సిట్రోయెన్ సి3 (Citroen C3) కారులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్.. లాంచ్ ఎప్పుడంటే..

ఫ్రెంచ్ కార్ కంపెనీ సిట్రోయెన్ (Citroen) ఇటీవల భారత మార్కెట్లో తమ సరికొత్త సి3 (C3) హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. ప్రస్తుతం, మార్కెట్లో సిట్రోయెన్ సి3 (Citroen C3) రెండు రకాల పెట్రోల్ ఇంజన్ (1.2 లీటర్ న్యాచురల్ మరియు 1.2 లీటర్ టర్బో) ఆప్షన్లతో లభిస్తోంది. ఈ రెండు ఇంజన్లు కూడా కేవలం మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మనదేశంలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగిన కార్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో, సిట్రోయెన్ కూడా తమ సి3 మోడల్ ఓ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వెర్షన్‌ను వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల చేయవచ్చని భావిస్తున్నారు.

సిట్రోయెన్ సి3 (Citroen C3) కారులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్.. లాంచ్ ఎప్పుడంటే..

చిన్నసైజు కాంపాక్ట్ ఎస్‌యూవీలా కనిపించే సిట్రోయెన్ సి3 కారులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ లేకపోవడాన్ని కొనుగోలుదారులు ఓ పెద్ద లోటుగా పరిగణిస్తున్నారు. ప్రత్యేకించి, అర్బన్ ప్రాంతాల్లో ఉండే యువ కొనుగోలుదారులు ప్రస్తుతం ఎక్కువగా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగిన కార్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో లభించే కార్లు హైవేలపై నడపడానికి సరదాగా ఉండటమే కాకుండా, స్టాప్ అండ్ గో సిటీ ట్రాఫిక్ లో కూడా డ్రైవ్ చేయడానికి చాలా సరదాగా ఉంటాయి.

సిట్రోయెన్ సి3 (Citroen C3) కారులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్.. లాంచ్ ఎప్పుడంటే..

6-స్పీడ్ టార్క్ కన్వర్టర్‌ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ని ఉపయోగించవచ్చు..

భారతదేశంలో మారుతి సుజుకి వంటి కంపెనీలు కూడా కాలం చెల్లిపోయిన 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లకు స్వస్తి పలికి, మరింత మెరుగైన మరియు అధునాతనమైన 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లను ఉపయోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, సిట్రోయెన్ కూడా ఇదే రకమైన ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ను తమ కొత్త సి3 కారులో ఉపయోగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ప్రత్యేకమైన టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, సాధారణ ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) కన్నా ఎన్నో రెట్లు మెరుగైనది మరియు ఇది పవర్, మైలేజ్ మధ్య మంచి సమతౌల్యాన్ని అందిస్తుంది.

సిట్రోయెన్ సి3 (Citroen C3) కారులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్.. లాంచ్ ఎప్పుడంటే..

ప్రత్యేకించి భారతీయ రోడ్డు పరిస్థితులకు ఈ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్ చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని నిరూపించబడింది. సిట్రోయెన్ సి3 కోసం ఉపయోగించే 6-స్పీడ్ యూనిట్ ను జపనీస్ ట్రాన్స్‌మిషన్ మేకర్ ఐసిన్ నుండి తీసుకోబడుతుంది. ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన స్కోడా కుషాక్, స్కోడా స్లావియా, ఫోక్స్‌వ్యాగన్ టైగన్, ఫోక్స్‌‌వ్యాగన్ వర్త్యుస్ కార్లలోని 1.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌లు మరియు ఎమ్‌జి ఆస్టర్ యొక్క 1.3 టర్బో-పెట్రోల్ ఇంజన్‌ కోసం కూడా ఇదే Aisin బ్రాండ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ లను ఉపయోగిస్తున్నారు.

సిట్రోయెన్ సి3 (Citroen C3) కారులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్.. లాంచ్ ఎప్పుడంటే..

సిట్రోయెన్ సి3 ఇంజన్ మరియు ప్రస్తుత గేర్‌బాక్స్ ఆప్షన్లు..

