భారత్‌లో ప్రారంభమైన చైనా బ్రాండ్ కార్ డెలివరీలు: మీరు బుక్ చేసుకున్నారా..!!

ప్రముఖ చైనా ఎలక్ట్రిక్ కార్ తయారీ సంస్థ బిల్డ్ యువర్ డ్రీమ్స్ ఆటో (BYD Auto) భారతీయ మార్కెట్లో 2021 నవంబర్ నెలలో తన 'ఈ6' ఎలక్ట్రిక్ ఎమ్‌పివి విడుదల చేసింది. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఈ ఎలెక్ట్రిక్ కారు యొక్క డెలివరీలు ప్రారంభమయ్యాయి. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో ప్రారంభమైన చైనా బ్రాండ్ కార్ డెలివరీలు: మీరు బుక్ చేసుకున్నారా..!!

దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త BYD e6 ఎలక్ట్రిక్ MPV యొక్క మొదటి బ్యాచ్‌లో దాదాపు 30 యూనిట్లు డెలివరీ చేయబడ్డాయి. ఇందులో భాగంగానే కంపెనీ 8 నగరాల్లో డీలర్‌షిప్‌లను ప్రారంభించింది. ఈ ఎలక్ట్రిక్ MPV దాదాపుగా 520 కిమీ పరిధిని అందిస్తుంది. ఇది B2B సెగ్మెంట్‌లోని ఏకైక మోడల్, అంతే కాకుండా ఇది అనేక ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

భారత్‌లో ప్రారంభమైన చైనా బ్రాండ్ కార్ డెలివరీలు: మీరు బుక్ చేసుకున్నారా..!!

BYD ఇండియా దేశంలో తమ E6 ఎలక్ట్రిక్ ఎమ్‌పివిని రూ. 29.15 లక్షల ధరతో విడుదల చేసింది. బివైడి ఇ6 (BYD e6) ఎలక్ట్రిక్ ఎమ్‌పివి చూడటానికి ఇంచు మించు టొయోటా ఇన్నోవా మాదిరిగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారులో గరిష్టంగా 94 బిహెచ్‌పి పవర్ మరియు 180 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేసే ఫ్రంట్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది.

ఈ మోటార్ సాయంతో BYD e6 గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. అయితే, BYD E6 ఎలక్ట్రిక్ ఎమ్‌పివి ప్రస్తుతం వాణిజ్య వినియోగదారులకు మాత్రమే, అదికూడా ఐదు సీట్ల కాన్ఫిగరేషన్ తో మాత్రమే అందుబాటులో ఉంది.

భారత్‌లో ప్రారంభమైన చైనా బ్రాండ్ కార్ డెలివరీలు: మీరు బుక్ చేసుకున్నారా..!!

BYD e6 ఎలక్ట్రిక్ MPV దేశంలోని అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కొచ్చి, ముంబై, న్యూఢిల్లీ మరియు విజయవాడ వంటి 8 నగరాల్లో విక్రయిస్తోంది. ప్రస్తుతం ఇది ప్రైవేట్ కస్టమర్‌లకు అందుబాటులో లేదు మరియు వాణిజ్య ప్రయోజనం ఉన్న కస్టమర్‌లకు మాత్రమే విక్రయిస్తోంది.

భారత్‌లో ప్రారంభమైన చైనా బ్రాండ్ కార్ డెలివరీలు: మీరు బుక్ చేసుకున్నారా..!!

ప్రస్తుతానికి ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం ప్రైవేట్ కమర్షియల్ వినియోగదారులకు మాత్రమే విక్రయించబడుతున్నమాట. వ్యక్తిగత వినియోగం కోసం ఇది అందుబాటులో లేదు. ఈ ఎలక్ట్రిక్ కారులో 71.6kWh 'బ్లేడ్' లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ (LiFePO4) బ్యాటరీ ప్యాక్ అమర్చబడి ఉంటుంది. ఈ బ్యాటరీ నుండి వచ్చే శక్తి ముందు చక్రాలకు పంపిణీ అవుతుంది. ఇది WLTP ప్రమాణాల ప్రకారం, పూర్తి చార్జ్ పై గరిష్టంగా 415 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

భారత్‌లో ప్రారంభమైన చైనా బ్రాండ్ కార్ డెలివరీలు: మీరు బుక్ చేసుకున్నారా..!!

అంతే కాకూండా.. ఈ BYD e6 ఎలక్ట్రిక్ కారులో సిటీ ఓన్లీ రేంజ్ సెలక్ట్ చేసుకుంటే, ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 520 కిలోమీటర్లకు పైగా రేంజ్ ను ఆఫర్ చేస్తుంది. ఈ కారులో అమర్చిన కోబాల్ట్-రహిత LiFePO4 బ్యాటరీ ప్యాక్ 'బ్లేడ్' చాలా సురక్షితమైనది మరియు ఇది ప్రమాదవశాత్తు పంక్చర్ అయినప్పటికీ కాలిపోవడం లేదా పేలిపోవడం జరగదని కంపెనీ తెలిపింది.

