భారత్‌లో అడుగెట్టిన చైనా ఎలక్ట్రిక్ కార్ BYD Atto 3: బుకింగ్స్ కూడా షురూ..!!

భారతీయ ఎలక్ట్రిక్ వాహన విభాగం రోజురోజుకి మంచి పురోగతి చెందుతోంది. ఈ తరుణంలో చైనా వాహన తయారీ సంస్థ BYD (బిల్డ్ యువర్ డ్రీమ్స్) దేశీయ మార్కెట్లో తన కొత్త ఎలక్ట్రిక్ SUV 'ఆటో 3' (Atto 3) ని అధికారికంగా ఆవిష్కరించింది. అయితే ఈ ఎలక్ట్రిక్ SUV ధరలు వచ్చే నెలలో ప్రకటించే అవకాశం ఉంది. అదే సమయంలో కంపెనీ ఈ కొత్త కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. దీని గురించి మరింత సమచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

భారత్‌లో అడుగెట్టిన చైనా ఎలక్ట్రిక్ కార్ BYD Atto 3: బుకింగ్స్ కూడా షురూ..!!

కంపెనీ పండుగ సీజన్లో తన ఎలక్ట్రిక్ SUV ని ఆవిష్కరించినప్పటికీ ధరలు మాత్రం వెల్లడించలేదు, కానీ ఆసక్తి కలిగిన కస్టమర్లు రూ. 50,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ముందుగా బుక్ చేసుకున్న మొదటి 500 మంది కస్టమర్లకు 2023 జనవరి నాటికి డెలివరీ చేయనున్నట్లు కూడా కంపెనీ తెలిపింది. అంటే ఇప్పుడు బుక్ చేసుకునే కస్టమర్లు సంక్రాతి నాటికి డెలివరీ పొందవచ్చు.

భారత్‌లో అడుగెట్టిన చైనా ఎలక్ట్రిక్ కార్ BYD Atto 3: బుకింగ్స్ కూడా షురూ..!!

BYD కంపెనీ ఇటీవలే ప్రైవేట్ కొనుగోలుదారుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన e6 MPV తర్వాత 'అటో 3' ఎలక్ట్రిక్ SUV ని భారతీయ మార్కెట్ కోసం తీసుకురానుంది. అయితే ఇది CKD యూనిట్‌గా మనదేశానికి వస్తుంది, కాగా చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూర్ వద్ద అసెంబుల్ చేయబడుతుంది.

భారత్‌లో అడుగెట్టిన చైనా ఎలక్ట్రిక్ కార్ BYD Atto 3: బుకింగ్స్ కూడా షురూ..!!

దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కొత్త ఆటో 3 ఎలక్ట్రిక్ కారు అద్భుతమైన డిజైన్ మరియు పరికరాలను పొందుతుంది. ఈ SUV ముంచుభాగంలో BYD అక్షరాలతో కూడిన సిల్వర్ గ్రిల్‌ ఉంటుంది, దానికి కింది భాగంలో Atto 3 అనేది ఉంటుంది. అంతే కాకుండా ఇందులో LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్‌తో కూడా సొగసైన హెడ్‌లైట్‌ ఉంటుంది.

భారత్‌లో అడుగెట్టిన చైనా ఎలక్ట్రిక్ కార్ BYD Atto 3: బుకింగ్స్ కూడా షురూ..!!

సైడ్ ప్రొఫైల్ లో 18 ఇంచెస్ ఫైవ్ స్పోక్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ మరియు సి-పిల్లర్‌పై ప్రత్యేకమైన సిల్వర్ ఫినిషింగ్ వంటివి ఉన్నాయి. రియర్ ప్రొఫైల్ లో ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌, రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్ మరియు పెద్ద అక్షరాలతో కూడిన 'బిల్డ్ యువర్ డ్రీమ్స్' ఉన్నాయి. మొత్తం మీద ఇది ఆధునిక డిజైన్ పొందుతుంది.

భారత్‌లో అడుగెట్టిన చైనా ఎలక్ట్రిక్ కార్ BYD Atto 3: బుకింగ్స్ కూడా షురూ..!!

