మహీంద్రా ఎక్స్‌యూవీ400 వర్సెస్ టాటా నెక్సాన్ ఈవీ: ఈ రెండింటిలో ఏ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ బెస్ట్?

మహీంద్రా తమ సరికొత్త ఎలక్ట్రిక్ కారు ఎక్స్‌యూవీ400 (Mahindra XUV400) తాజాగా భారత మార్కెట్లో ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. ఈ మోడల్ బుకింగ్‌లు మరియు అమ్మకాలు జనవరి 2023 నుండి ప్రారంభం కానున్నాయి. ఇది ఈ విభాగంలో నేరుగా టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV)తో పోటీపడుతుంది.

Recommended Video

Mahindra Scorpio-N ఆటోమేటిక్ మరియు ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్స్ ధరలు | వివరాలు

ప్రస్తుతం, టాటా నెక్సాన్ దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారుగా అగ్రస్థానంలో ఉంది. అయితే, ఇప్పుడు కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ400 రాకతో మార్కెట్లో సమీకరణాలు మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహీంద్రా ఎక్స్‌యూవీ400 మరియు టాటా నెక్సాన్ ఈవీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలలో ఏది బెస్ట్ అనే విషయాన్ని ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

మహీంద్రా ఎక్స్‌యూవీ400 వర్సెస్ టాటా నెక్సాన్ ఈవీ: ఈ రెండింటిలో ఏ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ బెస్ట్?

ఎక్స్‌యూవీ400 వర్సెస్ నెక్సాన్ ఈవీ: ఫీచర్లు

మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ కారు ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో లభిస్తుంది. ఇందులో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 ఎయిర్‌బ్యాగ్‌లు మొదలైనవి ఉన్నాయి. ఇంకా ఇందులో 60కి పైగా స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు ముందు భాగంలో ఫేక్ ఫ్రంట్ గ్రిల్, కారు లోపల మరియు వెలుపల కాపర్ కలర్ ఎలిమెంట్స్, డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్స్, డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ400 వర్సెస్ టాటా నెక్సాన్ ఈవీ: ఈ రెండింటిలో ఏ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ బెస్ట్?

టాటా నెక్సాన్ ఈవీ విషయానికి వస్తే, ఇందులోని టాప్-ఆఫ్ ది లైన్ అయిన లాంగ్ రేంజ్ వేరియంట్ నెక్సాన్ ఈవీ మ్యాక్స్ లో వెంటిలేటెడ్ సీట్లు, బేజ్ కలర్ ఇంటీరియర్, ఎయిర్ ప్యూరిఫైయర్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, కొత్త సెంటర్ కన్సోల్, క్రూయిజ్ కంట్రోల్ మరియు ఆటో డిమ్మింగ్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ మొదలైనవి ఉన్నాయి. కొత్త 2022 నెక్సాన్ ఈవీ అప్‌గ్రేడ్ చేయబడిన Z Connect 2.0 కనెక్టింగ్ కార్ టెక్నాలజీతో వస్తుంది. ఇందులో 48కి పైగా కనెక్టెడ్ ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ400 వర్సెస్ టాటా నెక్సాన్ ఈవీ: ఈ రెండింటిలో ఏ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ బెస్ట్?

ఎక్స్‌యూవీ400 వర్సెస్ నెక్సాన్ ఈవీ: బ్యాటరీ మరియు రేంజ్

మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో పెద్ద IP67 రేటెడ్ 39.5kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇందులో ఉపయోగించిన పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనస్ ఎలక్ట్రిక్ మోటార్ 147.5 బిహెచ్‌పి గరిష్ట పవర్ ను మరియు 310 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్ ఇండియన్ డ్రైవింగ్ సైకిల్ (MIDC) ప్రకారం, పూర్తి ఛార్జ్ పై 456 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది. ఇంకా ఇందులో సింగిల్ పెడల్ టెక్నాలజీ మరియు మూడు డ్రైవింగ్ మోడ్‌లు (ఫన్, ఫాస్ట్ మరియు ఫియర్‌లెస్) కూడా ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ400 వర్సెస్ టాటా నెక్సాన్ ఈవీ: ఈ రెండింటిలో ఏ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ బెస్ట్?

టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ విషయానికి వస్తే, ఇది కూడా ఇంచు మించు ఎక్స్‌యూవీ400కి సమానమైన బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. నెక్సాన్ ఈవీ మ్యాక్స్‌లో 40.5 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. ఈ పెద్ద బ్యాటరీని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఇది 437 కిలోమీటర్ల రేంజ్ ను (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం) అందిస్తుంది. నెక్సాన్ ఈవీలోని 105 kW ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 143 బిహెచ్‌పి శక్తిని మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో మూడు డ్రైవింగ్ మోడ్‌లు (ఎకో, సిటీ మరియు స్పోర్ట్) ఉంటాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ400 వర్సెస్ టాటా నెక్సాన్ ఈవీ: ఈ రెండింటిలో ఏ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ బెస్ట్?

ఎక్స్‌యూవీ400 వర్సెస్ నెక్సాన్ ఈవీ: పెర్ఫార్మెన్స్ మరియు ఛార్జింగ్ డీటేల్స్

మహీంద్రా ఎక్స్‌యూవీ400 కేవలం 8.3 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది మరియు గరిష్టంగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఇందులోని బ్యాటరీ ప్యాక్‌ను 50kW DC సూపర్ ఫాస్ట్ ఛార్జర్‌తో చార్జ్ చేసినప్పుడు కేవలం 50 నిమిషాల్లోనే 0 నుండి 80 శాతం వరకూ చార్జ్ అవుతుంది. అలాగే, ఇది 7.2 kW/32A మరియు 3.3 kW/16A స్టాండర్డ్ చార్జలను కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ చార్జర్ల సాయంతో బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేయడానికి వరుసగా 6.30 గంటలు మరియు 13 గంటల సమయం పడుతుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ400 వర్సెస్ టాటా నెక్సాన్ ఈవీ: ఈ రెండింటిలో ఏ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ బెస్ట్?

టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ విషయానికి వస్తే, 50 kW DC ఫాస్ట్ చార్జర్ సాయంతో ఈ బ్యాటరీని కేవలం 56 నిమిషాల్లో 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే, నెక్సాన్ ఈవీ మ్యాక్స్ కూడా 3.3 kW మరియు 7.2 kW AC ఫాస్ట్ ఛార్జర్ ఆప్షన్లను సపోర్ట్ చేస్తుంది. ఈ 7.2 kW AC ఫాస్ట్ ఛార్జర్‌ను ఇంట్లో లేదా కార్యాలయంలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. దీనితో, SUV ఛార్జ్ చేయడానికి 6.5 గంటలు పడుతుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ400 వర్సెస్ టాటా నెక్సాన్ ఈవీ: ఈ రెండింటిలో ఏ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ బెస్ట్?

ఎక్స్‌యూవీ400 వర్సెస్ నెక్సాన్ ఈవీ: కలర్ ఆప్షన్లు

మహీంద్రా ఎక్స్‌యూవీ400 మొత్తం ఐదు రంగులలో లభిస్తుంది. ఇందులో ఆర్కిటిక్ బ్లూ, ఎవరెస్ట్ వైట్, గెలాక్సీ గ్రే, నపోలీ బ్లాక్ విత్ కాపర్ కలర్ రూఫ్ మరియు బ్లూ శాటిన్ విత్ కాపర్ కలర్ రూఫ్‌ ఆప్షన్లతో లభిస్తుంది. ఇక టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ విషయానికి వస్తే, ఇది మూడు రంగులలో మాత్రమే లభిస్తుంది. ఇందులో ఇంటెన్స్ టీల్, డేటోనా గ్రే మరియు ప్రిస్టైన్ వైట్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి.

Most Read Articles

English summary
Comparison between mahindra xuv400 and tata nexon ev features specs range and more
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X