ఎలక్ట్రిక్ కార్ గురించి వెల్లడించిన యాపిల్ (Apple) కంపెనీ: ఇక లాంచ్ అప్పుడేనా..!!

ప్రపంచ మార్కెట్లో ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యాపిల్ కంపెనీ యొక్క మొబైల్ ఫోన్లకు మార్కెట్లో విపరీతమైన ఆదరణ ఉంది. అయితే కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో ఒక కొత్త కారుని విడుదల చేయనున్నట్లు గతంలోనే వెల్లడించింది.

చాలా రోజుల నుంచి వాహన ప్రేమికులు యాపిల్ కంపెనీ విడుదల చేసే ఎలక్ట్రిక్ కారు ఎలా ఉంటుంది అని ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే తాజాగా కంపెనీ యాపిల్ కంపెనీ ఎలక్ట్రిక్ కార్ గురించి కొన్ని వివరాలు వెల్లడించింది. ఇందులో భాగంగానే కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారుని 1,00,000 డాలర్లకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. అంటే ఈ ధర భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 82.51 లక్షలు.

ఎలక్ట్రిక్ కార్ గురించి వెల్లడించిన యాపిల్ (Apple) కంపెనీ

యాపిల్ కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారుని గతంలో వెల్లడించిన దాని ప్రకారం 2025 నాటికి విడుదల చేయాల్సి ఉంది, కానీ లాంచ్ టైమ్ ఇప్పుడు 2026 కి చేరింది. అంటే ఈ ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో విడుదల కావడానికి ఇంకా నాలుగు సంవత్సరాలు సమయం ఉంది. యాపిల్ ఎలక్ట్రిక్ కారుని రోడ్ల మీద చూడటానికి ఇంకా నాలుగు సంవత్సరాలు వేచి ఉండాల్సిన అవసరం ఉంది.

ఈ కారుని పూర్తిగా యాపిల్ కంపెనీ తాయారు చేస్తోంది. కావున డిజైన్ మరియు ఇతర ఫీచర్స్ కూడా కంపెనీ అందిస్తుంది. దీన్ని బట్టి చూస్తే యాపిల్ ఎలక్ట్రిక్ కారు అద్భుతమైన డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుందని ఆశించవచ్చు. జనరల్ మోటార్స్ యొక్క సూపర్ క్రూయిజ్ వంటి కార్లలో కనిపించే విధంగా హైవేలపై సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీని కూడా యాపిల్ కంపెనీ తన ఎలక్ట్రిక్ కారులో అందించే అవకాశం ఉంటుంది.

ఇందులో సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే, టెస్లా కార్ల మాదిరిగా ప్రపంచ మార్కెట్లో మంది ఆదరణ పొందే అవకాశం ఉందని ఆశించవచ్చు. అంతే కాకుండా ఇందులో కొత్త కొత్త టెక్నాలజీ వంటి వాటిని కంపెనీ ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. టెస్లా తన సెల్ఫ్ డ్రైవింగ్ సహాయం కోసం అల్ట్రాసోనిక్ సెన్సార్ల స్థానంలో కెమెరాలను ఉపయోగించాలని ఎంచుకుంది. అయితే యాపిల్ కంపెనీ ఏ విధంగా చేస్తుందో తెలియాలి.

నిజానికి మొదట్లో కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ కారు ధర 1,20,000 డాలర్లకు పైగా ఉంటుందని భావించారు. అయితే ఇందులో పూర్తి స్థాయి సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ మరియు మరింత అధునాతన ఫీచర్లు లేకపోవడం వల్ల దీని ధర దాదాపు 20,000 డాలర్ల వరకు తగ్గే అవకాశం ఉంది. అయితే ధరలు మరియు ఇతర సమాచారం మొత్తమ్ కంపెనీ త్వరలోనే అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం మార్కెట్లో మొబైల్ తయారు చేసే కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహన తయారీపై ద్రుష్టి సారిస్తున్నాయి. ఇందులో భాగంగానే షియోమీ, సోనీ వంటి టెక్ దిగ్గజాలు కూడా ఎలక్ట్రిక్ కార్ల రంగంలోకి ప్రవేశించడానికి కృషి చేస్తున్నాయి. అయితే ఈ కంపెనీలన్నీ కూడా ఎలక్ట్రిక్ వాహన రంగంలో తమ ఉనికిని చాటుకోగలవా.. ప్రపంచ మార్కెట్లో ఉన్న అధిక పోటీని తట్టుకోగలవా అనే మరిన్ని వివరాలు రాబోయే రోజుల్లో స్పష్టంగా తెలుస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ప్రపంచ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలను పెరుగుతున్న ఆదరణ కారణంగా మొబైల్ తయారీ సంస్థలు కూడా ఈ దిశగానే అడుగులు వేస్తున్నాయి. కావున ఇందులో భాగంగానే యాపిల్ కంపెనీ ఎలక్ట్రిక్ కారుని విడుదల చేయడానికి సన్నద్ధమైపోయింది. దీని పైన యాపిల్ కంపెనీ ఇప్పుడు కృషి చేస్తూనే ఉంది. ఇది 2026 నాటికి మార్కెట్లో అధికారికంగా విడుదవుతుంది. యాపిల్ కంపెనీ విడుదల చేయనున్న కొత్త ఎలక్ట్రిక్ కారు గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Apple electric car price and launch timeline details
Story first published: Friday, December 9, 2022, 6:35 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X