భారత్‌లో ప్రారంభమైన చైనా బ్రాండ్ కార్ డెలివరీలు: మీరు బుక్ చేసుకున్నారా..!!

బివైడి ఇ6 ఎలక్ట్రిక్ కారు AC మరియు DC (స్టాండర్డ్ మరియు ఫాస్ట్) ఛార్జింగ్ లను సపోర్ట్ చేస్తుంది. ఈ కారును DC ఫాస్ట్ ఛార్జర్‌ ద్వారా చార్జ్ చేసినప్పుడు, ఈ కారులోని బ్యాటరీ ప్యాక్‌ ను కేవలం 35 నిమిషాల్లో 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. అదే దీని ఫాస్ట్ చార్జర్ ద్వారా పూర్తిగా 100 శాతం ఛార్జ్ చేయాలంటే సుమారు గంటన్నర సమయం పడుతుంది.

భారత్‌లో ప్రారంభమైన చైనా బ్రాండ్ కార్ డెలివరీలు: మీరు బుక్ చేసుకున్నారా..!!

కస్టమర్లు రూ. 45,000 అదనంగా చెల్లిస్తే, కంపెనీ ఈ కారుతో పాటుగా BYD 7kW అనే AC ఛార్జర్‌ ను కూడా అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు లోపల 10 ఇంచ్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, లెథర్ సీట్ అప్‌హోలెస్ట్రీ, 6-వే అడ్జస్టబుల్ డ్రైవర్ అండ్ ఫ్రంట్ ప్యాసింజర్ సీట్స్ మరియు ఎయిర్ ఫిల్ట్రేషన్ సిస్టమ్‌ వంటి అనేక సాంకేతిక ఫీచర్లు ఉన్నాయి. ఇక సేఫ్టీ విషయానికి వస్తే, ఇందులో మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్, యాంటీ-లాక్ బ్రేక్‌లు (ABS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) మరియు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS) మొదలైనవి ఉన్నాయి.

భారత్‌లో ప్రారంభమైన చైనా బ్రాండ్ కార్ డెలివరీలు: మీరు బుక్ చేసుకున్నారా..!!

బివైడి ఈ6 ఎలక్ట్రిక్ వాహనంపై కంపెనీ 3 సంవత్సరాలు లేదా 1.25 లక్షల కిలోమీటర్ల వారంటీని అందిస్తోంది. అలాగే, ఇందులోని ట్రాక్షన్ మోటార్‌ పై 8 సంవత్సరాలు లేదా 1.5 లక్షల కిలోమీటర్లు మరియు బ్యాటరీ సెల్ పై 8 సంవత్సరాలు లేదా 5 లక్షల కిలోమీటర్ల వారంటీని కూడా అందిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారు 570 లీటర్ల బూట్ స్పేస్ ను కలిగి ఉంటుంది మరియు దీని మొత్తం బరువు 1,930 కిలోలుగా ఉంటుంది.

భారత్‌లో ప్రారంభమైన చైనా బ్రాండ్ కార్ డెలివరీలు: మీరు బుక్ చేసుకున్నారా..!!

కంపెనీ 2021 ప్రారంభం నుండి భారతదేశంలో ఈ బివైడి ఈ6 ఎలక్ట్రిక్ వాహనాన్ని టెస్ట్ చేస్తోంది. కంపెనీ చైనాతో సహా ఇతర ఆగ్నేయాసియా దేశాల్లో కూడా ఈ మోడల్‌ను విక్రయిస్తోంది. BYD భారతదేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలపై కూడా పెట్టుబడి పెడుతోంది. ఇందుకోసం కంపెనీ ప్రధాన నగరాల్లో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది.

భారత్‌లో ప్రారంభమైన చైనా బ్రాండ్ కార్ డెలివరీలు: మీరు బుక్ చేసుకున్నారా..!!

బివైడి 2007 నుండి భారతదేశంలో వ్యాపారం చేస్తోంది. కంపెనీ ప్రధానంగా భారతదేశంలో ట్రక్కులను తయారు చేస్తుంది, అయితే భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను చూసి, కంపెనీ వాణిజ్య ప్యాసింజర్ కార్ల విభాగంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకుంది.

భవిష్యత్తులో, ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్లో కూడా ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేస్తామని బివైడి చెబుతోంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది మరియు ప్రైవేట్ కస్టమర్లతో పాటు వ్యాపారవేత్తలు అలాంటి ఎంపికల కోసం చూస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, ఈ చైనీస్ కంపెనీ దీనిని సద్వినియోగం చేసుకుంటోంది. రాబోయే రోజుల్లో కంపెనీ తన వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. అయితే ఇది ఎంతవరకు జరుగుతుందనే విషయం త్వరలోనే తెలుస్తుంది.

Most Read Articles

English summary
Byd e6 electric mpv delivery starts details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X