్ డిజైన్, అధునాతన టెక్నాలజీ మరియు అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లతో కంపెనీ ఈ కారుని రూపొందించింది.

ఎక్స్‌యూవీ700 vs ఎక్స్‌యూవీ500: ఈ రెండింటిలో తేడాలు ఏంటి?

మహీంద్రా ఎక్స్‌యూవీ500 మోడల్‌కి సక్సెసర్‌గా ఈ కొత్త ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని కంపెనీ ప్రవేశపెట్టినప్పటికీ, ఎక్స్‌యూవీ500 అమ్మకాలు మాత్రం అలానే కొనసాగుతాయని కంపెనీ తెలిపింది. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎక్స్‌యూవీ500 మోడల్‌కి మరియు లేటెస్ట్ ఎక్స్‌యూవీ700 మోడల్‌కి మద్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలు ఏంటో చూద్దాం రండి.

ఎక్స్‌యూవీ700 vs ఎక్స్‌యూవీ500: ఈ రెండింటిలో తేడాలు ఏంటి?

ఎక్స్‌యూవీ700 vs ఎక్స్‌యూవీ500: సైజ్ మరియు డిజైన్

మహీంద్రా ఎక్స్‌యూవీ700 సైజు విషయానికి వస్తే, దీని మొత్తం పొడవు 4,695 మిమీ, వెడల్పు 1,890 మిమీ, ఎత్తు 1,755 మిమీ మరియు వీల్‌బేస్ 2,750 మిమీగా ఉంటుంది. అలాగే, ఎక్స్‌యూవీ500 యొక్క పొడవు 4,585 మిమీ, వెడల్పు 1,890 మిమీ, ఎత్తు 1,785 మిమీ మరియు వీల్‌బేస్ 2,700 మిమీగా ఉంటుంది.

ఎక్స్‌యూవీ700 vs ఎక్స్‌యూవీ500: ఈ రెండింటిలో తేడాలు ఏంటి?

మహీంద్రా ఎక్స్‌యూవీ700, ప్రస్తుత ఎక్స్‌యూవీ500 కన్నా కొంచెం పొడవుగా ఉంటుంది. వెడల్పు మాత్రం రెండు ఎస్‌యూవీలు ఒకేలా ఉంటాయి. కాకపోతే, ఎక్స్‌యూవీ700 ఎత్తు మరియు వీల్‌బేస్ తక్కువగా ఉంటుంది. మొత్తమ్మీద, ఎక్స్‌యూవీ700 మెరుగైన కొలతలను కలిగి ఉండి, మంచి రోడ్ ప్రజెన్స్‌ను కలిగి ఉంటుంది.

ఎక్స్‌యూవీ700 vs ఎక్స్‌యూవీ500: ఈ రెండింటిలో తేడాలు ఏంటి?

ఇక ఎక్స్‌యూవీ700 డిజైన్ విషయానికి వస్తే, దీనిని ప్రస్తుత ఎక్స్‌యూవీ500 డిజైన్‌కి అప్‌గ్రేడ్‌లా చెప్పుకోవచ్చు. అయితే, ఈ రెండు మోడళ్ల బాహ్య స్టైలింగ్ కొంతవరకు సమానంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఎక్స్‌యూవీ700 ముందు భాగంలో ఒక పెద్ద గ్రిల్, కొత్త మహీంద్రా లోగో, ఆకర్షణీయమైన ఎల్ఈడి హెడ్‌లైట్లు మరియు పెద్ద C-ఆకారపు డే టైమ్ రన్నింగ్ లైట్లు ఉన్నాయి.

ఎక్స్‌యూవీ700 vs ఎక్స్‌యూవీ500: ఈ రెండింటిలో తేడాలు ఏంటి?

ఎక్స్‌యూవీ700 వెనుక భాగంలో బాణం ఆకారంలో ఉండే ర్యాప్అరౌండ్ టెయిల్‌లైట్లు ఉంటాయి. ఇందులో ఇన్‌స్టాల్ చేయబడిన అల్లాయ్ వీల్స్ డిజైన్ కూడా కొత్తగా ఉంది మరియు చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఎస్‌యూవీ ముందు మరియు వెనుక భాగంలో కంపెనీ యొక్క కొత్త 'ట్విన్ పీక్' లోగోను కూడా ఇందులో చూడొచ్చు.

ఎక్స్‌యూవీ700 vs ఎక్స్‌యూవీ500: ఈ రెండింటిలో తేడాలు ఏంటి?

ఎక్స్‌యూవీ700 vs ఎక్స్‌యూవీ500: ఇంటీరియర్స్, ఫీచర్లు

మహీంద్రా ఎక్స్‌యూవీ700 లోపలి భాగంలో ఆధునిక సాంకేతికతతో పాటు అందమైన డిజైన్ ఇవ్వబడింది. క్యాబిన్ యొక్క హైలైట్ ఏంటంటే, ఇందులో డ్యాష్‌బోర్డ్‌పై అమర్చబడిన డ్యూయల్ స్క్రీన్ సెటప్. ఇందులో రెండు 10.25 ఇంచ్ డిస్‌ప్లేలు ఉంటాయి. వీటిలో ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరొకటి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం ఉపయోగించబడుతాయి.

ఎక్స్‌యూవీ700 vs ఎక్స్‌యూవీ500: ఈ రెండింటిలో తేడాలు ఏంటి?

