ఎలక్ట్రిక్ కార్లను కూడా భారత్‌లో తయారు చేయం: ఫోర్డ్ ఇండియా

అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్ (Ford) ఇప్పటికే భారతదేశంలో తమ వాహనాల ఉత్పత్తిని నిలిపివేసిన సంగతి మనందరికీ తెలిసినదే. దేశంలో వస్తున్న వరుస నష్టాల కారణంగా, ఇకపై ఇక్కడ వ్యాపారం కొనసాగించడం కష్టమని, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆ సమయంలో ఫోర్డ్ తెలిపింది. అయితే, ఆ తర్వాత ఫోర్డ్ ఇండియా, భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయాలని ప్లాన్ చేసింది. మరి ఏం జరిగిందో ఏమో కానీ, ఇప్పుడు ఆ ప్లాన్స్ ను కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు ఈ అమెరికన్ కంపెనీ తెలిపింది.

ఎలక్ట్రిక్ కార్లను కూడా భారత్‌లో తయారు చేయం: ఫోర్డ్ ఇండియా

భారతదేశంలో ఫోర్డ్ ఇండియా కొనసాగిస్తున్న వ్యాపార పునర్నిర్మాణంలో భాగంగా భారత ప్రభుత్వ ఉత్పత్తి లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ PLI ప్రణాళిక ప్రకారం, ఫోర్డ్ ఎగుమతి మరియు దేశీయ మార్కెట్ల కోసం ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడానికి దాని రెండు తయారీ సౌకర్యాలలో ఒకదాన్ని ఉపయోగిస్తుందని గతంలో తెలిపింది. అయితే, ఇప్పుడు భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని ప్రారంభించడం లేదని కంపెనీ ప్రకటించింది.

ఎలక్ట్రిక్ కార్లను కూడా భారత్‌లో తయారు చేయం: ఫోర్డ్ ఇండియా

ఫోర్డ్ ఇండియా యొక్క అధిరాకిరిక ప్రకటన ప్రకారం, "జాగ్రత్తగా సమీక్షించిన తర్వాత, మేము ఏ భారతీయ ప్లాంట్ నుండి ఎగుమతి చేయడానికి ఈవీ తయారీని కొనసాగించకూడదని నిర్ణయించుకున్నాము. ఉత్పత్తి అనుబంధిత ప్రోత్సాహకాల క్రింద మా ప్రతిపాదనను భారత ప్రభుత్వం ఆమోదించినందుకు మేము సంతోషిస్తున్నాము. ఇందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు" అని పేర్కొనబడి ఉంది.

ఎలక్ట్రిక్ కార్లను కూడా భారత్‌లో తయారు చేయం: ఫోర్డ్ ఇండియా

భారత్‌లో భారీ నష్టం.. అందుకే వ్యాపారం నిలిపేశాం..

గతంలో ఫోర్డ్ ఇండియా పేర్కొన్న సమాచారం ప్రకారం, భారతదేశంలో గడచిన 10 ఏళ్ల కాలంలో ఈ అమెరికన్ కంపెనీ సుమారు 2 బిలియన్ డాలర్ల వరకు నష్టపోయినట్లు తెలిపింది. ఈ పరిస్థితుల్లో తాము వ్యాపారాన్ని కొనసాగించలేమని, అందుకే, ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పడం లేదని కంపెనీ పేర్కొంది. గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి భారతదేశంలోని రెండు ప్లాంట్లలో ఫోర్డ్ తమ వాహనాల ఉత్పత్తిని నిలిపివేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారతదేశం నుండి ఎగుమతి చేయబడే ఇంజన్ల ఉత్పత్తిని కూడా కంపెనీ నిలిపివేయబోతోంది.

ఎలక్ట్రిక్ కార్లను కూడా భారత్‌లో తయారు చేయం: ఫోర్డ్ ఇండియా

భారత్‌కు కార్లను ఎగుమతి చేస్తామంటున్న ఫోర్డ్..

అయితే, ఫోర్డ్ భారతదేశంలో తమ వాహనాల ఉత్పత్తిని నిలిపివేసినప్పటికీ, కొత్త కార్లను విదేశాల నుండి భారత్‌కు ఎగుమతి చేయడాన్ని కొనసాగిస్తామని కంపెనీ ఆ సమయంలో తెలిపింది. మరే దేశంలోనైనా తయారు చేసేందుకు వీలుగా ఎలక్ట్రిక్ కార్ల రెడీమేడ్ యూనిట్లను భారత్‌లో విక్రయించనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫోర్డ్ ప్లాంట్‌లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్న టాటా మోటార్స్ మరియు హ్యుందాయ్‌ కంపెనీలతో కూడా ఫోర్డ్ ఇప్పటికే చర్చలు కూడా జరుపుతున్నట్లు సమాచారం.