పరిమాణం విషయానికి వస్తే, BYD Atto 3 పొడవు 4,445 మిమీ, వెడల్పు 1,875 మిమీ, ఎత్తు 1,615 మిమీ మరియు వీల్‌బేస్ 2,720 మిమీ వరకు ఉంటుంది. కాగా దీని బూట్ కెపాసిటీ 440 లీటర్లు. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

భారత్‌లో అడుగెట్టిన చైనా ఎలక్ట్రిక్ కార్ BYD Atto 3: బుకింగ్స్ కూడా షురూ..!!

ఇక కొత్త BYD Atto 3 యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 12.8 ఇంచెస్ సెంట్రల్ స్క్రీన్‌ ఉంటుంది. ఇది ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇందులో ఒక పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ టెయిల్‌గేట్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ మరియు 5 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైనవి ఉన్నాయి.

భారత్‌లో అడుగెట్టిన చైనా ఎలక్ట్రిక్ కార్ BYD Atto 3: బుకింగ్స్ కూడా షురూ..!!

కొత్త అటో 3 ఎలక్ట్రిక్ SUV పెద్ద 60.48 kWh బ్యాటరీ ప్యాక్ మరియు చిన్న 49.92kWh బ్యాటరీ ప్యాక్‌ పొందుతుంది. ఇందులోని పెద్ద బ్యాటరీ ప్యాక్ ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 521 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇది రీజనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీని కూడా పొందుతుంది. ఒక్క ఛార్జ్ తో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక అవుతుంది.

భారత్‌లో అడుగెట్టిన చైనా ఎలక్ట్రిక్ కార్ BYD Atto 3: బుకింగ్స్ కూడా షురూ..!!

ఛార్జింగ్ విషయానికి వస్తే, BYD Atto 3 ఎలక్ట్రిక్ కారు 80 kW DC ఫాస్ట్ ఛార్జర్‌ సాయంతో కేవలం 50 నిమిషాల్లో 0 శాతం నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకుంటుంది. అదే సమయంలో టైప్ 2 AC ఛార్జర్‌ని ఉపయోగించి, బ్యాటరీ ప్యాక్‌ను ఛార్జ్ చేసుకోవడానికి దాదాపు 10 గంటల సమయం పడుతుంది. కంపెనీ ఈ SUV కొనుగులుదారులకు 7kW AC హోమ్ ఛార్జర్‌తో పాటు 3kW AC పోర్టబుల్ ఛార్జింగ్ బాక్స్‌ వంటి వాటిని కూడా అందిస్తుంది. కావున సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు.

భారత్‌లో అడుగెట్టిన చైనా ఎలక్ట్రిక్ కార్ BYD Atto 3: బుకింగ్స్ కూడా షురూ..!!

BYD చైనా వాహన తయారీ సంస్థ అయినప్పటికీ సేఫ్టీ పరంగా మంచి ఫీచర్స్ అందించింది. ఇందులో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, ఎలక్ట్రానికి స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్‌స్పాట్ మానిటరింగ్, లేన్-కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు 360-డిగ్రీ కెమెరా వంటివి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.

భారత్‌లో అడుగెట్టిన చైనా ఎలక్ట్రిక్ కార్ BYD Atto 3: బుకింగ్స్ కూడా షురూ..!!

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

BYD కంపెనీ ఎట్టకేలకు భారతీయ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో తన ఆటో 3 SUV ని చేర్చింది. ఈ SUV ధరలను కంపెనీ వచ్చే నెలలో వెల్లడిస్తుంది. ఈ SUV దేశీయ మార్కెట్లో MG ZS EV, హ్యుందాయ్ కోనా ఈవి మరియు టాటా నెక్సాన్ EV మ్యాక్స్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కావున మార్కెట్లో ఈ చైనా బ్రాండ్ మంచి అమ్మకాలు పొందుతుందా.. లేదా అనేది త్వరలోనే తెలుస్తుంది.

Most Read Articles

English summary
Byd atto 3 electric suv bookings open deliveries from 2023 onwards details
Story first published: Wednesday, October 12, 2022, 11:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X