ఇదివరకు చెప్పుకున్నట్లుగా సిట్రోయెన్ సి3 న్యాచురల్ మరియు టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది మరియు ఇవి రెండూ కూడా ఒకే పరిమాణంలో ఉంటాయి. ఇందులోని 1.2-లీటర్, న్యాచురల్లీ-ఆస్పిరేటెడ్, 3-సిలిండర్ ప్యూర్‌టెక్ 82 పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 82 బిహెచ్‌పి శక్తిని మరియు 115 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ లీటరుకు 19.8 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

సిట్రోయెన్ సి3 (Citroen C3) కారులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్.. లాంచ్ ఎప్పుడంటే..

సిట్రోయెన్ సి3లో మరింత శక్తివంతమైన ఇంజన్ ఆప్షన్ కోరుకునే వారి కోసం కంపెనీ, ఇందులోని 1.2 లీటర్ టర్బో ప్యూర్‌టెక్ 110 టర్బో పెట్రోల్ ఇంజన్ ను అందిస్తోంది. ఈ ఇంజన్ గరిష్టంగా 110 బిహెచ్‌పి శక్తిని మరియు 190 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది లీటరుకు 19.4 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. బహుశా, కంపెనీ ఇదే టర్బో ఇంజన్ వేరియంట్‌లో తమ కొత్త 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ను ఆఫర్ చేసే అవకాశం ఉంది.

సిట్రోయెన్ సి3 (Citroen C3) కారులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్.. లాంచ్ ఎప్పుడంటే..

ప్రస్తుతానికి సిట్రోయెన్ సి3 కారులో ఎలాంటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ లేదు. ఇందులో కొత్తగా పరిచయం చేయబోయే 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, మార్కెట్లో లభిస్తున్న అనేక ఇతర AMT గేర్‌బాక్స్ ల కంటే కాస్తంత ఖరీదైనదిగా ఉంటుంది. అయినప్పటికీ, ఇది ధరకు విలువ ప్రతిపాదనను అందిస్తుందని భావిస్తున్నారు. సిట్రోయెన్ మాతృ సంస్థ స్టెలాంటిస్ (గతంలో గ్రూప్ PSA) ఐసిన్ బ్రాండ్ యొక్క 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ను ఉపయోగించడం ఇదేం మొదటిసారి కాదు. యూరోపియన్ మార్కెట్లోని సిట్రోయెన్ సి3తో సహా అనేక ప్యుజో మరియు సిట్రోయెన్ మోడళ్లలో ఈ గేర్‌బాక్స్ ను ఉపయోగించారు.

సిట్రోయెన్ సి3 (Citroen C3) కారులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్.. లాంచ్ ఎప్పుడంటే..

సిట్రోయెన్ సంస్థకు ప్రస్తుతం భారతదేశంలో డీలర్‌షిప్‌లు మరియు సర్వీస్ సెంటర్లు చాలా పరిమితంగా ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాలలలో ఎవరైనా ఈ ఫ్రెంచ్ కారును కొనుగోలు చేయాలని చూస్తుంటే, వారు హెదరాబాద్ మరియు విశాఖపట్నం నగరాల్లో ఉన్న సిట్రోయెన్ షోరూమ్ లను సందర్శించవచ్చు. భవిష్యత్తులో ఈ ఫ్రెంచ్ కంపెనీ ఇక్కడి మార్కెట్లో మరిన్ని కొత్త ఉత్పత్తులను విడుదల చేయడం ద్వారా తమ సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్‌ను విస్తరించుకోవాలని చూస్తోంది.

సిట్రోయెన్ సి3 (Citroen C3) కారులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్.. లాంచ్ ఎప్పుడంటే..

ప్రస్తుతం, భారత మార్కెట్లో నేటి యువతరం కోసం అందుబాటులో ఉన్న మంచి యూత్‌ఫుల్ కార్లలో సిట్రోయెన్ సి3 కూడా ఒకటి. దేశీయ విపణిలో సిట్రోయెన్ సి3 ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 5.71 లక్షల నుండి రూ.8.05 లక్షల మధ్యలో ఉన్నాయి. - ఈ కారుకి సంబంధించిన పూర్తి వివరాలు మరియు డీటేల్డ్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Citroen c3 automatic gearbox variant launch expected in early 2023 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X