C5 Aircross ఫేస్‌లిఫ్ట్ మోడల్ ని ఆవిష్కరించిన Citroen; త్వరలో విడుదల

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ సిట్రోయెన్ (Citroen) భారత మార్కెట్లో విక్రయిస్తున్న సి5 ఎయిర్‌క్రాస్ (C5 Aircross) లో ఓ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ను కంపెనీ గ్లోబల్ మార్కెట్ల కోసం ఆవిష్కరించింది. కొత్త 2022 మోడల్ సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్ మోడల్ కొత్త హెడ్‌లైట్లు మరియు క్యాబిన్ లోపల కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. పాత మోడల్ తో పోల్చుకుంటే కంపెనీ ఈ కొత్త మోడల్ లో కేవలం చిన్నపాటి కాస్మెటిక్ మరియు ఫీచర్ అప్‌గ్రేడ్లను మాత్రమే చేసింది. కొన్ని కాస్మెటిక్ మార్పులను మినహాయించి, సి5 ఎయిర్‌క్రాస్ యొక్క ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ చాలావరకు దాని మునుపటి తరానికి సమానంగా ఉంటుంది.

C5 Aircross ఫేస్‌లిఫ్ట్ మోడల్ ని ఆవిష్కరించిన Citroen; త్వరలో విడుదల

కొత్త 2022 మోడల్ సి5 ఎయిర్‌క్రాస్ యొక్క హెడ్‌లైట్లు ఇప్పుడు బానెట్‌పై ఒక స్ట్రీక్ లాగా కనిపించే ఎల్ఈడి లైట్ స్ట్రిప్‌తో జత చేయబడి ఉంటాయి. ఇంకా ఇందులో రీడిజైన్ చేయబడిన బంపర్లు, కొత్త ఎయిర్ ఇన్‌టేక్ డిజైన్ మరియు వెనుక వైపున రీడిజైన్ చేయబడిన టెయిల్‌ లైట్‌లు, కొత్త ఎల్ఈడి గ్రాఫిక్‌లు మరియు సరికొత్త 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ వంటి ఫీచర్లను ఇందులో గమనించవచ్చు. కొత్త సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ లోపలి భాగం కూడా చాలా వరకూ మార్చబడింది.

C5 Aircross ఫేస్‌లిఫ్ట్ మోడల్ ని ఆవిష్కరించిన Citroen; త్వరలో విడుదల

ఈ కారులోని డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ ఇప్పుడు అప్‌డేట్ చేయబడిన మల్టీమీడియా ఫంక్షన్‌లతో కూడిన కొత్త 10 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్‌కు అనుగుణంగా కారు లోపల ఏసి వెంట్‌లు రీడిజైన్ చేయబడ్డాయి మరియు దీని కోసం నియంత్రణలు కూడా వేరుగా ఉంచబడ్డాయి. ఈ కారులో గేర్ సెలెక్టర్ ఇప్పుడు మునుపటి కంటే చిన్నదిగా ఉంటుంది. సిట్రోయన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ ఫ్రంట్ సీట్లు ఇప్పుడు వెంటిలేటెడ్ ఫీచర్లతో లభ్యం కానున్నాయి.

C5 Aircross ఫేస్‌లిఫ్ట్ మోడల్ ని ఆవిష్కరించిన Citroen; త్వరలో విడుదల

అంతేకాకుండా, ఈ సీట్లు ఇప్పుడు హీటింగ్ మరియు మసాజ్ ఫీచర్లతో లభ్యం కానున్నాయి. ఈ కొత్త సీట్లు ప్రత్యేక డెన్సిటీ ఫోమ్ మరియు ఆర్మ్‌చైర్ లుక్‌తో ఎలక్ట్రానిక్‌గా సర్దుబాటు చేయగల సౌలభ్యాన్ని కలిగి ఉంటాయి. అలాగే, ఈ కారులో అదనపు నిల్వ స్థలం (స్టోరేజే స్పేస్ కోసం) మరియు చార్జింగ్ సౌకర్యం కోసం అదనపు USB పోర్ట్‌లు కూడా ఇవ్వబడ్డాయి. కొత్త 2022 మోడల్ సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ ఇప్పుడు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఇంజన్‌తో కూడా అందించబడుతోంది.

C5 Aircross ఫేస్‌లిఫ్ట్ మోడల్ ని ఆవిష్కరించిన Citroen; త్వరలో విడుదల

ఈ టెక్నాలజీ సాయంతో ఇది ఇంధనాన్ని ఉపయోగించకుండా కేవలం బ్యాటరీ పవర్ తోనే సుమారు 55 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. ఈ కారులో Puretech 1.6 Turbo అని పిలువబడే మెరుగైన THP ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 180 bhp శక్తిని ఉత్పత్తి చేయగలదు. హైబ్రిడ్ మోడ్‌లో అయితే, ఈ ఎస్‌యూవీ గరిష్టంగా 225 bhp శక్తిని జనరేట్ చేస్తుంది. ఈ ఎస్‌యూవీ కొత్త డ్రైవింగ్ మోడ్ సెలెక్టర్‌ను కూడా పొందుతుంది, ఇందులో హైబ్రిడ్, ఎలక్ట్రిక్ మరియు స్పోర్ట్‌ అనే మూడు రకాల డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి.

