'జెకె టైర్' ఆవిష్కరించిన కొత్త టైర్లు.. వీటి స్పెషాలిటీ ఏంటో తెలుసా?

భారతీయ మార్కెట్లో ప్రముఖ టైర్ తయారీ సంస్థ 'జెకె టైర్స్' (JK Tyres) ఎలక్ట్రిక్ వాహనాల కోసం సరికొత్త టైర్లను ఆవిష్కరించింది. కంపెనీ ఆవిష్కరించిన ఈ కొత్త టైర్లను గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

JK Tyres విడుదల చేసిన కొత్త టైర్లు.. వీటి స్పెషాలిటీ ఏంటో తెలుసా?

దేశీయ మార్కెట్లో రోజురోజుకి ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరిగిపోతున్న సమయంలో 'జెకె టైర్స్' (JK Tyres) ఆధునిక టెక్నాలజీతో ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం టైర్లను ఆవిష్కరించింది. కావున ఎలక్ట్రిక్ బస్సులు, కార్లు మొదలైనవి ఈ టైర్లను ఉపయోగించుకోవచ్చు.

JK Tyres విడుదల చేసిన కొత్త టైర్లు.. వీటి స్పెషాలిటీ ఏంటో తెలుసా?

ఈ ఆధునిక టైర్లను అత్యాధునిక గ్లోబల్ టెక్నాలజీ సెంటర్ - 'రఘుపతి సింఘానియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (RPSCOE) లోని ఇంజనీర్లు రూపొందించారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ యొక్క ప్రత్యేక అవసరాలను తీర్చడానికి ఈ టైర్లు ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. JK టైర్ ఎలక్ట్రిక్ వాహనాల యొక్క నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి అనుకూలంగా అభివృద్ధి చేయడమే కాకుండా.. అల్ట్రా-లో రోలింగ్ రెసిస్టెన్స్, తడి మరియు పొడి ప్రదేశాల్లో కూడా మంచి పనితీరుని అందించడానికి ఇవి చక్కగా సరిపోయే విధంగా ఉన్నాయి.

JK Tyres విడుదల చేసిన కొత్త టైర్లు.. వీటి స్పెషాలిటీ ఏంటో తెలుసా?

ఈ లేటెస్ట్ టైర్లు E-ట్రక్కులు, E-బస్, E-LCV, E-PV, E-SUV మరియు E-టూ వీలర్స్ వాహనాల డిమాండ్ పనితీరు అవసరాలను తీర్చడానికి రూపొందించబడ్డాయి. EV టైర్ రేంజ్ బస్సులు, ట్రక్కులు మరియు LCV ల యొక్క అన్ని వర్గాల కోసం 17.5 ఇంచెస్ మరియు 22.5 ఇంచెస్ ట్యూబ్‌లెస్ పరిమాణాలలో అభివృద్ధి చేయబడింది.

JK Tyres విడుదల చేసిన కొత్త టైర్లు.. వీటి స్పెషాలిటీ ఏంటో తెలుసా?

ప్రస్తుతం, JBM E-బస్సులకు EV రేంజ్ టైర్లు (255/70R22.5 మరియు 295/80R22.5) సరఫరా చేయబడుతున్నాయి. JK టైర్ & ఇండస్ట్రీస్ టెక్నికల్ డైరెక్టర్ VK మిశ్రా కంపెనీ నిర్వహించిన కార్యక్రమంలో ఈ టైర్లను ప్రదర్శించారు.

JK Tyres విడుదల చేసిన కొత్త టైర్లు.. వీటి స్పెషాలిటీ ఏంటో తెలుసా?

ఈ సందర్భంగా VK మిశ్రా మాట్లాడుతూ.. JK టైర్‌ కంపెనీ కస్టమర్ల అవసరాలను తీర్చడానికి మరియు పరిశ్రమల అవసరాలను తీర్చడానికి ఈ ఆధునిక టైర్లను విడుదల చేయడం జరిగింది అన్నారు. ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన రంగం పరుగులు తీస్తుంది, ఈ సమయంలో ఇలాటి ఉత్పత్తులు ఎంతైనా అవసరం అన్నారు. అంతే కాకూండా కంపెనీ రానున్న రోజుల్లో కూడా ఇలాంటి ఆధునిక ఉత్పతులపైన పనిచేస్తుందన్నారు. ఇవనీ తప్పకుండా వినియోగదారులను ఆకర్షిస్తాయని మేము విశ్వసిస్తున్నామన్నారు.