ఎలక్ట్రిక్ కార్లను కూడా భారత్‌లో తయారు చేయం: ఫోర్డ్ ఇండియా

గుజరాత్‌లోని సనంద్ ప్లాంట్ కొనుగోలుపై టాటా ఆసక్తి..

ఫోర్డ్ గత సంవత్సరం భారతదేశంలో ఉత్పత్తిని నిలిపివేయాలని తీసుకున్న నిర్ణయం తరువాత, ప్రముఖ భారతీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్, ఈ అమెరికన్ కంపెనీ యొక్క సనంద్ ప్లాంట్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపింది. సనంద్ ప్లాంట్‌లో ఫోర్డ్ మోటార్స్ ఇప్పటికే రూ.4,500 కోట్లు పెట్టుబడిని వెచ్చించిది. ఫోర్డ్ మోటార్స్ యొక్క ఈ ప్లాంట్ సామర్థ్యం ప్రతి సంవత్సరం 2.5 లక్షల నుండి 2.7 లక్షల ఇంజన్లను తయారు చేస్తుంది.

ఎలక్ట్రిక్ కార్లను కూడా భారత్‌లో తయారు చేయం: ఫోర్డ్ ఇండియా

భారత్‌కు వచ్చే ఎలక్ట్రిక్ కార్ ఫోర్డ్ మస్టాంగ్ మాక్-ఇ..?

భారత్‌లో ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెడతామని ఫోర్డ్ ప్రకటించడంతో, ఈ బ్రాండ్ నుండి రాబోయే మొదటి ఎలక్ట్రిక్ కారు ఫోర్డ్ మస్టాంగ్ మాక్-ఇ (Ford Mustang Mach-e) అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారును తమ పాపులర్ స్పోర్ట్స్ కారు అయిన Mustang GT ని ఆధారంగా చేసుకొని రూపొందించింది. అయితే, మస్టాంగ్ జిటి స్పోర్ట్స్ కార్ కూప్ స్టైల్ బాడీని కలిగి ఉంటే, ఈ కొత్త మస్టాంగ్ మాక్-ఇ ఎలక్ట్రిక్ కారు మాత్రం ఎస్‌యూవీ లేదా క్రాసోవర్ టైప్ బాడీని కలిగి ఉంటుంది.

ఎలక్ట్రిక్ కార్లను కూడా భారత్‌లో తయారు చేయం: ఫోర్డ్ ఇండియా

ఫోర్డ్ మస్టాంగ్ మాక్-ఇ ఎలక్ట్రిక్ కారులో స్టాండర్ మస్టాంగ్ తరహా మాదిరిగా కనిపించే ఫాక్స్ ఫ్రంట్ గ్రిల్, ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్స్ మరియు టర్న్ ఇండికేటర్లతో కూడిన సన్నటి ఎల్ఈడి ఫాగ్‌ల్యాంప్స్, మస్టాంగ్ స్టైల్ సిగ్నేచర్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, డ్యూయల్ టోన్ రూఫ్, ఆటోమేటిక్ డోర్స్ మరియు స్టైలిష్ అల్లాయ్ వీల్స్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇది వేర్వేరు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తుంది. యూజర్లు ఎంచుకునే బ్యాటరీ సామర్థ్యాన్ని ఆయా వేరియంట్ల రేంజ్ మారుతూ ఉంటుంది.

ఎలక్ట్రిక్ కార్లను కూడా భారత్‌లో తయారు చేయం: ఫోర్డ్ ఇండియా

ఈ ఎలక్ట్రిక్ కారులో 68 kWh సామర్థ్యం కలిగిన బ్యాటరీని స్టాండర్డ్ బ్యాటరీ ప్యాక్‌గా అందిస్తుండగా, లాంగ్ రేంజ్ వేరియంట్ల కోసం ఇందులో 88 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ ను అందిస్తున్నారు. ఇందులోని చిన్న బ్యాటరీ ప్యాక్ పూర్తి చార్జ్ పై గరిష్టంగా 370 కిమీ రేంజ్ ను ఆఫర్ చేస్తుండగా, పెద్ద బ్యాటరీ గరిష్టంగా 483 కిమీ వరకు రేంజ్ ను ఆఫర్ చేస్తుందని కంపెనీ చెబుతోంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం 3.8 సెకన్లలోనే గంటకు 0 నుండి 96 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది

ఎలక్ట్రిక్ కార్లను కూడా భారత్‌లో తయారు చేయం: ఫోర్డ్ ఇండియా

ఫోర్డ్ మస్టాంగ్ మాక్-ఇ ఎలక్ట్రిక్ ఆల్-వీల్ డ్రైవ్ మరియు రియర్ వీల్ డ్రైవ్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 270 బిహెచ్‌పి పవర్ ను మరియు 430 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్‌ లో దీని టార్క్ 580 ఎన్ఎమ్‌ గా ఉంటుంది.

Most Read Articles

Read more on: #ఫోర్డ్ #ford
English summary
Ford make in india electric cars plan dropped details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X