C5 Aircross ఫేస్‌లిఫ్ట్ మోడల్ ని ఆవిష్కరించిన Citroen; త్వరలో విడుదల

సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ యొక్క ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను భారతదేశంలో విడుదల చేయడం గురించి సిట్రోయెన్ ఇంకా ఎలాంటి ప్రణాళికలను వెల్లడించలేదు. అయితే, కంపెనీ ఈ కారును భారతదేశంలో విడుదల చేసి దాదాపు సంవత్సరం పూర్తి కావస్తున్న నేపథ్యంలో, సిట్రోయెన్ ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్ వీలైనంత త్వరగా భారతదేశంలో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, సిట్రోయెన్ భారతదేశంలో తమ రెండవ మోడల్ అయిన 3 కాంపాక్ట్ ఎస్‌యూవీని ఈ ఏడాది విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది.

C5 Aircross ఫేస్‌లిఫ్ట్ మోడల్ ని ఆవిష్కరించిన Citroen; త్వరలో విడుదల

సిట్రోయెన్ సి3 (Citroen C3) సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీని కంపెనీ గడచిన సంవత్సరం సెప్టెంబర్ 2021 నెలలో 'మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియా' ప్రకటనతో ప్రపంచానికి పరిచయం చేసింది. ఇది సిట్రోయెన్ నుండి వస్తున్న రెండవ మోడల్. ఫ్రెంచ్ కార్ బ్రాండ్ ఈ కారును తన ఈ ఏడాది చివరి లోగా భారతదేశంలో ప్రారంభించాలని యోచిస్తోంది. సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఇది నిస్సాన్ మాగ్నైట్ మరియు రెనో కైగర్ వంటి మోడళ్లతో పోటీ పడనుంది.

C5 Aircross ఫేస్‌లిఫ్ట్ మోడల్ ని ఆవిష్కరించిన Citroen; త్వరలో విడుదల

భారతదేశంలో Citroen C5 Aircross ఎస్‌యూవీని కంపెనీ గత సంవత్సరం రూ. 29.90 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్) వద్ద విడుదల చేసింది. కాగా, కంపెనీ ఈ నెలలో సి5 ఎయిర్‌క్రాస్ ధరను పెంచింది. దీంతో ఇప్పుడు సి5 ఎయిర్‌క్రాస్ ధర ఇప్పుడు రూ. 32.24 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది మరియు ఇందులో షైన్ వేరియంట్ ధర రూ. 33.78 లక్షల (ఎక్స్-షోరూమ్) లకు చేరుకుంది. సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ భారతదేశంలో కంపెనీ యొక్క మొట్టమొదటి ఉత్పత్తి.

C5 Aircross ఫేస్‌లిఫ్ట్ మోడల్ ని ఆవిష్కరించిన Citroen; త్వరలో విడుదల

ఇది భారతదేశంలో 7 ఏప్రిల్ 2021న ప్రారంభించబడింది. ఇది కంపెనీ యొక్క ప్రీమియం ఎస్‌యూవీ మరియు ఇది మంచి డిజైన్ అలాగే ఫీచర్లతో చాలా సౌకర్యవంతమైన ఇంటీరియర్ ను కలిగి ఉంటుంది. ఈ ఎస్‌యూవీ డిజైన్ విషయానికి వస్తే, ఇందులో క్రోమ్ యాక్సెంట్‌లతో కూడిన ఫ్రంట్ గ్రిల్, ఎల్ఈడి హెడ్‌లైట్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్ మరియు ఇంటిగ్రేటెడ్ సిట్రోయెన్ లోగో మొదలైన ఎక్స్టీరియర్ డిజైన్ ఎలిమంట్స్ ను కలిగి ఉంటుంది.

C5 Aircross ఫేస్‌లిఫ్ట్ మోడల్ ని ఆవిష్కరించిన Citroen; త్వరలో విడుదల

అలాగే, ఇందులో ముందు వైపు పెద్ద ఫ్రంట్ ఎయిర్ ఇన్‌టేక్ గ్రిల్, 18 ఇంచ్ డ్యూయల్ టోన్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, బాడీ క్లాడింగ్ మరియు రూఫ్ రైల్స్ మొదలైనవి కూడా ఉన్నాయి. ఈ ఎస్‌యూవీ వెనుక భాగంలో రియర్ స్పాయిలర్, డ్యూయల్ క్రోమ్ ఎగ్జాస్ట్ పైపులు మరియు నాలుగు-మూలకాల దీర్ఘచతురస్రాకార లైట్లతో కూడిన పెద్ద ర్యాప్‌రౌండ్ టెయిల్‌ల్యాంప్‌లు ఉన్నాయి. సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ కారు లోపల కూడా దాని ప్రీమియం తత్వాన్ని కొనసాగిస్తుంది.

C5 Aircross ఫేస్‌లిఫ్ట్ మోడల్ ని ఆవిష్కరించిన Citroen; త్వరలో విడుదల

ఈ కారు లోపల సౌకర్యవంతమైన క్యాబిన్‌, గ్రే షేడ్‌లో ఉండే ఇంటీరియర్ థీమ్, చార్‌కోల్ గ్రే కలర్‌లో ఉండే ప్యాడెడ్ లెదర్ సీట్లు, క్లీన్ లుకింగ్ డ్యాష్‌బోర్డ్, తక్కువ భౌతిక బటన్‌లు, ఫుట్-ఆపరేటెడ్ ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్, ఇంజన్ స్టాప్-స్టార్ట్ బటన్, 12.3 ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఫోన్ మిర్రరింగ్ ఫంక్షన్‌తో కూడిన 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, యాపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ మొదలైన ఫీచర్లను కలిగి ఉంటుంది.

Most Read Articles

English summary
Citroen to launch c5 aircross facelift in india soon unveiled globally new features updates details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X