JK Tyres విడుదల చేసిన కొత్త టైర్లు.. వీటి స్పెషాలిటీ ఏంటో తెలుసా?

JK టైర్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్ భారతదేశంలో అగ్రగామి టైర్ల తయారీ సంస్థ మాత్రమే కాదు, ప్రపంచంలోని టాప్ 25 తయారీదారులలో ఒకటిగా నిలిచింది. దీనికి ప్రధాన కారణం వినియోగదారులు కంపెనీ యొక్క ఉత్పత్తులపైన ఉంచుకున్న నమ్మకమే.

JK Tyres విడుదల చేసిన కొత్త టైర్లు.. వీటి స్పెషాలిటీ ఏంటో తెలుసా?

ఇదిలా ఉండగా సియట్ టైర్స్ కంపెనీ కూడా భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన శబ్ధం రాని టైర్లను విడుదల చేసింది. సియట్ ఎనర్జీడ్రైవ్ టైర్స్ పేరుతో విడుదలైన ఈ టైర్లు ఎలక్ట్రిక్ కార్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సైలెంట్ టెక్నాలజీపై ఆధారపడి ఉన్నాయని మరియు ఇవి ఎలక్ట్రిక్ కార్ల యొక్క రేంజ్ ని పెంచడంలో కూడా ప్రభావవంతంగా ఉంటాయని కంపెనీ పేర్కొంది. ఎలక్ట్రిక్ కార్లలో ఇంజన్లు ఉండవు కాబట్టి అవి చాలా నిశ్శబ్దంగా ఉంటాయి, దీని కారణంగా ఎలక్ట్రిక్ కారు క్యాబిన్‌లో టైర్ శబ్దం ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది.

JK Tyres విడుదల చేసిన కొత్త టైర్లు.. వీటి స్పెషాలిటీ ఏంటో తెలుసా?

ఈ నేపథ్యంలో, సియట్ టైర్స్ యొక్క కొత్త ఎనర్జీడ్రైవ్ టైర్లు రోడ్డు ఉపరితలంపై నడుస్తున్నప్పుడు తక్కువ శబ్దం వచ్చేలా రూపొందించబడ్డాయి. ఈ టైర్లు కంపనాలను గ్రహించడం ద్వారా శబ్దాన్ని తగ్గిస్తాయని కంపెనీ తెలిపింది. సియట్ ఎనర్జీడ్రైవ్ టైర్లు ఉపరితలంతో సంబంధంలో ఉన్నప్పుడు తక్కువ డ్రాగ్‌ను ఉత్పత్తి చేయడానికి వీలుగా ప్రత్యేకంగా రూపొందించబడిందని, ఫలితంగా ఇవి ఎలక్ట్రిక్ కారు యొక్క పరిధిని (రేంజ్‌ను) పెంచడంలో సహాయపడుతాయని కంపెనీ తెలిపింది.

JK Tyres విడుదల చేసిన కొత్త టైర్లు.. వీటి స్పెషాలిటీ ఏంటో తెలుసా?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి మరియు వినియోగం పెరుగుతూనే ఉన్నాయి. ఈ సమయంలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం తప్పకుండా ఇటువంటి ప్రత్యేకమైన టైర్లు చాలా అవసరం. దీనిని దృష్టిలో ఉంచుకుని 'జేకే టైర్' కంపెనీ ఈ లేటెస్ట్ టైర్లను ఆవిష్కరించింది. ఇవి తప్పకుండా మార్కెట్లో మంచి ఆదరణ పొందుతాయని భావిస్తున్నాము.ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన వార్తలతో పాటు.. కొత్త కార్లు మరియు బైకుల గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ ఫాలో అవ్వండి.

Most Read Articles

Read more on: #టైర్లు #tyres
English summary
Jk tyres india launched electric vehicles specific tyres details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X