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఎక్స్‌యూవీ500 ఇంటీరియర్, డిజైన్ పరంగా ఖచ్చితంగా పాతదిగానే అనిపిస్తుంది. ఇది సాంప్రదాయ డాష్‌బోర్డ్ లేఅవుట్‌ను కలిగి ఉంటుంది. ఇందులోని సెంటర్ కన్సోల్‌లో 7-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు స్టీరింగ్ వెనుక సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లు ఉన్నాయి.

ఎక్స్‌యూవీ700 vs ఎక్స్‌యూవీ500: ఈ రెండింటిలో తేడాలు ఏంటి?

ఫీచర్ల విషయానికొస్తే, మహీంద్రా ఎక్స్‌యూవీ700లో ఇంటిగ్రేటెడ్ అమెజాన్ అలెక్సాతో కూడిన అడ్రినోక్స్ కనెక్టింగ్ టెక్నాలజీ, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, సెగ్మెంట్లో కెల్లా పెద్ద సన్‌రూఫ్ (స్కైరూఫ్), డ్యూయెల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎయిర్ ప్యూరిఫయర్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, మెమరీ ఫంక్షన్ మరియు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మొదలైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఎక్స్‌యూవీ700 vs ఎక్స్‌యూవీ500: ఈ రెండింటిలో తేడాలు ఏంటి?

ఎక్స్‌యూవీ500ను ఫీచర్ల పరంగా ఎక్స్‌యూవీ700తో పోల్చినప్పుడు ఇది చాలా వెనుకబడి ఉన్నట్లుగా ఉంటుంది. ఇందులో మహీంద్రా బ్లూ సెన్స్ కనెక్టింగ్ టెక్నాలజీ, స్మార్ట్ వాచ్ కనెక్టివిటీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆల్-పవర్ విండోస్, పవర్-ఆపరేటెడ్ సైడ్ మిర్రర్‌లు, సరౌండ్ డిస్క్ బ్రేకులు మరియు ఆరు ఎయిర్ బ్యాగ్స్ వంటి ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.

ఎక్స్‌యూవీ700 vs ఎక్స్‌యూవీ500: ఈ రెండింటిలో తేడాలు ఏంటి?

మహీంద్రా ఎక్స్‌యూవీ700 vs ఎక్స్‌యూవీ500: ఇంజన్

మహీంద్రా ఎక్స్‌యూవీ700ను కంపెనీ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌లు ఉన్నాయి. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 197 బిహెచ్‌పి పవర్‌ను మరియు 380 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుండగా, డీజిల్ ఇంజన్ రెండు ట్యూన్‌లలో లభిస్తుంది. ఇందులో మొదటిది 153 బిహెచ్‌పి పవర్ మరియు 360 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది.

ఎక్స్‌యూవీ700 vs ఎక్స్‌యూవీ500: ఈ రెండింటిలో తేడాలు ఏంటి?

ఇకపోతే, రెండవది 182 బిహెచ్‌పి పవర్ మరియు 450 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్లన్నీ కూడా 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటాయి. ఇకపోతే, మహీంద్రా ఎక్స్‌యూవీ500లో ఒకే ఒక ఇంజన్ ఆప్షన్ ఉంటుంది. ఇందులోని 2.2-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 153 బిహెచ్‌పి పవర్‌ను మరియు 360 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఎక్స్‌యూవీ700 vs ఎక్స్‌యూవీ500: ఈ రెండింటిలో తేడాలు ఏంటి?

మహీంద్రా ఎక్స్‌యూవీ700 vs ఎక్స్‌యూవీ500: ధర

మహీంద్రా ఎక్స్‌యూవీ700లో కంపెనీ 4 వేరియంట్ల ధరలను మాత్రమే వెల్లడించింది. కాగా, త్వరలోనే మరిన్ని ఇతర వేరియంట్ల వివరాలను వెల్లడి చేస్తామని పేర్కొంది. ఇందులో ఎమ్ఎక్స్ ట్రిమ్ యొక్క పెట్రోల్ (మ్యాన్యువల్) వేరియంట్ ధర రూ.11.99 లక్షలు మరియు ఎమ్ఎక్స్ డీజిల్ (మ్యాన్యువల్) వేరియంట్ ధర రూ.12.49 లక్షలుగా ఉన్నాయి. అలాగే, ఏఎక్స్3 పెట్రోల్ (మ్యాన్యువల్) మరియు ఏఎక్స్5 పెట్రోల్ (మ్యాన్యువల్) వేరియంట్ల ధరలు వరుసగా రూ.13.99 లక్షలు మరియు రూ.14.99 లక్షలుగా ఉన్నాయి.

ఎక్స్‌యూవీ700 vs ఎక్స్‌యూవీ500: ఈ రెండింటిలో తేడాలు ఏంటి?

మహీంద్రా ఎక్స్‌యూవీ500 ధరల విషయానికి వస్తే, ప్రస్తుతం ఈ ఎస్‌యూవీని రూ.15.56 లక్షల నుంచి రూ.20.07 లక్షల మధ్యలో విక్రయిస్తున్నారు (పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సరికొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని మహీంద్రా ఎక్స్‌యూవీ500 కంటే చాలా తక్కువ ధరకే విక్రయిస్తున్నారు.

Most Read Articles

English summary
What are the major differences between mahindra xuv700 and xuv500
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X